AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విద్యార్థులకు బిగ్‌ అలర్ట్.. ఇంటర్ ఫలితాల విడుదలకు డేట్‌ అండ్ టైం ఫిక్స్.. రిజల్ట్స్‌ వచ్చేది అప్పుడే

TS Inter Results 2026 Release Date: తెలంగాణలోని ఇంటర్ విద్యార్థులు ఎప్పుడు ఎప్పుడా అని ఎదురుచూస్తున్న పరీక్ష ఫలితాల రిలీజ్ డేట్‌ అండ్ ఫిక్స్ అయింది. ఈ నెల 12న అనగా ఆదివారం ఉదయం 11 గంటలకు తెలంగాణ ఇంటర్ పరీక్ష ఫలితాలు విడుదల కానున్నాయి. తెలంగాణ ప్రభుత్వ సలహాదారుడు కే.కేశవరావు ఫలితాలను విడుదల చేయనున్నారు.

విద్యార్థులకు బిగ్‌ అలర్ట్.. ఇంటర్ ఫలితాల విడుదలకు డేట్‌ అండ్ టైం ఫిక్స్.. రిజల్ట్స్‌ వచ్చేది అప్పుడే
Ts Inter Results 2026
Anand T
| Edited By: |

Updated on: Apr 11, 2026 | 6:41 PM

Share

తెలంగాణ ఇంటర్ ఫలితాలపై బిగ్‌ అప్‌డేట్ వచ్చింది. విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఆత్రుతగా ఎదురుచూస్తున్న ఇంటర్ ఫలితాల విడుదలకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 12న అంటే ఆదివారం ఉదయం 11 గంటలకు ఇంటర్ ఫస్ట్ అండ్ సెకంర్ ఇయర్ ఫలితాలను చేయనున్నారు. తెలంగాణ ప్రభుత్వ సలహాదారుడు కే.కేశవరావు ఫలితాలను విడుదల చేస్తారు. ఈ ఫలితాలు రిలీజైన వెంటనే విద్యార్థులు టీవీ9 తెలుగు వెబ్ సైట్‌(www.tv9telugu.com) తో పాటు ఇతర అధికారిక వెబ్ సైట్లలో తమ హాల్‌ టికెట్ నెంబర్‌ను ఎంటర్ చేసి మార్కులను తెలుసుకోవచ్చు.

అయితే ఈ ఏడాది ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు రాష్ట్రంలో ఇంటర్‌ పరీక్షలు జరగ్గా.. రాష్ట్రవ్యాప్తంగా 9.9 లక్షల మందికి పైగా విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్ధులు 4,89,126 మంది, ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్ధులు 5,07,949 మంది ఉన్నారు.

ఆదివారం ఉదయం 11 గం.లకు తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల..

అయితే గతంలో జరిగిన తప్పులను దృష్టిలో ఉంచుకుని, ఈసారి ఫలితాల విడుదల విషయంలో ఇంటర్ బోర్డు తగిన జాగ్రత్తలు తీసుకుంది. పరీక్ష మార్కుల లెక్కింపులో ఎలాంటి తేడాలు జరగకుండా ఒకటి రెండు సార్లు మూల్యాంకనం చేసింది. అయితే కేవలం ఒకటి రెండు మార్కుల దగ్గర, ఒక్క పేపర్‌లో ఫెయిల్ అయిన విద్యార్థుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకొని రీ-వాల్యూయేషన్ చేసినట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి.

మరిన్ని కేరీర్ అండ్ ఉద్యోగ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us