TGPSC JL Merit List: తెలంగాణ జూనియర్‌ లెక్చరర్‌ (జేఎల్‌) పోస్టుల మెరిట్‌ లిస్ట్‌ విడుదల.. ధ్రువపత్రాల పరిశీలన తేదీలివే

|

Jul 29, 2024 | 2:18 PM

తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్‌ విద్యాశాఖలో మొత్తం 1,392 జూనియర్‌ లెక్చరర్‌ (జేఎల్‌) పోస్టులకు గతేడాది సెప్టెంబర్‌లో రాత పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. మొత్తం 16 సబ్జెక్టులకు గానూ 11 రోజుల పాటు ఈ పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షకు సంబంధించిన ఫలితాలు కూడా టీజీపీఎస్సీ ఇటీవల వెల్లడించింది. రాత పరీక్షకు సంబంధించి అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన జాబితా విడుదలైంది..

TGPSC JL Merit List: తెలంగాణ జూనియర్‌ లెక్చరర్‌ (జేఎల్‌) పోస్టుల మెరిట్‌ లిస్ట్‌ విడుదల.. ధ్రువపత్రాల పరిశీలన తేదీలివే
TGPSC
Follow us on

హైదరాబాద్‌, జూలై 28: తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్‌ విద్యాశాఖలో మొత్తం 1,392 జూనియర్‌ లెక్చరర్‌ (జేఎల్‌) పోస్టులకు గతేడాది సెప్టెంబర్‌లో రాత పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. మొత్తం 16 సబ్జెక్టులకు గానూ 11 రోజుల పాటు ఈ పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షకు సంబంధించిన ఫలితాలు కూడా టీజీపీఎస్సీ ఇటీవల వెల్లడించింది. రాత పరీక్షకు సంబంధించి అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన జాబితా విడుదలైంది. ప్రతిభ ఆధారంగా 1:2 నిష్పత్తిలో ధ్రువీకరణ పత్రాల పరిశీలనకు మెరిట్‌ జాబితాను టీజీపీఎస్సీ ప్రకటించింది. ఇక దివ్యాంగులకు 1:5 నిష్పత్తిలో మెరిట్‌ జాబితా విడుదల చేసింది.

వీరందరికీ ఆగస్టు 5వ తేదీ నుంచి సెప్టెంబరు 11 వరకు టీజీపీఎస్సీ కార్యాలయంలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ ప్రక్రియ కొనసాగుతుంది. ఆయా తేదీల్లో ఉదయం 10.30 గంటల నుంచి ఈ ప్రక్రియ ప్రారంభమవుతుంది. అభ్యర్థులు ఆగస్టు 3 నుంచి 13 వరకు వెబ్‌ ఆప్షన్లు నమోదు చేసుకోవాలని కమిషన్‌ ఈ సందర్భంగా సూచించింది. ధ్రువీకరణ పత్రాల షెడ్యూల్‌తోపాటు మరిన్ని వివరాలకు కమిషన్‌ వెబ్‌సైట్‌లో చెక్‌ చేసుకోవాలని కమిషన్‌ సెకట్రరీ నవీన్‌ నికోలస్‌ తెలిపారు.

తెలంగాణ జేఎల్ 2024 అభ్యర్థుల ధ్రువీకరణ పత్రాల పరిశీలనకు మెరిట్‌ జాబితా కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

ఏపీ ట్రిపుల్‌ ఐటీ తొలి విడతలో 3,396 మందికి సీట్ల కేటాయింపు

ఆంధ్రప్రదేశ్‌ రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం పరిధిలోని ఆర్‌కే వ్యాలీ, నూజివీడు, శ్రీకాకుళం, ఒంగోలు ట్రిపుల్‌ ఐటీల్లో 2024-25 విద్యా సంవత్సరానికి ప్రవేశాలకు గానూ తొలివిడత కౌన్సెలింగ్‌ ప్రక్రియ ముగిసింది. తొలి విడతలో మొత్తం 4,140 మంది విద్యార్థులను కౌన్సెలింగ్‌ నిర్వహించగా.. వీరిలో 3,396 మంది విద్యార్ధులకు సీట్లు కేటాయించినట్లు ఆర్జీయూకేటీ సెట్‌ అడ్మిషన్‌ కన్వీనర్‌ ఎస్‌ అమరేంద్రకుమార్‌ తెలిపారు. మిగిలిన సీట్లను రెండో విడత కౌన్సెలింగ్‌లో భర్తీ చేస్తామని ఆయన అన్నారు. రెండో విడత కౌన్సెలింగ్‌ వివరాలను ఆగస్టు 3వ తేదీన ప్రకటిస్తామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.