AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TG ICET 2026 Hall Tickets: మరో వారంలో టీజీ ఐసెట్‌ 2026 ఆన్‌లైన్ రాత పరీక్షలు.. హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌ లింక్‌

రాష్ట్ర ఐసెట్‌ 2026 ప్రవేశ పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లు సోమవారం (మే 4) విడుదలయ్యాయి. ఐసెట్‌కు దరఖాస్తు చేసుకున్న విద్యార్ధులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ రిజిస్ట్రేషన్‌ నంబర్‌ నమోదు చేసి హాల్‌ టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఇప్పటికే ఈ పరీక్షకు సంబంధించిన షెడ్యూల్‌

TG ICET 2026 Hall Tickets: మరో వారంలో టీజీ ఐసెట్‌ 2026 ఆన్‌లైన్ రాత పరీక్షలు.. హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌ లింక్‌
TG ICET Hall Tickets
Srilakshmi C
|

Updated on: May 04, 2026 | 4:38 PM

Share

హైదరాబాద్‌, మే 4: తెలంగాణ ఇంటిగ్రేటెడ్‌ కామన్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామ్‌ (టీజీ ఐసెట్‌) 2026 ప్రవేశ పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లు సోమవారం (మే 4) విడుదలయ్యాయి. ఐసెట్‌కు దరఖాస్తు చేసుకున్న విద్యార్ధులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ రిజిస్ట్రేషన్‌ నంబర్‌ నమోదు చేసి హాల్‌ టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఇప్పటికే ఈ పరీక్షకు సంబంధించిన షెడ్యూల్‌ కూడా విడుదలైంది. షెడ్యూల్‌ ప్రకారం విద్యార్ధులకు మే 13, 14 తేదీల్లో ఐసెట్‌ ప్రవేశ పరీక్ష ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహించనున్నారు. ఈ పరీక్షలో వచ్చిన ర్యాంకు ద్వారా రాష్ట్రంలోని యూనివర్సిటీలు, అనుబంద ప్రభుత్వ, ప్రైవేట్‌ కాలేజీల్లో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో 2026-27 విద్యా సంవత్సరానికి ప్రవేశాలు కల్పిస్తారు. కాగా ఈ ఏడాది ఐసెట్‌ పరీక్షలను మహాత్మా గాంధీ యూనివర్సిటీ నిర్వహిస్తోంది. మే 29న ప్రిలిమినరీ కీ విడుదల చేస్తారు. అనంతరం జూన్‌ 19న ఫైనల్‌ కీ విడుదల చేసి.. ఆ వెనువెంటనే ఫలితాలు కూడా వెల్లడిస్తారు.

తెలంగాణ ఐసెట్‌ 2026 హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

రేపు ఏపీ పీజీఈసెట్‌ 2026 ఆన్సర్ కీ విడుదల.. ఫలితాలు ఎప్పుడంటే?

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని కాలేజీలు, యూనివర్సిటీల్లో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఎంటెక్, ఎంఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ఇంజినీరింగ్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (ఏపీ పీజీఈసెట్‌ 2026) ప్రాథమిక కీ రేపు (మే 6) విడుదల కానుంది. ఈ పరీక్ష రాసిన విద్యార్ధులు అధికారిక వెబ్‌సైట్‌ నుంచి ఆన్సర్‌ కీలను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఈ మేరకు విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం ఏర్పాట్లు చేస్తుంది. కాగా ఏప్రిల్‌ 28, 29, 30 తేదీల్లో ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో ఈ పరీక్షలు ఆన్‌లైన్‌ విధానంలో జరిగిన సంగతి తెలిసిందే. పీజీఈసెట్‌కు మొత్తం 12,102 మంది దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 18 పట్టణాల్లో 26 పరీక్షా కేంద్రాల్లో ఈ పరీక్షలు జరిగాయి. మే 8 వరకు ప్రాథమిక కీపై అభ్యంతరాలను స్వీకరిస్తారు. అనంతరం తుది ఆన్సర్ కీ రూపొందించి మే 14న ఫలితాలు విడుదల చేస్తారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

Follow Us
కేరళలో యూడీఎఫ్ ఘన విజయం.. సీఎం రేవంత్ రెడ్డి ఏమన్నారంటే..
కేరళలో యూడీఎఫ్ ఘన విజయం.. సీఎం రేవంత్ రెడ్డి ఏమన్నారంటే..
మరో వారంలో TG ICET 2026 రాత పరీక్షలు.. హాల్‌టికెట్ల లింక్ ఇదిగో
మరో వారంలో TG ICET 2026 రాత పరీక్షలు.. హాల్‌టికెట్ల లింక్ ఇదిగో
ఇటు ధోనీకి ఇచ్చిపేడేసి.. అటు రోహిత్, కోహ్లీల సరసన చేరిన 'పాండే'
ఇటు ధోనీకి ఇచ్చిపేడేసి.. అటు రోహిత్, కోహ్లీల సరసన చేరిన 'పాండే'
హోమ్ లోన్‌తో ఇల్లు కొనాలనుకునేవారు ఇప్పుడే కళ్లు తెరవండి.!
హోమ్ లోన్‌తో ఇల్లు కొనాలనుకునేవారు ఇప్పుడే కళ్లు తెరవండి.!
రిలయన్స్ జోరు.. కేవలం 4 రోజుల్లో రూ. 1.39 లక్షల కోట్ల లాభం!
రిలయన్స్ జోరు.. కేవలం 4 రోజుల్లో రూ. 1.39 లక్షల కోట్ల లాభం!
శుక్రుడితో లక్ష్మీ యోగం! ఆ రాశుల వారికి సిరిసంపదలు ఖాయం..!
శుక్రుడితో లక్ష్మీ యోగం! ఆ రాశుల వారికి సిరిసంపదలు ఖాయం..!
చనిపోయిన భర్త కల నెరవేర్చిన టాలీవుడ్ హీరోయిన్.. బ్యూటిఫుల్ వీడియో
చనిపోయిన భర్త కల నెరవేర్చిన టాలీవుడ్ హీరోయిన్.. బ్యూటిఫుల్ వీడియో
టెట్‌ 2026కు భారీగా తగ్గిన దరఖాస్తులు.. పరీక్షలు ఎప్పుడంటే?
టెట్‌ 2026కు భారీగా తగ్గిన దరఖాస్తులు.. పరీక్షలు ఎప్పుడంటే?
సెప్టెంబర్ 8 నుండి ఈ ఫోన్లలో వాట్సాప్ బంద్! మీ ఫోన్ కూడా ఉందా?
సెప్టెంబర్ 8 నుండి ఈ ఫోన్లలో వాట్సాప్ బంద్! మీ ఫోన్ కూడా ఉందా?
తమిళనాడు సీఎం స్టాలిన్ ఘోర పరాజయం..
తమిళనాడు సీఎం స్టాలిన్ ఘోర పరాజయం..