Top Medical Colleges 2025: నీట్ అభ్యర్ధులకు అలర్ట్.. దేశంలోని టాప్ మెడికల్ కాలేజీల ఫుల్ లిస్ట్ ఇదే!
ఎంబీబీఎస్‌తోపాటు బీఏఎంఎస్, బీయూఎంఎస్, బీఎస్‌ఎంఎస్ వంటి మెడికల్ కోర్సుల్లో ప్రవేశాలకు యేటా లక్షలాది మంది విద్యార్ధులు పోటీ పడుతుంటారు. గతేడాది ఏకంగా 24 లక్షల మంది విద్యార్ధులు నీట్ పరీక్ష రాశారు. కానీ సీట్లు మాత్రం వేలల్లో మాత్రమే ఉంటాయి. దీంతో తీవ్ర పోటీ ఉంటుంది. ర్యాంకు వచ్చిన వారంతా టాప్ మెడికల్ కాలేజీల్లో సీట్లు పొందడానికి ముందు నుంచే సన్నాహాలు చేస్తుంటారు. అటువంటి వారి కోసం టాప్ మెడికల్ కాలేజీల ఫుల్ లిస్ట్..
NIRF ర్యాంకింగ్ 2024 ప్రకారం విద్యా మంత్రిత్వ శాఖ మొత్తం 50 మెడికల్ కాలేజీల జాబితాను విడుదల చేసింది. ఇందులో AIIMS ఢిల్లీ ఫస్ట్ ర్యాంక్‌లో ఉంది. ఆ తర్వాత PGIMER చండీగఢ్ 2వ ర్యాంక్, CMC వెల్లూరు 3వ ర్యాంక్‌లో ఉన్నాయి. నీట్ 2025 పరీక్ష మే 4వ తేదీన జరగనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో దేశ వ్యాప్తంగా ఉన్న టాప్ వైద్య కళాశాలల NIRF ర్యాంకింగ్‌ను విద్యార్ధులు, వారి తల్లిదండ్రులు నెట్టింట తెగ వెతికేస్తున్నారు. తాజా NIRF ర్యాంకింగ్‌లో దేశంలోని అగ్రశ్రేణి వైద్య కళాశాలల పూర్తి జాబితాను విడుదల చేసింది.
ఎంబీబీఎస్‌తోపాటు బీఏఎంఎస్, బీయూఎంఎస్, బీఎస్‌ఎంఎస్ వంటి మెడికల్ కోర్సుల్లో ప్రవేశాలకు యేటా లక్షలాది మంది విద్యార్ధులు పోటీ పడుతుంటారు. గతేడాది ఏకంగా 24 లక్షల మంది విద్యార్ధులు నీట్ పరీక్ష రాశారు. కానీ సీట్లు మాత్రం వేలల్లో మాత్రమే ఉంటాయి. దీంతో తీవ్ర పోటీ ఉంటుంది. ర్యాంకు వచ్చిన వారంతా టాప్ మెడికల్ కాలేజీల్లో సీట్లు పొందడానికి ముందు నుంచే సన్నాహాలు చేస్తుంటారు. ఇటువంటి వారి కోసం NIRF ర్యాంకింగ్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.