Telangana: టెట్ ఎగ్జామ్ నిర్వహణకు సర్వం సిద్ధం.. జిల్లాల వారీగా పరీక్షా కేంద్రాల వివరాలు ఇవే!

Telangana TET Exam: తెలంగాణ టెట్ ఎగ్జామ్ నిర్వహణకు సర్వం సిద్ధమైంది. జనవరి 3 నుంచి జనవరి 20 వరకు రాష్ట్రవ్యాప్తంగా ఆన్‌లైన్ విధానంలో ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. అందుకు అన్ని ఏర్పాట్లు పూర్తైనట్లు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ , టెట్ చైర్మన్ నవీన్ నికోలస్ ప్రకటన విడుదల చేశారు.

Telangana: టెట్ ఎగ్జామ్ నిర్వహణకు సర్వం సిద్ధం.. జిల్లాల వారీగా పరీక్షా కేంద్రాల వివరాలు ఇవే!
Telangana Tet Exam (1)

Edited By:

Updated on: Jan 02, 2026 | 8:08 PM

మొత్తం 18 జిల్లాల్లో ఏర్పాటు చేసిన 97 కేంద్రాలలో టెట్ పరీక్షలు జరగనున్నాయి. జనవరి 3 నుండి 20 మధ్య మొత్తం 9 రోజుల పాటు, 15 సెషన్లలో అభ్యర్థులు పరీక్షకు హాజరుకానున్నారు. పరీక్షల నిర్వహణకు సంబంధించి విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈసారి టెట్ పరీక్షకు భారీ సంఖ్యలో అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. పేపర్-1 కు మొత్తం 85,538 మంది అప్లై చేసుకోగా అందులో సర్వీసులో ఉన్న టీచర్లు 27,389 మంది ఉన్నారు. పేపర్-2 కు మొత్తం 1,52,216 మంది దరఖాస్తు చేయగా సర్వీసులో ఉన్న టీచర్లు 44,281 మంది ఉన్నారు. రెండిటికీ కలిపి మొత్తం 2,37,754 మంది అప్లై చేసుకున్నారు

జిల్లాల వారీగా పరీక్షా కేంద్రాలు – అభ్యర్థులు

అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో 21 కేంద్రాల్లో 77,790 మంది, మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలో 24 కేంద్రాల్లో 72,295 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు. ఖమ్మంలో 20,547 మంది, హన్మకొండలో 19,699 మంది, కరీంనగర్ లో 16,390 మంది, హైదరాబాద్ లో 9,539 మంది టెట్ ఎగ్జామ్ రాయనున్నారు.

పరీక్షకు సంబంధించి అభ్యర్థులకు ఏవైనా సందేహాలుంటే సంప్రదించడానికి విద్యాశాఖ హెల్ప్‌లైన్ నంబర్లను అందుబాటులోకి తెచ్చింది. ఫోన్ నంబర్లు: 7093708883, 7093708884 కాల్ చేయాలని సూచించింది. అభ్యర్థులు తమ హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకుని, పరీక్షా కేంద్రాలకు గంట ముందే చేరుకోవాలని అధికారులు సూచించారు.

మరిన్ని కెరీర్ అండ్ ఉద్యోగ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.