
హైదరాబాద్, జూన్ 4: తెలంగాణలో పీజీ ఇంజనీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన TG PGECET 2026 పరీక్ష ఫలితాల విడుదలకు ముహూర్తం ఖరారైంది. జూన్ 5, శుక్రవారం మధ్యాహ్నం ఈ ఫలితాలను అధికారికంగా విడుదల చేయనున్నారు. హైదరాబాద్ కూకట్‌పల్లిలోని జేఎన్‌టీయూ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ విజిటర్స్ లాంజ్‌లో రేపు మధ్యాహ్నం 03:30 గంటలకు ఫలితాలను వెల్లడిస్తారు. తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ వి. బాలకిస్టా రెడ్డి, జేఎన్‌టీయూ హైదరాబాద్ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ టి కిషన్ కుమార్ రెడ్డి మరియు విశ్వవిద్యాలయ ఉన్నతాధికారులు ముఖ్య అతిథులుగా హాజరై ఈ ఫలితాలను విడుదల చేయనున్నారు.
Also Read: పులి, మేక, గడ్డి, రైతు.. నది ఎలా దాటాలి? మీ తెలివితేటలకు సవాల్ విసిరే చిక్కు ప్రశ్న
మధ్యాహ్నం 3:15 గంటలకు తెలంగాణ ఉన్నత విద్యా మండలి వెబ్‌సైట్‌లో ఫలితాలు అందుబాటులో ఉంటాయి. విద్యార్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్ ద్వారా తనిఖీ చేసుకోవచ్చు.
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ డిగ్రీ కాలేజీల్లో కంప్యూటర్ సైన్స్, ఫార్మసీ, సివిల్, ఈసీఈ, మెకానికల్ తదితర పీజీ కోర్సుల్లో 2026-27 విద్యాసంవత్సరానికి గానూ ఎంఈ, ఎంటెక్, ఎం.ఫార్మసీ, ఎం.ఆర్క్, ఫార్మ్-డీ వంటి పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఈ పరీక్షల కోసం రాష్ట్రవ్యాప్తంగా 26,005 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. టీజీ పీజీఈసెట్ ప్రవేశ పరీక్షలు జూన్ 1తో ముగిసిన సంగతి తెలిసిందే. మే 29న ప్రారంభమైన ఈ పరీక్షలు 4 రోజులపాటు ఆన్‌లైన్ విధానంలో రోజూ రెండు సెషన్లలో జరిగాయి. ఈ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 26,077 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. వీరిలో 23,637 మంది (90.64 శాతం) పరీక్షకు హాజరయ్యారు. ఆన్‌లైన్ పరీక్షలు కావడంతో ఫలితాలను కేవలం 4 రోజుల వ్యవధిలోనే విడుదల చేస్తున్నారు.
టీజీ పీజీఈసెట్ 2026 ఫలితాల డౌన్‌లోడ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.