TG Govt Jobs 2025: నిరుద్యోగులకు ఎగిరి గంతేసే వార్త.. పోలీస్‌ శాఖలో భారీగా ఉద్యోగాలకు త్వరలో నోటిఫికేషన్‌

Telangana Police Department Jobs: రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే భారీ సంఖ్యలో ఉద్యోగాలను భర్తీ చేసింది. మరోవైపు కొత్తగా ఏర్పడిన ఖాళీల వివరాల కూడా గుర్తించింది. వీటిలో ప్రస్తుతం 20 వేల పోస్టులకు ఆర్థిక అనుమతులున్నాయి. జాబ్‌ క్యాలెండర్‌లో పేర్కొన్న కేటగిరీలవారీగా గ్రూప్స్, ఉపాధ్యాయ, పోలీస్, విద్యుత్, గురుకుల, వైద్య నియామకాలు..

TG Govt Jobs 2025: నిరుద్యోగులకు ఎగిరి గంతేసే వార్త.. పోలీస్‌ శాఖలో భారీగా ఉద్యోగాలకు త్వరలో నోటిఫికేషన్‌
Telangana Police Department Jobs

Updated on: Oct 19, 2025 | 8:57 AM

హైదరాబాద్‌, అక్టోబర్ 19: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే భారీ సంఖ్యలో ఉద్యోగాలను భర్తీ చేసింది. మరోవైపు కొత్తగా ఏర్పడిన ఖాళీల వివరాల కూడా గుర్తించింది. వీటిలో ప్రస్తుతం 20 వేల పోస్టులకు ఆర్థిక అనుమతులున్నాయి. జాబ్‌ క్యాలెండర్‌లో పేర్కొన్న కేటగిరీలవారీగా గ్రూప్స్, ఉపాధ్యాయ, పోలీస్, విద్యుత్, గురుకుల, వైద్య నియామకాలు చేపట్టేందుకు ప్రభుత్వం ఉద్యోగ ప్రకటనలు జారీ చేసేందుకు పరిపాలన ప్రక్రియ చేపట్టింది. ఆర్టీసీ, వైద్య విభాగాల పరిధిలో దాదాపు 10 వేల వరకు ఖాళీలు ఉంటాయని అంచనా.

ఇప్పటికే ఆర్టీసీలో 1743 డ్రైవర్లు, శ్రామిక్‌ పోస్టులకు కూడా నోటిఫికేషన్‌ వచ్చేసింది. ప్రస్తుతం ఈ పోస్టులకు ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతుంది. వైద్య విభాగంలో సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్లు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు, ఇతర పోస్టులు కలిపి దాదాపు 2,300 వరకు ఖాళీలకు నోటిఫికేషన్లు ఇచ్చారు. ప్రభుత్వ విభాగాలు, విద్యుత్‌ సంస్థల్లోని ఇంజినీరింగ్‌ విభాగాల్లోనూ 2 నుంచి 3 వేల వరకు ఖాళీలున్నట్లు సమాచారం. ఇక రాష్ట్రంలో అత్యధిక పోస్టులు పోలీస్‌ విభాగంలో ఉన్నట్లు సమాచారం. ఎస్సై, కానిస్టేబుల్‌ స్థాయిలో ఏకంగా 12,452 పోస్టులు భర్తీకి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది. సివిల్‌ విభాగంలో అత్యధికంగా 8,442 వరకు పోస్టులు ఉన్నాయి.

ఐబీపీఎస్‌ ఎస్‌ఓ 2025 ప్రిలిమ్స్‌ ఫలితాలు విడుదల.. లింక్‌ ఇదే

ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS).. స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులకు ఇటీవల నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలు విడుదలైనాయి. పరీక్షకు హాజరైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ నుంచి ఫలితాలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నంబర్‌, పాస్‌వర్డ్, పుట్టిన తేదీ వివరాలు నమోదు చేసి స్కోరు కార్డు డౌన్‌లోడ్‌ చేస్తున్నారు. అక్టోబర్ 23వ తేదీ వరకు స్కోరుకార్డు డౌన్‌లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.

ఇవి కూడా చదవండి

ఐబీపీఎస్‌ ఎస్‌ఓ-2025 ప్రిలిమ్స్‌ ఫలితాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.