TSACS jobs: డిగ్రీ అర్హతతో..తెలంగాణ ఎయిడ్స్‌ కంట్రోల్‌ సొసైటీలో ఉద్యోగాలు.. ఇలా దరఖాస్తు చేసుకోండి..

|

Mar 12, 2022 | 8:13 AM

నేషనల్‌ ఎయిడ్స్‌ అండ్‌ ఎస్‌టీడీ ప్రోగ్రాం కింద తెలంగాణలోని టీఎస్‌ స్టేట్‌ ఎయిడ్స్‌ కంట్రోల్‌ సొసైటీ (TSACS) ఒప్పంద ప్రాతిపదికన పలు ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి..

TSACS jobs: డిగ్రీ అర్హతతో..తెలంగాణ ఎయిడ్స్‌ కంట్రోల్‌ సొసైటీలో ఉద్యోగాలు.. ఇలా దరఖాస్తు చేసుకోండి..
Tsacs
Follow us on

TSACS Recruitment 2022: నేషనల్‌ ఎయిడ్స్‌ అండ్‌ ఎస్‌టీడీ ప్రోగ్రాం కింద తెలంగాణలోని టీఎస్‌ స్టేట్‌ ఎయిడ్స్‌ కంట్రోల్‌ సొసైటీ (TSACS) ఒప్పంద ప్రాతిపదికన పలు ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 34

పోస్టుల వివరాలు:

  • ఐసీటీసీ కౌన్సెలర్ పోస్టులు: 16

అర్హతలు: సంబంధిత స్పెషలైజేషన్లో పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిగ్రీ/డిప్లొమాలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో ఒక సంవత్సరం అనుభవంతోపాటు కంప్యూటర్‌ నాలెడ్జ్‌ కూడా ఉండాలి.

పే స్కేల్‌: నెలకు రూ.13,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.

  • డీఎస్‌ఆర్‌సీ కౌన్సెలర్ పోస్టులు: 10

అర్హతలు: సంబంధిత స్పెషలైజేషన్లో పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిగ్రీ/డిప్లొమాలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో ఒక సంవత్సరం అనుభవంతోపాటు కంప్యూటర్‌ నాలెడ్జ్‌ కూడా ఉండాలి.

పే స్కేల్‌: నెలకు రూ.13,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.

  • ఐసీటీసీ ల్యాబ్‌ టెక్నీషియన్‌ పోస్టులు: 10

అర్హతలు: మెడికల్‌ ల్యాబ్‌ టెక్నీషియన్‌లో బీఎస్సీ ఉత్తీర్ణత ఉండాలి. అలాగే సంబంధిత పనిలో ఒక సంవత్సరం అనుభవంతోపాటు కంప్యూటర్‌ నాలెడ్జ్‌ కూడా ఉండాలి.

పే స్కేల్‌: నెలకు రూ.13,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 60 ఏళ్లకు మించరాదు.

ఎంపిక విధానం: రాత పరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

అడ్రస్‌: నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా ఆయా సెంటర్లకు అప్లికేషన్‌ను పంపించాలి.

దరఖాస్తులకు చివరి తేదీ: మార్చి 31, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

Vijayawada Railway jobs: రాత పరీక్షలేకుండానే విజయవాడ సౌత్‌ సెంట్రల్‌ రైల్వేలో ఉద్యోగాలు.. పూర్తి వివరాలివే..