ICET Notification: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంబీఏ, ఎంసీఏ ప్రవేశాల కోసం 2021-22 సంవత్సరానికి ఐసెట్ నోటిఫికేషన్ శనివారం కాకతీయ విశ్వవిద్యాలయంలో కామర్స్, మేనేజ్‌మెంట్ విభాగం సెమినార్‌లో విడుదల చేయనున్నట్లు ఐసెల్ కన్వీనర్ ఆచార్య కె. రాజిరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 11.30 గంటలకు జరిగే ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి హాజరవుతారని ఆయన తెలిపారు. కాగా, ఈ ప్రవేశ పరీక్షకు ఈనెల 7 నుంచి జూన్ 15వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరించనున్నారు.
కాగా, ఇటీవల ఐసెల్ 2021 షెడ్యూల్‌ను విడుదల చేసిన రాష్ట్ర ఉన్నత విద్యామండలి.. 2021-22 విద్యా సంవత్సరానికి గానూ ఎంసీఏ, ఎంబీఏ సీట్ల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్‌ను శనివారం విడుదల చేయనుంది. ఏప్రిల్ 7 నుంచి జూన్ 15 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించే ఈ ఈ ఐసెల్ ప్రవేశ పరీక్షను మాత్రం ఆగస్టులో నిర్వహింనున్నారు.
అలాగే ఆలస్య రుసుము రూ.250తో జూన్ 30 వరకు, రూ.500తో జూలై 15 వరకు రూ.1000తో జూలై 30 వరకు ఐసెట్‌కు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించినట్లు తెలుస్తోంది. ఇక పరీక్ష ఫీజు రూ.650 గా నిర్ణయించారు. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.450గా నిర్ణయించారు.
ఇవీ చదవండి: Schools Reopen: తెలంగాణ పాఠశాల విద్యాశాఖ కీలక నిర్ణయం.. వచ్చే వారం నుంచి టెన్త్ ప్రత్యక్ష తరగతులు..!
Job Notification: ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ లో ఉద్యోగాలకు నోటిఫికేషన్!