TS 10th Class Results 2025: మరికాసేపట్లోనే పదో తరగతి ఫలితాలు విడుదల.. రిజల్ట్స్‌ డైరెక్ట్‌ లింక్‌ ఇదే!

రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 5 లక్షల విద్యార్దులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న పదో తరగతి పబ్లిక్ పరీక్షల 2025 ఫలితాలు బుధవారం (ఏప్రిల్ 30) విడుదల కానున్నాయి. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి చేతుల మీదగా రవీంద్రభారతి స్టేడియంలో ఫలితాలను ప్రకటించనున్నారు. ఫలితాల వెల్లడి అనంతరం ఈ కింది డైరెక్ట్ లింక్ ద్వారా నేరుగా ఫలితాలను చెక్ చేసుకోండి..

TS 10th Class Results 2025: మరికాసేపట్లోనే పదో తరగతి ఫలితాలు విడుదల.. రిజల్ట్స్‌ డైరెక్ట్‌ లింక్‌ ఇదే!
TG 10th Results

Updated on: Apr 30, 2025 | 2:46 PM

హైదరాబాద్, ఏప్రిల్ 30: తెలంగాణ రాష్ట్రంలో 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల ఫలితాలు బుధవారం (ఏప్రిల్ 30) విడుదల కానున్నాయి. ఫలితాల కోసం ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న విద్యార్ధుల నిరీక్షణకు ఈ రోజు తెర పడనుంది.  బుధవారం మధ్యాహ్నం ఒంటి గంటకు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి చేతుల మీదగా ఫలితాలు వెల్లడించనున్నట్లు విద్యాశాఖ ప్రకటన జారీ చేసింది. ఈ మేర‌కు విద్యాశాఖ మంగళవారం (ఏప్రిల్ 30) అధికారికంగా ప్రక‌టించింది. ఫలితాల వెల్లడి అనంతరం టీవీ 9 తెలుగు అధికారిక వెబ్‌సైట్‌తోపాటు అధికారిక వెబ్‌సైట్ bse.telangana.gov.in లేదా results.bse.telangana.gov.in లలోనూ ఫలితాలను చెక్‌ చేసుకోవచ్చు.

తెలంగాణ పదో తరగతి పరీక్షల ఫలితాలు

కాగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ పరీక్షలు మార్చి 21వ తేదీ నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షలకు దాదాపు 5 లక్షల మంది విద్యార్ధులు హాజరయ్యారు. ఇక ఏప్రిల్ 15వ తేదీ నాటికే జవాబు పత్రాల మూల్యాంకనం కూడా పూర్తైంది. కానీ ఇప్పటి వరకు ఫలితాలు వెల్లడికాకపోవడంతో విద్యార్ధుల్లో ఆందోళన నెలకొంది. ఆందోళనకు తెరదించుతూ విద్యాశాఖ ఈ రోజు ఫలితాలను వెల్లడించేందుకు సిద్దమైంది. ఈసారి పదో తరగతి విద్యార్ధులకు గ్రేడ్స్‌ ఇవ్వడానికి బదులు గతంలో మాదిరి మార్కుల‌ను మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించి విధివిధాలను రూపొందించడంలో జాప్యం నెలకొనడం మూలంగా టెన్త్‌ ఫలితాల వెల్లడి ఆలస్యమైంది. ఈ రోజు విడుదలయ్యే ఫలితాల్లో విద్యార్ధులకు వచ్చిన మార్కులతో పాటు స‌బ్జెక్టుల వారీగా గ్రేడ్స్ కూడా ప్రక‌టించ‌నున్నారు.

ఇవి కూడా చదవండి

ఈఏడాది రాత పరీక్షలు 80 మార్కులకు, ఇంటర్నల్‌ మార్కులు 20 మార్కులను నిర్వహించారు. ఈ మేరకు మార్కుల మెమోలను జారీ చేస్తారు. అలాగే వచ్చే ఏడాది నుంచి టెన్త్‌లో ఇంటర్నల్ మార్కులను కూడా తొలగించి, మొత్తం 6 సబ్జెక్టులకు 100 మార్కుల చొప్పున పరీక్షలు నిర్వహించనున్నారు.

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.