TSPSC: నిరుద్యోగులకు అలర్ట్‌.. మొదలైన జూనియర్‌ లెక్చరర్‌ పోస్టుల అప్లికేషన్స్‌. ఎలా అప్లై చేసుకోవాలంటే..

|

Dec 20, 2022 | 3:47 PM

తెలంగాణ రాష్ట్రంలో 1392 జూనియర్‌ లెక్చరర్‌ పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్‌సీ నోటిఫికేషన్‌ జారీ చేసిన విషయం తెలిసిందే. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిత తర్వాత ఇంత భారీ సంఖ్యలో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల చేయడం తొలిసారి కావడం విశేషం. దీంతో నిరుద్యోగులు భారీ ఎత్తున దరఖాస్తు..

TSPSC: నిరుద్యోగులకు అలర్ట్‌.. మొదలైన జూనియర్‌ లెక్చరర్‌ పోస్టుల అప్లికేషన్స్‌. ఎలా అప్లై చేసుకోవాలంటే..
Tspsc
Follow us on

తెలంగాణ రాష్ట్రంలో 1392 జూనియర్‌ లెక్చరర్‌ పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్‌సీ నోటిఫికేషన్‌ జారీ చేసిన విషయం తెలిసిందే. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిత తర్వాత ఇంత భారీ సంఖ్యలో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల చేయడం తొలిసారి కావడం విశేషం. దీంతో నిరుద్యోగులు భారీ ఎత్తున దరఖాస్తు చేసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇదిలా ఉంటే దరఖాస్తుల స్వీకరణకు టీఎస్‌పీఎస్‌ అవకాశం కల్పించింది. నిజానికి దరఖాస్తుల స్వీకరణ డిసెంబర్‌ 16వ తేదీ నుంచి ప్రారంభమై జనవరి 6వ తేదీతో ముగియాల్సి ఉంది. కానీ డిసెంబర్‌ 20న మొదలైన దరఖాస్తుల స్వీకరణ జనవరి 10వ తేదీ సాయంత్రం 5 గంటలకు ముగియనుంది. ఈ నేపథ్యంలో నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తివివరాలు, ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

జూనియర్‌ లెక్చరర్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టుల్లో పీజీ(ఎంఏ, ఎమ్మెస్సీ, ఎంకాం) సెకండ్ క్లాస్ పూర్తి చేసి ఉండాలి. లేదా బీఏ ఆనర్స్ , బీఎస్సీ ఆనర్స్ లేదా బీకాం ఆనర్స్లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఉర్దూ మీడియం, మారాఠీ భాషలకు సంబంధించి సబ్జెక్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పదో తగరతి వరకు మరాఠీ, ఉర్దూ భాషలో చదువుకొని ఉండాలి. లేదా మొదటి భాషగా ఉర్దూ/ మరాఠీ పదో తరగతిలో చదువుకొని ఉండాలి. దీంతో పాటు.. ఉర్దూ/మరాఠీ సెకండ్ భాషగా బ్యాచ్‌లర్‌ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. ఇదిలా ఉంటే సివిక్స్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పొలిటికల్ సైన్స్ లేదా పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లో 50 శాతం మార్కులతో పీజీ పూర్తి చేసి ఉండాలి. సివిక్స్ (ఉర్దూ మీడియం), సివిక్స్ (మారాఠీ) పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పదో తగరతి వరకు మరాఠీ, ఉర్దూ భాషలో చదువును పూర్తి చేసి ఉండాలి. లేదా మొదటి భాషగా ఉర్దూ, మరాఠీ పదో తరగతిలో చదువుకొని ఉండాలి. దీంతో పాటు.. ఉర్దూ/మరాఠీ సెకండ్ భాష గా బ్యాచ్ లర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.

ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే..

ఇందుకోసం అభ్యర్థులు ముందుగా తెలంగాణ సర్వీస్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. వెంటనే జూనియర్‌ లెక్చరర్స్‌కు సంబంధించిన అప్లికేషన్‌ ఫామ్‌ ఓపెన్‌ అవుతుంది. అందులో మీరు ఏ సబ్జెక్ట్‌ కోసం అప్లై చేస్తున్నారో దాన్ని సెలక్ట్ చేసుకోవాలి. అంనతరం మీ టీఎస్‌పీఎస్‌ ఐడీని ఎంటర్‌ చేసి, చివరిగా పుట్టిన తేదీ వివరాలను అందించాలి. అనంతరం మీ రిజిస్టర్‌ మొబైల్‌ నెంబర్‌కు ఓటీపీ వెళుతుంది. ఓటీపీని ఎంటర్‌ చేసిన తర్వాత ఫొటో, సైన్‌తో సహా పూర్తి వివరాలతో కూడిన అప్లికేషన్‌ ఫామ్‌ ఓపెన్‌ అవుతుంది. వివరాలన్నింటినీ చెక్‌ చేసుకోని సబ్‌మిట్ చేయాలి. చివరిగా అప్లికేషన్‌ ఫీజును చెల్లిస్తే సరిపోతుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..