TG DOST 2026 Registration: తెలంగాణ దోస్త్‌ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం.. జులై 1 నుంచి తరగతులు

ప్రభుత్వ, ప్రైవేట్‌ డిగ్రీ కాలేజీల్లో 2026-27 విద్యాసంవత్సరానికి సంబంధించి డిగ్రీ ప్రవేశాలకు నిర్వహించే తెలంగాణ డిగ్రీ ఆన్‌లైన్‌ సర్వీసెస్‌ (DOST) ఫేజ్‌ 1 ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లు ప్రారంభమైనాయి. మొత్తం మూడు విడతలుగా దోస్త్ కౌన్సెలింగ్‌ ప్రక్రియ కొనసాగుతుంది. ఏప్రిల్‌ 15 నుంచి తొలివిడత

TG DOST 2026 Registration: తెలంగాణ దోస్త్‌ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం.. జులై 1 నుంచి తరగతులు
Telangana DOST Admissions

Updated on: Apr 17, 2026 | 3:15 PM

హైదరాబాద్‌, ఏప్రిల్ 17: రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ డిగ్రీ కాలేజీల్లో 2026-27 విద్యాసంవత్సరానికి సంబంధించి డిగ్రీ ప్రవేశాలకు నిర్వహించే తెలంగాణ డిగ్రీ ఆన్‌లైన్‌ సర్వీసెస్‌ (DOST) ఫేజ్‌ 1 ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లు ప్రారంభమైనాయి. మొత్తం మూడు విడతలుగా దోస్త్ కౌన్సెలింగ్‌ ప్రక్రియ కొనసాగుతుంది. ఏప్రిల్‌ 15 నుంచి తొలివిడత ప్రవేశాలకు రిజిస్ట్రేషన్‌ మొదలైంది. మే 7వ తేదీ వరకు తొలి విడత రిజిస్ట్రేషన్లు కొనసాగుతాయి. ఏప్రిల్‌ 30 నుంచి మే 8 వరకు వెబ్‌ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు. మే 14వ తేదీన సీట్ల కేటాయింపు ఉంటుంది. మే 15 నుంచి 23 వరకు ఆన్‌లైన్‌ సెల్ఫ్‌ రిపోర్టింగ్‌కు అవకాశం ఇస్తారు.

తెలంగాణ దోస్త్‌ 2026 ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్ల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఇక 2వ విడత ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ మే 15 నుంచి 25వ తేదీ వరకు కొనసాగుతుంది. మే 15 నుంచి మే 26 వరకు వెబ్‌ ఆప్షన్లు, మే 30న సీట్ల కేటాయింపు ఉంటుంది. మే 31 నుంచి జూన్‌ 5వ తేదీ వరకు ఆన్‌లైన్‌ సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ చేయాల్సి ఉంటుంది. మూడో విడత ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ మే 31 నుంచి జూన్‌ 15 వరకు ఉంటుంది. మే 31 నుంచి జూన్ 16 వరకు వెబ్‌ ఆప్షన్లు, జూన్ 20న సీట్ల కేటాయింపు, జూన్‌ 20 నుంచి 25 వరకు ఆన్‌లైన్‌ సెల్ఫ్‌రిపోర్టింగ్‌ చేయాల్సి ఉంటుంది. మూడు విడతల ప్రవేశాలు ముగిసిన తర్వాత జూన్‌ 20 నుంచి 27 వరకు సీట్లు పొందిన కాలేజీల్లో రిపోర్టింగ్‌ చేయాలి. అనంతరం జులై 1 నుంచే మొదటి సెమిస్టర్‌ తరగతులు ప్రారంభమవుతాయి. ఈ మేరకు దోస్త్‌ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ వి బాలక్రిష్టారెడ్డి షెడ్యూల్‌ను విడుదల చేశారు. ఆసక్తి కలిగిన విద్యార్ధులు దోస్త్‌ మొదటి విడతలో ప్రతి ఒక్కరూ రూ.200, రెండో విడతలో రూ.400 చొప్పున రిజిస్ట్రేషన్‌ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది.

ఇవి కూడా చదవండి

తెలంగాణ దోస్త్‌ 2026 ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్ల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

దోస్త్‌ ద్వారా.. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఓయూ, కాకతీయ, తెలంగాణ, పాలమూరు, మహాత్మాగాంధీ, శాతవాహన, చాకలి ఐలమ్మ మహిళా వర్సిటీ, మన్మోహన్‌సింగ్‌ ఎర్త్‌ సైన్సెస్‌ వర్సిటీ (కొత్తగూడెం), జేఎన్‌టీయూల పరిధిలోని కాలేజీల్లో బీఏ, బీకాం, బీఎస్‌సీ, బీబీఏ, బీబీఎం, బీసీఏ, బీఎస్‌డబ్ల్యూ తదితర కోర్సుల్లో సీట్లు కేటాయిస్తారు. వీటితోపాటు రాష్ట్ర సాంకేతిక విద్య, శిక్షణ మండలి పరిధిలోని పాలిటెక్నిక్‌ కాలేజీల్లో డీ ఫార్మసీలో, గచ్చిబౌలిలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టూరిజం అండ్‌ హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్‌ (నిథిమ్‌)లోనూ సీట్లను భర్తీ చేస్తారు. కాగా 2025-26 విద్యాసంవత్సరంలో దోస్త్, నాన్‌ దోస్త్, రెసిడెన్షియల్‌ కాలేజీల్లో కలిపి దాదాపు 4.40 లక్షల సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ ఏడాది సీట్లు మరింత పెరిగే అవకాశం ఉంది.

తెలంగాణ దోస్త్‌ 2026 ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్ల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us