TSPSC Group-IV Jobs: బ్రేకింగ్..! తెలంగాణ గ్రూప్‌-4 ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ వాయిదా.. తిరిగి ఎప్పట్నుంచంటే..

తెలంగాణలో నిరుద్యోగులకు అలర్ట్‌! నేటి నుంచి ప్రారంభంకావల్సిన టీఎస్పీయస్సీ గ్రూప్‌-4 ఆన్‌లైన్‌ దరఖాస్తు స్వీకరణ ప్రక్రియ వాయిదా పడింది. గతంలో విడుదల చేసిన నోటిఫికేషన్‌ ప్రకారం..

TSPSC Group-IV Jobs: బ్రేకింగ్..! తెలంగాణ గ్రూప్‌-4 ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ వాయిదా.. తిరిగి ఎప్పట్నుంచంటే..
Tspsc Group Iv Online Application

Updated on: Dec 23, 2022 | 10:47 AM

తెలంగాణలో నిరుద్యోగులకు అలర్ట్‌! నేటి నుంచి ప్రారంభంకావల్సిన టీఎస్పీయస్సీ గ్రూప్‌-4 ఆన్‌లైన్‌ దరఖాస్తు స్వీకరణ ప్రక్రియ వాయిదా పడింది. గతంలో విడుదల చేసిన నోటిఫికేషన్‌ ప్రకారం దరఖాస్తు విధానం డిసెంబర్‌ 23 నుంచి జనవరి 12 వరకు కొనసాగనున్నట్లు ప్రకటింది. ఐతే సాంకేతిక కారణాల రిత్య ఈ రోజు నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభించడంలేదని కమిషన్‌ తెల్పింది. తిరిగి డిసెంబ‌రు 30 నుంచి జనవరి 19 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు ప్రకటించింది.

కాగా మొత్తం 9,168 పోస్టులకు ఇప్పటికే టీఎస్‌పీఎస్సీ ప్రకటన జారీ చేసింది. వీటిల్లో జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టులు 6,859, వార్డు ఆఫీసర్‌ పోస్టులు 1,862, పంచాయితీరాజ్‌శాఖలో 1,245 పోస్టులు, 429 జూనియర్‌ అకౌంటెంట్‌ పోస్టులు, 18 జూనియర్‌ ఆడిటర్‌ పోస్టులు ఉన్నాయి. త్వరలో గ్రూప్‌-2, 3 పోస్టులకు సంబంధించిన ఉద్యోగ ప్రకటనలు జారీ కానున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.