TS DSC 2024 Exam Date: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌! డీఎస్సీ 2024 పరీక్షల తేదీలు విడుదల.. ఆన్‌లైన్‌ దరఖాస్తుల గడువు పెంపు

|

Apr 02, 2024 | 7:03 PM

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో 11,062 ఉపాధ్యాయ కొలువుల భర్తీకి రేవంత్‌ సర్కార్ మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షకు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే మొదలైంది. తాజాగా విద్యాశాఖ డీఎస్సీ ఆన్‌లైన్‌ దరఖాస్తుల గడువును పొడిగిస్తూ ప్రకటన వెలువరించింది. తొలుత ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం.. ఆన్‌లైన్‌ అప్లికేషన్ల గడువు ఏప్రిల్‌ 2వ తేదీతో ముగియనుంచి. దీనిని జూన్‌ 20 వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో ఇప్పటి వరకూ దరఖాస్తు చేసుకోని అభ్యర్ధులు..

TS DSC 2024 Exam Date: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌! డీఎస్సీ 2024 పరీక్షల తేదీలు విడుదల.. ఆన్‌లైన్‌ దరఖాస్తుల గడువు పెంపు
TS DSC 2024 Exam Date
Follow us on

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 2: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో 11,062 ఉపాధ్యాయ కొలువుల భర్తీకి రేవంత్‌ సర్కార్ మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షకు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే మొదలైంది. తాజాగా విద్యాశాఖ డీఎస్సీ ఆన్‌లైన్‌ దరఖాస్తుల గడువును పొడిగిస్తూ ప్రకటన వెలువరించింది. తొలుత ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం.. ఆన్‌లైన్‌ అప్లికేషన్ల గడువు ఏప్రిల్‌ 2వ తేదీతో ముగియనుంచి. దీనిని జూన్‌ 20 వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో ఇప్పటి వరకూ దరఖాస్తు చేసుకోని అభ్యర్ధులు జూన్‌ 20వ తేదీ రాత్రి 11.50 గంటల వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించినట్లైంది. దరఖాస్తు రుసుము రూ.1000 చొప్పున సమర్పించవల్సి ఉంటుంది. అలాగే విద్యాశాఖ డీఎస్సీ పరీక్ష తేదీలనూ కూడా ఖరారు చేసింది. సార్వత్రిక ఎన్నికల అనంతరం జులై 17 నుంచి 31 వరకు ఆన్‌లైన్‌ విధానంలో పరీక్షలు నిర్వహించనున్నట్లు విద్యాశాక అధికారులు వెల్లడించారు.

కాగా తెలంగాణ వ్యాప్తంగా 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి విడుదల చేసిన నోటిఫికేషన్‌లో స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులు అత్యధికంగా 2,629 ఉన్నాయి. తర్వాత 727 భాషా పండితుల పోస్టులు, 182 పోస్టులు పీఈటీలు, 6,508 పోస్టులు ఎస్జీటీలు ఉన్నాయి. స్పెషల్‌ ఎడ్యుకేషన్‌కు సంబంధించి 220 స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులు, 796 ఎస్జీటీ పోస్టులు ఉన్నాయి. రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో అత్యధిక ఖాళీలు హైదరాబాద్‌లో ఉన్నాయి. ఇక్కడ 878 పోస్టులు భర్తీకానున్నాయి. ఆ తర్వాత స్థానంలో 605 పోస్టులతో నల్గొండ జిల్లా, నిజామాబాద్‌లో 601 పోస్టులు, ఖమ్మం జిల్లాలో 757 పోస్టులు, సంగారెడ్డి జిల్లాలో 551 పోస్టులు, కామారెడ్డి జిల్లాలో 506 పోస్టుల చొప్పున ఖాళీలు ఉన్నాయి.

గత ఏడాది కేసీఆర్‌ సర్కార్‌ విడుదల చేసిన డీఎస్సీ నోటిఫికేషన్‌ను రేవంత్‌ సర్కార్‌ రద్దు చేసి మెగా డీఎస్సీ ప్రకటన వెలువరించిన సంగతి తెలిసిందే. గత నోటిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులు మళ్లీ ప్రత్యేకంగా దరఖాస్తు చేయనవసరం లేదని విద్యాశాఖ ఇప్పటికే స్పష్టం చేసింది. ఇక సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ (ఎస్జీటీ) పోస్టులకు డీఎడ్‌ పూర్తి చేసిన అభ్యర్ధులు మాత్రమే అర్హులని, బీఎడ్‌ అభ్యర్ధులు ఈ పోస్టులకు పోటీపడే అవకాశం లేదని పేర్కొంది. బీఎడ్‌, డీఎడ్‌ చివరి సెమిస్టర్‌ చదువుతున్న అభ్యర్ధులు కూడీ డీఎస్సీకి దరఖాస్తు చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

తెలంగాణలో జిల్లాల వారీగా ఉద్యోగాల ఖాళీల వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.