TS Inter Exams 2022: తెలంగాణ ఇంటర్ విద్యార్ధులకు అలర్ట్‌! పరీక్ష పీజు గడువు పొడిగింపు.. ఎప్పటివరకంటే..

|

Apr 20, 2022 | 11:58 AM

తెలంగాణ ఇంటర్మీడియట్‌ వార్షిక పరీక్షలకు హాజరయ్యేందుకు రూ.5000ల ఆలస్య రుసుముతో పరీక్ష ఫీజు గడువును ఏప్రిల్ 20 నుంచి..

TS Inter Exams 2022: తెలంగాణ ఇంటర్ విద్యార్ధులకు అలర్ట్‌! పరీక్ష పీజు గడువు పొడిగింపు.. ఎప్పటివరకంటే..
Tsbie
Follow us on

TS Inter exam fee last date 2022: తెలంగాణ ఇంటర్మీడియట్‌ వార్షిక పరీక్షలకు హాజరయ్యేందుకు రూ.5000ల ఆలస్య రుసుముతో పరీక్ష ఫీజు (exam fee last date) గడువును ఏప్రిల్ 20 నుంచి 21కు ఇంటర్‌ బోర్డు (TSBIE) పొడిగించింది. ఈ మేరకు ఇంటర్‌ బోర్డు సెక్రెటరీ జలీల్‌ ఏప్రిల్‌ 19న ప్రకటన విడుదల చేశారు. కాగా ఇంటర్మీడియట్‌ పరీక్షలకు మే 6 నుంచి మే 24 వరకు ఇంటర్ ఎగ్జామ్స్ రాష్ట్ర వ్యాప్తంగా జరగనున్నాయి. మే 6, 9, 11, 13, 16, 18, 20, 23 తేదీల్లో ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు జరగనుండగా.. మే 7, 10, 13, 14, 17, 19, 21, 24 తేదీల్లో ఇంటర్ సెకండియర్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఇక పదో తరగతి పరీక్షలు మే 23 నుంచి 28 వరకు జరగనున్నాయి. ఇప్పటికే హాల్‌ టికెట్లు కూడా విడుదలయ్యాయి.

మరోవైపు జేఈఈ మెయిన్‌ 2022 మొదటి సెషన్‌ రాసేందుకు దరఖాస్తు చేసుకోవడానికి విద్యార్థులకు నేషనల్‌ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) మరో అవకాశం ఇచ్చింది. విద్యార్థుల కోరిక మేరకు ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ (JEE Main 2022 Online Application) ఈ నెల (ఏప్రిల్‌) 25వ తేదీ రాత్రి 9 గంటల వరకు దరఖాస్తు చేయడానికి గడువు ఇచ్చినట్లు ఎన్టీఏ తాజాగా ప్రకటించింది. సెకండ్‌ సెషన్‌ (చివరి) దరఖాస్తుకు సంబంధించిన షెడ్యూల్‌ను తర్వాత ప్రకటిస్తామని ఈ సందర్భంగా పేర్కొంది.

Also Read:

Diabetes Tips: షుగర్‌ వ్యాధిగ్రస్థులకు అలర్ట్‌! ఈ అలవాట్లు ఉన్నవారికి ముప్పు ఎక్కువ.. జాగ్రత్త!