Rbi
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) డిప్యూటీ గవర్నర్ పదవికి దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులను ఆహ్వానిస్తూ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆర్భీఐ వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఏప్రిల్ 10 అని వెబ్ సైట్‌లో పేర్కొన్నారు. పోస్ట్ 17వ స్థాయి పే స్కేల్‌ను కలిగి ఉంటుంది. ఇది దాదాపు రూ.2,25,000గా ఉంటుంది. అలాగే అపాయింట్‌మెంట్ అయిన తేదీ నుంచి మూడు సంవత్సరాల పాటు ఈ పోస్టులో కొనసాగుతారు. అన్ని వివరాలతో సక్రమంగా పూరించిన దరఖాస్తులను సంజయ్ కుమార్ మిశ్రా, ఆర్థిక సేవల శాఖ అండర్ సెక్రటరీ (బీఓఐ), డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, రెండో ఫ్లోర్, జీవన్ డీప్ బిల్డింగ్, పార్లమెంట్ స్ట్రీట్, న్యూ ఢిల్లీ-110 001 ఫోన్ 011- 23747189 కు పోస్ట్ చేయాల్సి ఉంటుంది. అయితే ఈ పోస్ట్ గురించిన వివరాల కోసం, భారతీయ రిజర్వ్ బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించడం ఉత్తమం. ఈ పోస్టును అనుసరించి విద్యార్హతలు ఎలా ఉన్నాయో? ఓ సారి తెలుసుకుందాం.
అర్హతలు ఇవే
- బ్యాంకింగ్, ఫైనాన్షియల్ మార్కెట్ కార్యకలాపాల్లో కనీసం పదిహేనేళ్ల అనుభవం ఉండాలి
- పూర్తి సమయం డైరెక్టర్/బోర్డు సభ్యుడిగా విస్తృతమైన అనుభవం, ఆర్థిక రంగంలో పర్యవేక్షణ, సమ్మతి గురించి చాలా సీనియర్ స్థాయిలో అవగాహన
- అధిక-స్థాయి అవుట్‌పుట్‌ను వివరించడం, సంగ్రహించడం మరియు కమ్యూనికేట్ చేయడంతో సహా ఆర్థిక పనితీరు డేటాతో పనిచేసే బలమైన సామర్థ్యాలు
- పబ్లిక్ పాలసీ విషయాలపై బలమైన మరియు స్పష్టమైన కమ్యూనికేషన్ నైపుణ్యాలు.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.