Telangana: వాయిదా పడ్డ తెలంగాణ గ్రూప్‌ 1 పరీక్ష ఫలితాలు.. కారణం ఏంటో తెలుసా.?

| Edited By: Narender Vaitla

Jul 25, 2023 | 6:37 PM

తెలంగాణలో గ్రూప్ 1 ఫలితాలకు హైకోర్టు బ్రేక్ వేసింది. పేపర్ లీకేజ్ వ్యవహారంలో నిర్వహించిన గ్రూప్ వన్ 1 రీ ఎగ్జామ్ పరీక్ష జూన్ 11న తెలంగాణ వ్యాప్తంగా నిర్వహించింది టీఎస్పీఎస్సీ. రాష్ట్రవ్యాప్తంగా 994 పరీక్ష కేంద్రాల్లో పరీక్ష నిర్వహించారు.. రాష్ట్రవ్యాప్తంగా 3.8 లక్షల మంది గ్రూప్ 1 కోసం దరఖాస్తు చేసుకోగా పరీక్షకు 2 లక్షల 32 వేల 457 మంది అభ్యర్థులు పరీక్ష రాశారు...

Telangana: వాయిదా పడ్డ తెలంగాణ గ్రూప్‌ 1 పరీక్ష ఫలితాలు.. కారణం ఏంటో తెలుసా.?
Tspsc Group 1
Follow us on

తెలంగాణలో గ్రూప్ 1 ఫలితాలకు హైకోర్టు బ్రేక్ వేసింది. పేపర్ లీకేజ్ వ్యవహారంలో నిర్వహించిన గ్రూప్ వన్ 1 రీ ఎగ్జామ్ పరీక్ష జూన్ 11న తెలంగాణ వ్యాప్తంగా నిర్వహించింది టీఎస్పీఎస్సీ. రాష్ట్రవ్యాప్తంగా 994 పరీక్ష కేంద్రాల్లో పరీక్ష నిర్వహించారు.. రాష్ట్రవ్యాప్తంగా 3.8 లక్షల మంది గ్రూప్ 1 కోసం దరఖాస్తు చేసుకోగా పరీక్షకు 2 లక్షల 32 వేల 457 మంది అభ్యర్థులు పరీక్ష రాశారు. మరి కొన్ని రోజుల్లోనే గ్రూప్ 1 ఫైనల్ కీ రానుంది.

అయితే ఆగస్టు మొదటి వారంలో గ్రూప్ వన్ ఫలితాలు అంటూ ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలో హైకోర్టులో పలు పిటిషన్‌లు దాఖలు అయ్యాయి. గ్రూప్ 1 పరీక్ష నిర్వహణలో అధికారులు బయోమెట్రిక్ పెట్టకపోవడంపై పలువురు అభ్యర్థులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ పై విచారణ సందర్భంగా హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది.

సోమవారం వరకు రిజల్ట్స్‌ ఉండవు..

కేసు హైకోర్టులో విచారణ పెండింగ్‌లో ఉన్న కారణంగా ఫలితాలు ప్రకటించకుండా ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ న్యాయవాది హైకోర్టును ఆశ్రయించారు. ప్రభుత్వం తరఫున మంగళవారం (ఈరోజు) అడ్వకేట్ జనరల్ హాజరు కాకపోవడంతో సోమవారం రోజు ప్రభుత్వ వాదనలు వింటామని హైకోర్టు స్పష్టం చేసింది. మరోవైపు సోమవారం వరకు ఇలాంటి ఫలితాలు ప్రకటించవద్దని హైకోర్టు స్పష్టం చేసింది. దీనికి బదులుగా టీఎస్పీఎస్సీ తరుపున వాదించిన న్యాయవాది సైతం సోమవారం వరకు గ్రూప్ 1 ఫలితాలు ప్రకటించబోమని హైకోర్టుకు తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..