TS Inter Results 2024: తెలంగాణ ఇంటర్‌ విద్యార్ధులకు అలర్ట్.. ఫలితాల విడుదల ఎప్పుడంటే?

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు జరిగిన ఇంటర్మీడియట్‌ వార్షిక పరీక్షలకు సంబంధించిన ఫలితాలు ఈ నెల 20వ తేదీ తర్వాత విడుదల కానున్నాయి. ఇప్పటికే పరీక్షలకు సంబంధించిన జవాబు పత్రాల మూల్యాంకనం పూర్తైంది. ఆన్‌లైన్‌లో మార్కుల ఎంట్రీకి సంబంధించిన ప్రాసెస్‌ జరుగుతోంది. ఈ ప్రక్రియ పూర్తైన తర్వాత ఫలితాలను విడుదల చేసేందుకు ఇంటర్‌ బోర్డు..

TS Inter Results 2024: తెలంగాణ ఇంటర్‌ విద్యార్ధులకు అలర్ట్.. ఫలితాల విడుదల ఎప్పుడంటే?
TS Inter Results

Updated on: Apr 14, 2024 | 3:05 PM

హైదారబాద్‌, ఏప్రిల్ 14: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు జరిగిన ఇంటర్మీడియట్‌ వార్షిక పరీక్షలకు సంబంధించిన ఫలితాలు ఈ నెల 20వ తేదీ తర్వాత విడుదల కానున్నాయి. ఇప్పటికే పరీక్షలకు సంబంధించిన జవాబు పత్రాల మూల్యాంకనం పూర్తైంది. ఆన్‌లైన్‌లో మార్కుల ఎంట్రీకి సంబంధించిన ప్రాసెస్‌ జరుగుతోంది. ఈ ప్రక్రియ పూర్తైన తర్వాత ఫలితాలను విడుదల చేసేందుకు ఇంటర్‌ బోర్డు సన్నాహాలు చేస్తోంది. మార్చి 10 నుంచే ప్రారంభమైన సమాధాన పత్రాల మూల్యాంకనం ఏప్రిల్‌ 10తో పూర్తైంది. మొత్తం 4 విడతల్లో మూల్యాంకనం చేశారు.

ఆన్‌లైన్‌లో మార్కుల నమోదుతోపాటు ఎలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఏప్రిల్ 20 తర్వాత ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలను ఒకేసారి ప్రకటించనున్నారు. మరోవైపు రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కోడ్‌ అమల్లో ఉండటంతో ఈసీ నుంచి అనుమతి తీసుకోన్నట్లు విద్యాశాఖ పేర్కొంది. కాగా అటు ఆంధ్రప్రదేశ్‌లో ఏప్రిల్‌ 12వ తేదీన ఇంటర్‌ ఫస్ట్‌, సెకండ్‌ ఇయర్‌ ఫలితాలను ఇంటర్‌ బోర్డు ప్రకటించింది. త్వరలో పదో తరగతి ఫలితాల విడుదాలకు సన్నాహాలు చేస్తోంది.

అగ్నివీర్‌ రాత పరీక్ష తేదీలు వెల్లడి.. త్వరలో అడ్మిట్‌కార్డులు విడుదల

2024-25 సంవత్సరానికి సంబంధించి అగ్నిపథ్ స్కీం కింద అగ్నివీరుల నియామకాలకు సంబంధించిన రాత పరీక్షల తేదీలను ఇండియన్‌ ఆర్మీ విడుదల చేసింది. ఆర్మీ రిక్రూటింగ్ ఆఫీస్ జోన్ల వారీగా ఈ పరీక్షలను నిర్వహించనున్నారు. ఖరారు చేసింది. తెలుగు రాష్ట్రాల్లో సికింద్రాబాద్‌, వైజాగ్‌, గుంటూరు నగరాల్లో ఆర్మీ నియామక ర్యాలీని నిర్వహిస్తారు. ఇందులో అర్హత సాధించిన అభ్యర్థులకు దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో ఏప్రిల్‌ 22, 23, 24, 25, 29, 30, మే 2, 3 తేదీల్లో ఆన్‌లైన్‌ విధానంలో రాత పరీక్షలు నిర్వహించనున్నారు. రాత పరీక్షకు సంబంధించిన అడ్మిట్‌కార్డులు త్వరలో విడుదల కానున్నాయి. రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్ధులకు శారీరక సామర్థ్య పరీక్షలు, మెడికల్‌ టెస్ట్‌లు నిర్వహిస్తారు. ఎంపికైన వారిని అగ్నివీర్ జనరల్ డ్యూటీ, అగ్నివీర్ టెక్నికల్, అగ్నివీర్ ఆఫీస్‌ అసిస్టెంట్‌, స్టోర్ కీపర్ టెక్నికల్, అగ్నివీర్ ట్రేడ్స్‌మ్యాన్ కేటగిరీల్లో పోస్టులను భర్తీ చేస్తారు. సెలక్షన్‌ ప్రాసెస్‌లో అర్హత సాధించిన వారిని నాలుగేళ్ల సమయానికి అగ్నివీరులుగా ఎంపిక చేస్తారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ సంబంధిత కథనాల కోసం క్లిక్‌ చేయండి.