TS ECET 2021 Exam: తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం పలు ప్రవేశ పరీక్షలను నిర్వహించేందుకు ఇప్పటికే.. తేదీలను ప్రకటించింది. దీనిలో భాగంగా తెలంగాణ స్టేట్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (టీఎస్ ఈసెట్-2021) పరీక్ష తేదీని కూడా ప్రకటించింది. ఆగస్టు 3వ తేదీన TS ECET-2021 ప్రవేశ పరీక్షను నిర్వహించనున్నట్లు కన్వీనర్ సీహెచ్ వెంకట రమణారెడ్డి బుధవారం వెల్లడించారు. ఈ పరీక్ష రెండు సెషన్లల్లో జరగనుంది. మొదటి సెషన్ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12:00 వరకు నిర్వహించనున్నారు. రెండవ సెషన్ మధ్యాహ్నం 3.00 గంటల నుంచి సాయంత్రం 6.00 గంటల వరకు నిర్వహించనున్నట్లు కన్వీనర్ వెంకటరమణారెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ప్రకటన విడుదల చేశారు.
టీఎస్ ఈసెట్-2021 అభ్యర్థులు తమ హాల్ టిక్కెట్లను జూలై 29 మధ్యాహ్నం 1 నుంచి తర్వాత డౌన్‌లోడ్ చేసుకోవచ్చని వెల్లడించారు. ఈ మేరకు అభ్యర్థులు ecet.tsche.ac.in website లో లాగిన్ అయి హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. అయితే.. ఈ పరీక్ష కంప్యూటర్ బెస్ట్ ఆధారంగా జరగనుంది. ఈ మేరకు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచిన మాక్ టెస్ట్ (MOCK TEST) సదుపాయాన్ని కూడా ఉపయోగించుకోవచ్చని కన్వీనర్ వెల్లడించారు. అభ్యర్థులు హాల్ టికెట్‌లో ఇచ్చిన సూచనలను ఖచ్చితంగా పాటించాలని సీహెచ్ వెంకట రమణారెడ్డి తెలిపారు. టీఎస్ ఈసెట్ పరీక్ష ద్వారా రాష్ట్రంలోని పలు ఇంజనీరింగ్ కళాశాలల్లో ప్రవేశాలు కల్పించనున్నారు.
Also Read: