TS EAPCET 2024: తెలంగాణ ఈఏపీసెట్‌కు 3.41 లక్షల దరఖాస్తులు.. ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేదీ ఇదే

తెలంగాణ ఇంజినీరింగ్‌, వ్యవసాయ, ఫార్మసీ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (ఈఏపీసెట్‌-2024) దరఖాస్తు గడువు శనివారం (ఏప్రిల్‌ 6)తో ముగిసింది. ఫిబ్రవరి 26 నుంచి ప్రారంభమైన ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా ఏప్రిల్‌ 6వ తేదీ వరకు కొనసాసాగింది. ఆలస్య రుసుంతో మే 1వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. శనివారం నాటికి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 3,41,548 దరఖాస్తులు..

TS EAPCET 2024: తెలంగాణ ఈఏపీసెట్‌కు 3.41 లక్షల దరఖాస్తులు.. ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేదీ ఇదే
TS EAPCET 2024

Updated on: Apr 07, 2024 | 2:52 PM

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 7: తెలంగాణ ఇంజినీరింగ్‌, వ్యవసాయ, ఫార్మసీ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (ఈఏపీసెట్‌-2024) దరఖాస్తు గడువు శనివారం (ఏప్రిల్‌ 6)తో ముగిసింది. ఫిబ్రవరి 26 నుంచి ప్రారంభమైన ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా ఏప్రిల్‌ 6వ తేదీ వరకు కొనసాసాగింది. ఆలస్య రుసుంతో మే 1వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. శనివారం నాటికి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 3,41,548 దరఖాస్తులు వచ్చాయని ఈఏపీ సెట్‌ కన్వీనర్‌ బీడీ కుమార్‌ ఓ ప్రకటనలో తెలిపారు. ఇంజినీరింగ్‌ కోర్సుల్లో ప్రవేశాలకు తెలంగాణ విద్యార్థులు 1,99,809 మంది, ఏపీ విద్యార్ధులు 46,247 మంది దరఖాస్తు చేసుకున్నారు. మొత్తం కలిపి 2,46,056 మంది ఇంజనీరింగ్‌ విభాగానికి దరఖాస్తు చేసుకున్నారు.

ఇక వ్యవసాయం, ఫార్మసీ స్ట్రీమ్‌లో తెలంగాణ విద్యార్ధులు 83,486 మంది, ఏపీ విద్యార్ధులు 11,699 మంది దరఖాస్తు చేసుకున్నారు. మొత్తం కలిపి 95,185 దరఖాస్తులు అందాయి. ఇక ఇంజినీరింగ్‌, ఫార్మసీ రెండు స్ట్రీమ్‌లకు 307 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో తెలంగాణలో 275 మంది విద్యార్ధులు, ఏపీలో 32 మంది విద్యార్ధులు దరఖాస్తు చేసుకున్నారు. ఇక అన్ని స్ట్రీమ్‌లకు కలిపి 3,41,548 దరఖాస్తులు అందినట్లు కన్వినర్‌ తెలిపారు. వీరిలో తెలంగాణ విద్యార్థులు 2,83,570 మంది, ఏపీ విద్యార్ధులు 57,978 మంది వరకు ఉన్నారు.

టీఎస్పీయస్సీ వ్యవసాయ అధికారి పోస్టుల ఫలితాలు విడుదల..18, 19వ తేదీల్లో సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌

తెలంగాణ స్టేట్‌ అగ్రికల్చర్‌ అండ్‌ కోఆపరేషన్‌ శాఖలో మొత్తం 148 వ్యవసాయ అధికారుల పోస్టుల భర్తీకి సంబంధించి నియామక పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షకు సంబంధించిన ఎంపిక ఫలితాలు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌స్పీయస్సీ) విడుదల చేసింది. ఎంపికైన అభ్యర్థు ఏప్రిల్‌ 18, 19 తేదీల్లో సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ (ధ్రువపత్రాల పరిశీలన)కు హాజరుకావల్సి ఉంటుంది. టీఎస్‌పీఎస్సీ కార్యాలయంలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ ఉంటుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.