SCCL Apprenticeship: తెలంగాణోని సింగ‌రేణి కాల‌రీస్ కంపెనీలో భారీగా అప్రెంటిస్ ఖాళీలు.. 1146 పోస్టుల భ‌ర్తీ..

|

Jun 22, 2021 | 9:59 PM

SCCL Apprenticeship 2021: ప్ర‌భుత్వ రంగ.. సంస్థ ది సింగ‌రేణి కాల‌రీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్‌సీసీఎల్‌) ప‌లు అప్రెంటిస్ ఖాళీల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ జారీ చేసింది. తెలంగాణ‌లోని ఎస్‌సీసీఎల్‌కి చెందిన...

SCCL Apprenticeship: తెలంగాణోని సింగ‌రేణి కాల‌రీస్ కంపెనీలో భారీగా అప్రెంటిస్ ఖాళీలు.. 1146 పోస్టుల భ‌ర్తీ..
Sccl Aprentship
Follow us on

SCCL Apprenticeship 2021: ప్ర‌భుత్వ రంగ.. సంస్థ ది సింగ‌రేణి కాల‌రీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్‌సీసీఎల్‌) ప‌లు అప్రెంటిస్ ఖాళీల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ జారీ చేసింది. తెలంగాణ‌లోని ఎస్‌సీసీఎల్‌కి చెందిన హెచ్ఆర్‌డీ విభాగం వివిధ ట్రేడుల్లో ఖాళీగా ఉన్న ఈ పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు.

భ‌ర్తీ చేయ‌నున్న ఖాళీలు, అర్హ‌త‌లు..

* ఎలక్ట్రీషియన్‌, ఫిట్టర్స్‌, టర్నర్స్‌, మెషినిస్టులు, మెకానిక్‌ మోటార్‌ వెహికిల్‌, డ్రాఫ్ట్స్‌మెన్‌ (సివిల్‌), డీజిల్‌ మెకానిక్స్‌, వెల్డర్స్ ట్రేడుల్లో 1146 ఖాళీల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు.

* పైన తెలిపిన అప్రెంటిస్ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునే అభ్య‌ర్థులు.. పదో తరగతి, సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణత. ఇంటర్మీడియట్‌ ఒకేషనల్‌ విద్యార్థులు అర్హులు కాదు.

* అభ్య‌ర్థుల వ‌య‌సు 28 ఏళ్లు మించ‌కూడ‌దు.

ముఖ్య‌మైన విషయాలు..

* పోస్టుల‌కు ఎంపికైన రెండేళ్ల ఐటీఐ అభ్యర్థులకి నెలకి రూ.8050, ఏడాది ఐటీఐ అభ్యర్థులకి నెలకి రూ.7700 చెల్లిస్తారు.

* ఆదిలాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌, ఖమ్మం (16 జిల్లాల) అభ్యర్థుల్ని లోకల్‌ గాను, మిగతా జిల్లాల అభ్యర్థుల్ని నాన్‌ లోకల్‌ గాను పరిగణనలోకి తీసుకుంటారు. వీరికి 80:20 నిష్పత్తిలో అప్రెంటిస్‌ సీట్ల కేటాయింపు ఉంటుంది.

* అభ్య‌ర్థుల‌ను.. ఐటీఐ ఉత్తీర్ణత సీనియారిటీ ప్రాతిపదికన ఎంపిక చేస్తారు. ఒకవేళ చాలామంది అభ్యర్థుల ఉత్తీర్ణత సంవత్సరం ఒకటే అయి ఉంటే, వారి ఐటీఐలో సాధించిన మార్కుల మెరిట్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు.

* అర్హ‌త‌, ఆస‌క్తి ఉన్న అభ్య‌ర్థులు ఆన్‌లైన్ విధానంలో రిజిస్ట్రేష‌న్ చేసుకోవాలి.

* ద‌ర‌ఖాస్తుల‌కు స్వీక‌ర‌ణ‌కు చివ‌రి తేదీగా 28-06-2021ని నిర్ణ‌యించారు.

* పూర్తి వివ‌రాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Also Read: Tuberculosis: టీబీ చికిత్సలో సాధారణ యాంటీబయాటిక్స్ సమర్థవంతంగా పని చేస్తాయి..తాజా పరిశోధనల్లో వెల్లడి

Black Pepper Tea: సీజనల్ వ్యాధులతో సహా సైనస్ తో ఇబ్బంది పడుతున్నారా ఈ టీని తాగండి అద్భుత ఫలితాలు పొందండి

Telangana Ed-CET: ఎడ్‌సెట్ ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణ గ‌డువు మ‌రోసారి పెంపు.. ఎప్ప‌టివ‌ర‌కు అవ‌కాశ‌ముందంటే..