TSPSC JL Final Selection List: జూనియర్‌ లెక్చరర్‌ పోస్టుల ఫైనల్ లిస్ట్ వచ్చేసింది.. ఒక్క క్లక్‌తో ఇక్కడ చెక్‌ చేసుకోండి

|

Oct 23, 2024 | 2:38 PM

తెలంగాణ జూనియర్‌ లెక్చరర్‌ పోస్టుల తుది జాబితా ఎట్టకేలకు వచ్చేసింది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేలాది మంది అభ్యర్ధుల నిరీక్షణకు తెరపడింది. ఎంపిక జాబితాను తాజాగా కమిషన్ వెబ్ సైట్ లోకి అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ కింది డైరెక్ట్ లింక్ ద్వారా సెలక్షన్ లిస్ట్ ను ..

TSPSC JL Final Selection List: జూనియర్‌ లెక్చరర్‌ పోస్టుల ఫైనల్ లిస్ట్ వచ్చేసింది.. ఒక్క క్లక్‌తో ఇక్కడ చెక్‌ చేసుకోండి
TSPSC JL Final Selection List
Follow us on

హైదరాబాద్‌, అక్టోబర్‌ 23: తెలంగాణ జూనియర్‌ లెక్చరర్‌ పోస్టుల తుది ఫలితాలను తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (TGPSC) విడుదల చేసిన సంగతి తెలిసిందే. జూనియర్‌ లెక్చరర్‌ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల తుది జాబితాను టీజీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇప్పటికే సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ పూర్తి చేసిన టీజీపీఎస్సీ.. తాజాగా ఫైనల్‌ రిజల్ట్స్‌ జాబితాను వెబ్‌సైట్‌లో అందుబాటులోకి తీసుకువచ్చింది.

కాగా తెలంగాణలోని ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో మొత్తం 1392 జూనియర్‌ లెక్చరర్‌ పోస్టుల భర్తీకి సంబంధించి టీజీపీఎస్సీ నియామక ప్రక్రియ చేపట్టింది. దీనిలో భాగంగా గతేడాది సెప్టెంబర్‌ 12 నుంచి అక్టోబర్‌ 3 వరకు ఆన్‌లైన్‌ విధానంలో రాత పరీక్ష నిర్వహించింది. ఈ పరీక్షలో అభ్యర్థులు సాధించిన మార్కుల ఆధారంగా జనరల్‌ ర్యాంకుల జాబితాను ఈ ఏడాది జులై నెలలో కమిషన్‌ విడుదల చేసింది. 1:2 నిష్పత్తిలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ నిర్వహించారు. పీడబ్ల్యూడీ అభ్యర్థులకు 1:5 నిష్పత్తిలో వెరిఫికేషన్‌ పూర్తి చేశారు. తాజాగా తుది ఫలితాలను వెల్లడించింది.

టీజీపీఎస్సీ జూనియర్‌ లెక్చరర్‌ పోస్టుల ఫైనల్ లిస్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి

టీజీపీఎస్సీ గ్రూప్‌ 1 మెయిన్స్‌కు రెండో రోజు 69 శాతం మాత్రమే హాజరు

టీజీపీఎస్సీ గ్రూప్‌ 1 మెయిన్స్‌ పరీక్ష రెండో రోజు కూడా ప్రశాంతంగా జరిగింది. అక్టోబరు 22న అభ్యర్థులు మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జనరల్‌ ఎస్సే పరీక్షకు హాజరయ్యారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లో ఏర్పాటు చేసిన మొత్తం 46 పరీక్ష కేంద్రాల్లో 31,383 మందికి గాను 21,817 మంది మాత్రమే హాజరయ్యారు. అంటే 69.51 శాతం అభ్యర్ధులు పరీక్ష రాశారు. ఇక పోలీసులు పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ఠ బందోబస్తును కొనసాగిస్తున్నారు. ఈరోజు మూడో పరీక్ష జరగనుంది.

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.