TG Lawcet 2024 Rankers List: తెలంగాణ లాసెట్ ఫలితాల్లో మియాపూర్‌ కుర్రోడి సత్తా.. టాప్‌ 10 ర్యాంకర్లు వీరే

|

Jun 14, 2024 | 7:55 AM

లంగాణ లాసెట్, పీజీఎల్‌సెట్‌-2024 లాసెట్ ఫలితాలు గురువారం (జూన్‌ 13) విడుదలైన సంగతి తెలిసిందే. సెట్‌ నిర్వహణాధికారులు ఉన్నత విద్యామండలి కార్యాలయంలో ఫలితాల వివరాలను వెల్లడించారు. ర్యాంకు కార్డులను అధికారిక వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. తాజాగా విడుదలైన లాసెట్‌ ఫలితాల్లో 72.66 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఈ ఏడాది జూన్ 3న తెలంగాణ లాసెట్ నిర్వహించిన విషయం..

TG Lawcet 2024 Rankers List: తెలంగాణ లాసెట్ ఫలితాల్లో మియాపూర్‌ కుర్రోడి సత్తా.. టాప్‌ 10 ర్యాంకర్లు వీరే
TG Lawcet 2024 Rankers List
Follow us on

హైదరాబాద్‌, జూన్‌ 14: తెలంగాణ లాసెట్, పీజీఎల్‌సెట్‌-2024 లాసెట్ ఫలితాలు గురువారం (జూన్‌ 13) విడుదలైన సంగతి తెలిసిందే. సెట్‌ నిర్వహణాధికారులు ఉన్నత విద్యామండలి కార్యాలయంలో ఫలితాల వివరాలను వెల్లడించారు. ర్యాంకు కార్డులను అధికారిక వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. తాజాగా విడుదలైన లాసెట్‌ ఫలితాల్లో 72.66 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఈ ఏడాది జూన్ 3న తెలంగాణ లాసెట్ నిర్వహించిన విషయం తెలిసిందే. పరీక్షకు మొత్తం 50,684 మంది దరఖాస్తు చేసుకోగా.. వారిలో 40,268 మంది పరీక్షకు హాజరయ్యారు. వీరిలో దాదాపు 29, 258 మంది అంటే 72.66 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు.

తాజా ఫలితాల్లో లాసెట్‌ ఎల్‌ఎల్‌బీ (మూడేళ్లు) పరీక్షలో హైదరాబాద్‌కు చెందిన పీజీఎం అంబేడ్కర్‌ స్టేట్ ఫస్ట్‌ ర్యాంకు సాధించాడు. గచ్చిబౌలికి చెందిన ఎస్‌.ప్రత్యూష్‌ సెకండ్ ర్యాంకు, ఖమ్మంకు చెందిన టి.నరేష్‌ మూడో ర్యాంకు సాధించారు. లాసెట్‌ ఎల్‌ఎల్‌బీ (అయిదేళ్లు) పరీక్షలో మియాపూర్‌కు చెందిన బి.శ్రీరామ్‌, కామారెడ్డికి చెందిన పి.దినేశ్‌కు సెకండ్ ర్యాంకు, మల్కాజ్‌గిరికి చెందిన ఆర్‌పీ విజయనందినికి మూడో ర్యాంకు వచ్చింది. పీజీఎల్‌సెట్‌ ఎల్‌ఎల్‌ఎం పరీక్షలో పీబీ సాయి విష్ణువర్దన్‌ (సికింద్రాబాద్‌), పి.అబినీత్‌ జాసన్‌(పెనమలూరు), ఎన్‌.సిన్హా(హైదరాబాద్‌) మొదటి మూడు ర్యాంకులు సాధించి సత్తా చాటారు.

తెలంగాణ లాసెట్‌, పీజీఎల్‌సెట్ లో వచ్చిన ర్యాంకు ద్వారా రాష్ట్రంలోని పలు న్యాయ కాలేజీల్లో న్యాయవిద్యలో ప్రవేశాలు కల్పిస్తారన్న సంగతి తెలిసిందే. త్వరలోనే కౌన్సెలింగ్ షెడ్యూల్ విడులవుతుంది.

ఇవి కూడా చదవండి

తెలంగాణ లాసెట్-2024 టాప్‌ 10 ర్యాంకర్ల లిస్టు కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

తెలంగాణ పీజీ లాసెట్-2024 టాప్‌ 10 ర్యాంకర్ల లిస్టు కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

తెలంగాణ లాసెట్-2024 ఫలితాల కోసం క్లిక్‌ చేయండి. 

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.