TS Inter State 1st Ranker 2024: ఇంటర్ ఫలితాల్లో స్టేట్ 1st ర్యాంకర్లు వీరే.. ఎన్నిమార్కులు వచ్చాయంటే

|

Apr 24, 2024 | 12:56 PM

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 24: తెలంగాణ ఇంటర్‌ ఫస్ట్, సెకండ్‌ ఇయర్‌ ఫలితాల్లో స్టేట్‌ టాపర్లుగా ఇద్దరు అమ్మాయిలు నిలిచారు. ఇంటర్ ఫస్ట్‌ ఇయర్‌లో మేడ్చల్‌ జిల్లాకు చెందిన వనపల్లి చరిష్మా శివ సాయి, సంగారెడ్డికి చెందిన ధ్రువి తప్లియాల్ అనే ఇద్దరు విద్యార్ధులు మొత్తం 1000 మార్కులకు గానూ 994 మార్కులతో స్టేట్ 1st ర్యాంక్‌ సాధించారు. దీంతో ఇద్దరూ స్టేట్‌ ఫస్ట్ ర్యాంకర్లుగా నిలిచారు. టాపర్లుగా నిలిచిన ఈ ఇద్దరికీ పలువురు అభినందనలు తెలుపుతున్నారు. తెలంగాణ […]

TS Inter State 1st Ranker 2024: ఇంటర్ ఫలితాల్లో స్టేట్ 1st ర్యాంకర్లు వీరే.. ఎన్నిమార్కులు వచ్చాయంటే
TS Inter State 1st Ranker
Follow us on

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 24: తెలంగాణ ఇంటర్‌ ఫస్ట్, సెకండ్‌ ఇయర్‌ ఫలితాల్లో స్టేట్‌ టాపర్లుగా ఇద్దరు అమ్మాయిలు నిలిచారు. ఇంటర్ ఫస్ట్‌ ఇయర్‌లో మేడ్చల్‌ జిల్లాకు చెందిన వనపల్లి చరిష్మా శివ సాయి, సంగారెడ్డికి చెందిన ధ్రువి తప్లియాల్ అనే ఇద్దరు విద్యార్ధులు మొత్తం 1000 మార్కులకు గానూ 994 మార్కులతో స్టేట్ 1st ర్యాంక్‌ సాధించారు. దీంతో ఇద్దరూ స్టేట్‌ ఫస్ట్ ర్యాంకర్లుగా నిలిచారు. టాపర్లుగా నిలిచిన ఈ ఇద్దరికీ పలువురు అభినందనలు తెలుపుతున్నారు.

తెలంగాణ ఇంటర్మీడియట్‌ 2024 ప్రథమ, ద్వితియ సంవత్సర ఫలితాలు ఇక్కడ చెక్ చేసుకోండి.

కాగా ఈ ఏడాది మొత్తం 8,31,858 మంది విద్యార్ధులు ఇంటర్‌ పరీక్షలకు హాజరుకాగా వీరిలో ఫస్ట్ ఇయర్‌లో 2,87,261మంది అంటే 60.01 శాతం, సెకండ్‌ ఇయర్‌లో 3,22,432 మంది అంటే 64.19 శాతం ఉత్తీర్ణత నమోదైంది. వొకేషనల్‌ ఫస్ట్‌ ఇయర్‌లో 24,432 మంది పరీక్షలు రాస్తే వారిలో 50.57 శాతం ఉత్తీర్ణత పొందారు. ఇక సెకండ్‌ ఇయర్‌లో వొకేషనల్ రెగ్యులర్‌ 42,723 పరీక్షలు రాస్తే 27,287 మంది, ప్రైవేట్‌ 3,884 పరీక్షలు రాస్తే 1549 మంది పాస్‌ అయ్యారు.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.