AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TGPSC Group 2 Final Results: మరికాసేపట్లో టీజీపీఎస్సీ గ్రూప్‌ 2 తుది ఫలితాలు.. రిజల్ట్స్‌ డైరెక్ట్ లింక్‌ ఇదే

TGPSC Group 2 Final Result 2025 today: రాష్ట్ర గ్రూప్‌ 2 సర్వీసు పోస్టుల తుది ఫలితాలు ఆదివారం (సెప్టెంబర్‌ 28) విడుదల కానున్నాయి. ఈ రోజు మధ్యాహ్నం తర్వాత టీజీపీఎస్సీ గ్రూప్‌ ఫలితాలు విడుదల చేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది. ఫలితాలు విడుదలైన తర్వాత..

TGPSC Group 2 Final Results: మరికాసేపట్లో టీజీపీఎస్సీ గ్రూప్‌ 2 తుది ఫలితాలు.. రిజల్ట్స్‌ డైరెక్ట్ లింక్‌ ఇదే
TGPSC Group 2 Final Results
Srilakshmi C
|

Updated on: Sep 28, 2025 | 3:51 PM

Share

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 28: తెలంగాణ గ్రూప్‌ 2 సర్వీసు పోస్టుల తుది ఫలితాలు ఆదివారం (సెప్టెంబర్‌ 28) విడుదల కానున్నాయి. ఈ రోజు మధ్యాహ్నం తర్వాత టీజీపీఎస్సీ గ్రూప్‌ ఫలితాలు విడుదల చేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది. ఫలితాలు విడుదలైన తర్వాత అభ్యర్ధులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ వివరాలు నమోదు చేసి తుది ఫలితాలను తెలుసుకోవచ్చు.

కాగా టీజీపీఎస్సీ 2022లో 783 పోస్టుల భర్తీకి గ్రూప్‌ 2 నోటిఫికేషన్‌ జారీ చేసిన సంగతి తెలిసిందే. 2024 డిసెంబరులో రాత పరీక్ష నిర్వహించగా.. ఈ ఏడాది మార్చి 11న జనరల్‌ ర్యాంకుల జాబితాను వెల్లడించింది. ఇప్పటికే ధ్రువపత్రాల పరిశీలన కూడా పూర్తైంది. యూనిఫాం పోస్టులకు అర్హులైనవారి జాబితా సైతం వచ్చేసింది. దీంతో ఈ రోజు గ్రూప్‌ 2 తుది జాబితాను కమిషన్‌ వెల్లడించనుంది.

టీజీపీఎస్సీ గ్రూప్‌ 2 తుది ఫలితాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి. 

మరోవైపు గ్రూప్ 1 నియామకాలకు సంబంధించి తుది ఫలితాలు కూడా తాజాగా విడుదలయ్యాయి. శనివారం హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికగా గ్రూప్ 1 విజేతలకు సీఎం రేవంత్‌ రెడ్డి చేతుల మీదగా నియామక పత్రాలు అందజేశారు. దీంతో కమిషన్‌ గ్రూప్ 2, 3 ఉద్యోగాల భర్తీకి వడివడిగా అడుగులు వేస్తుంది. తొలుత గ్రూప్ 1 ప్రక్రియను పూర్తి చేస్తే… గ్రూప్ 2, 3లో ఖాళీలు మిగిలే ఉండే అవకాశం ఉండదని టీజీపీఎస్సీ భావిస్తోంది. ఈ మేరకు గ్రూప్‌ నియామకాలు పూర్తి కావడంతో గ్రూప్ 2, 3 పోస్టుల భర్తీని కూడా త్వరితగతిన పూర్తి చేయాలని నిర్ణయించింది.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.