Layoffs: కొనసాగుతోన్న ఉద్యోగుల తొలగింపు.. మరోసారి ఎంప్లాయిస్‌ని ఇంటికి పంపించిన ట్విట్టర్‌. ఈసారి ఏకంగా..

|

Feb 27, 2023 | 2:27 PM

ఆర్థిక మాంద్యం నేపథ్యంలో ఇప్పటికే చాలా కంపెనీలు ఉద్యోగులను తొలగించాయి. మొన్నటి వరకు వీటికి సంబంధించిన వార్తలే తెగ చక్కర్లు కొట్టాయి. గూగుల్‌, ఫేస్‌బుక్‌ వంటి అంతర్జాతీయ సంస్థలు సైతం ఉద్యోగులను..

Layoffs: కొనసాగుతోన్న ఉద్యోగుల తొలగింపు.. మరోసారి ఎంప్లాయిస్‌ని ఇంటికి పంపించిన ట్విట్టర్‌. ఈసారి ఏకంగా..
Twitter Layoff
Follow us on

ఆర్థిక మాంద్యం నేపథ్యంలో ఇప్పటికే చాలా కంపెనీలు ఉద్యోగులను తొలగించాయి. మొన్నటి వరకు వీటికి సంబంధించిన వార్తలే తెగ చక్కర్లు కొట్టాయి. గూగుల్‌, ఫేస్‌బుక్‌ వంటి అంతర్జాతీయ సంస్థలు సైతం ఉద్యోగులను నిర్ధాక్షణ్యంగా ఇంటికి సాగనంపాయి. అయితే ఇటీవల లేఆఫ్స్‌కి సంబంధించి వార్తలు కాస్త తగ్గుముఖం పడుతున్నాయని అనుకుంటున్న సమయంలోనే ఉద్యోగులకు ట్విట్టర్‌ మరో షాక్‌ ఇచ్చింది. ఇప్పటికే భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగించిన ట్విట్టర్‌ తాజాగా మరోసారి ఉద్యోగులను తొలగించింది. ఈసారి ట్విట్టర్‌ ఏకంగా ఏకంగా 200 మంది ఉద్యోగులను తొలగించనట్లు సమాచారం.

ఇందులో ప్రోడక్ట్ మేనేజర్లు, డేటా సైంటిస్టులు, ఇంజనీర్లు ఉన్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే ట్విట్టర్‌ ఈ తొలగింపులపై ఇంకా ఎలాంటి అధికారిక సమాచారం వెల్లడించలేదు. ఇదిలా ఉంటే ట్విట్టర్ బ్లూ ఇన్‍చార్జ్‌గా ఉన్న ఎస్తేర్ క్రాఫోర్డ్ పేరు కూడా తొలగించిన ఉద్యోగుల జాబితాలో ఉందని సంబంధిత వర్గాల నుంచి సమాచారం. ట్విట్టర్‌లో ప్రస్తుతం 2,300 మంది ఉద్యోగులు ఉన్నారని గత నెలలో ఎలాన్ మస్క్ తెలిపిన విషయం తెలిసిందే. అయితే తాజాగా తొలగించిన ఉద్యోగుల ప్రకారం ఈ సంఖ్య మరింత తగ్గనుంది.

గతేడాది నవంబర్‌లో ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ట్విట్టర్‌ ప్రకటించింది. ఆ సమయంలో, కంపెనీ ఖర్చులను తగ్గించుకోవడంతో పాటు, కంపెనీ ఎదుర్కొనే నష్టాలను కూడా అదుపు చేయడానికి ఉద్యోగులను తొలగించినట్లు మస్క్ తెలిపారు. ఉద్యోగుల తొలగింపు సమయంలో మరోసారి ఉద్యోగులను తొలగించమని మస్క్‌ తెలిపారు. అయితే తాజాగా మరోసారి ఉద్యోగులను తొలగించిన ట్విట్టర్‌ చర్చకు తెర తీసింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..