పరీక్షల సమయంలో విద్యార్థులకు నో టెన్షన్..! డైటీషియన్ చెప్పినట్టుగా చేసి చూడండి..!

పరీక్షలు దగ్గర పడుతున్నాయంటే చాలు విద్యార్థులకు ఒత్తిడి ఎక్కువవుతుంది. పరీక్షల సమయం విద్యార్థులకు చాలా కష్టమైన సమయం. చాలా మంది పిల్లలు సంవత్సరం అంతా చదవనంత ఎక్కువగా పరీక్షలప్పుడు చదువుతారు. ఈ సమయంలో చాలా మంది పిల్లలు ఆందోళనగా, ఒత్తిడితో, భయంగా ఉంటారు.

పరీక్షల సమయంలో విద్యార్థులకు నో టెన్షన్..! డైటీషియన్ చెప్పినట్టుగా చేసి చూడండి..!
Exam Stress

Updated on: Feb 12, 2025 | 9:59 PM

పరీక్షల ఒత్తిడి కొంతమంది పిల్లల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. అందుకే పిల్లలు సరైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. పరీక్షల ఒత్తిడిని తగ్గించడానికి ఏకాగ్రతను మెరుగుపరచడానికి సమతుల్య ఆహారం చాలా అవసరం. మంచి పోషకాహారం తీసుకోవడం వల్ల ఆరోగ్యం కూడా బాగుంటుంది. పరీక్షల ఒత్తిడిని తగ్గించుకొని ప్రశాంతంగా చదవడానికి ఉపయోగపడే కొన్ని చిట్కాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఆహారం పరీక్షల ఒత్తిడిని ఎలా తగ్గిస్తుంది..?

పిల్లలకు మాత్రమే కాదు ఆహారం తీసుకోవడం వల్ల మానసిక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఆహారం తీసుకోవడం వల్ల పిల్లల మానసిక సామర్థ్యంపై ప్రత్యక్ష ప్రభావం ఉంటుందని డైటీషియన్ చెబుతున్నారు. ఉదాహరణకు ఐరన్ లోపం డోపమైన్ ప్రసరణకు అంతరాయం కలిగిస్తుంది. ఇది వారి తెలివితేటలపై ప్రభావం చూపుతుంది. విటమిన్ ఇ, థయామిన్, విటమిన్ బి, జింక్, అయోడిన్ వంటి అనేక ఖనిజాలు, విటమిన్లు పిల్లల జ్ఞాన సామర్థ్యాన్ని, మానసిక దృష్టిని మెరుగుపరుస్తాయని తేలింది. పరీక్షల ఒత్తిడిని తగ్గించడానికి చదువుపై దృష్టి పెట్టడానికి నిపుణులు చెప్పిన కొన్ని ఆహార చిట్కాలు ఇక్కడ ఉన్నాయి.

కార్బోహైడ్రేట్స్ తీసుకోవడం

అన్ని కార్బోహైడ్రేట్స్ చెడ్డవి కావు మీ ఆహారంలో ఆరోగ్యకరమైన కార్బోహైడ్రేట్స్ చేర్చండి. వీటిలో తృణధాన్యాల రొట్టె, బ్రౌన్ రైస్, క్వినోవా, గోధుమలు వంటివి తీసుకోండి. వీటిలో గ్లూకోజ్ ఎక్కువగా ఉంటుంది అని నిపుణులు చెప్తున్నారు. చిలగడదుంపలు, గుమ్మడికాయ వంటివి కూడా కార్బోహైడ్రేట్స్‌కు ఉదాహరణలు. అయితే ప్రతిదీ మితంగా తినాలి. ఎక్కువ తినకూడదు.

ఎక్కువ కూరగాయలు తినడం

కూరగాయల శక్తిని తక్కువ అంచనా వేయకండి. కూరగాయలలో అనేక పోషకాలు ఉంటాయి. అవి మీకు చాలా విధాలుగా ఉపయోగపడతాయి. కాబట్టి పిల్లలు అన్ని రకాల కూరగాయలు తినాలని డైటీషియన్ సూచిస్తున్నారు. కానీ పిండి లేని కూరగాయలు ఎక్కువగా తినాలి. బంగాళాదుంపలు తినడం తగ్గించాలి.

ఒమేగా-3లు తీసుకోండి

ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ మెదడు ఆరోగ్యానికి, ఏకాగ్రతకు సహాయపడతాయని మీకు తెలుసా..? పిల్లలు వారానికి కనీసం రెండుసార్లు ఒమేగా-3 ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. సీఫుడ్, చేపలలో ఒమేగా-3లు ఎక్కువగా ఉంటాయి. చేపలు, చికెన్, ట్యూనా, టర్కీ, లీన్ రెడ్ మీట్ వంటి లీన్ ఫుడ్స్ పిల్లల ఆహారంలో ఉండాలి అని నిపుణులు అంటున్నారు.

పెరుగు తినండి

పెరుగు మీ పేగులను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది అని డైటీషియన్ వివరిస్తున్నారు. పరీక్షల సమయంలో కడుపు సంబంధిత సమస్యలు రాకుండా ఉండటానికి పేగు ఆరోగ్యాన్ని కాపాడటానికి సహాయపడే ఆహారాలు తినడం చాలా ముఖ్యం. పెరుగు ప్రోబయోటిక్. ఇది కడుపులో మంచి బ్యాక్టీరియాను పెంచుతుంది. సెరోటోనిన్ అనే హార్మోన్ ఉత్పత్తికి సహాయపడుతుంది. ఇది ఒత్తిడిని తగ్గిస్తుంది. పరీక్షలకు ముందు పెరుగు- చక్కెర తినడం మానేయవద్దని డైటీషియన్ సూచిస్తున్నారు.

సమతుల్యత పాటించండి

కార్బోహైడ్రేట్స్ చెడ్డవని చాలామంది అనుకుంటారు. కానీ కార్బోహైడ్రేట్స్ అమైనో యాసిడ్స్‌తో కలిపి పిల్లల అవగాహన, తార్కిక, గ్రహణ సామర్థ్యాలను మెరుగుపరచడంలో సహాయపడతాయని డైటీషియన్ అంటున్నారు. పరిశోధనల ప్రకారం.. సమతుల్య ఆహారం తీసుకోవడం వల్ల విద్యార్థుల జ్ఞాన, మేధో పనితీరు మెరుగుపడుతుంది. ముఖ్యంగా పరీక్షల కోసం చదివేటప్పుడు. విద్యార్థులు తమ భోజనంలో సగం ప్లేట్ కూరగాయలు, పావు ప్లేట్ కార్బోహైడ్రేట్స్, తగినంత ప్రోటీన్ తీసుకోవాలి. శ్రద్ధగా, ఆసక్తిగా ఉండాలంటే విద్యార్థులు బాగా తినాలి అని నిపుణులు సూచిస్తున్నారు.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)