TG EAPCET Results 2026: కాసేపట్లో తెలంగాణ ఈఏపీసెట్ ఫలితాలు.. ఇలా సింపుల్‌గా చెక్‌ చేసుకోండి!

తెలంగాణలో ఎంసెట్ పరీక్ష రాసి ఫలితాల కోసం ఎదురు చూస్తున్న విద్యార్థులకు బిగ్‌ అలర్ట్.. మీరు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఫలితాలు రాబోయే సమయం ఆసన్నమైంది. ఇవాళ ఉదయం 11 గంటలకు తెలంగాణ ఎంసెట్-2026 పరీక్ష ఫలితాలు అధికారులు విడుదల చేయనున్నారు. కాబట్టి ఈజీగా ఫలితాలు ఎక్కడ చూసుకోవాలో ఇక్కడ తెలుసుకోండి.

TG EAPCET Results 2026: కాసేపట్లో తెలంగాణ ఈఏపీసెట్ ఫలితాలు.. ఇలా సింపుల్‌గా చెక్‌ చేసుకోండి!
Tg Eapcet 2026 Results

Edited By:

Updated on: May 17, 2026 | 8:14 AM

తెలంగాణలో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన TG EAPCET-2026 (ఎంసెట్) ఫలితాల విడుదలకు ముహూర్తం ఖరారైంది. ఇవాళ ఉదయం 11:00 గంటలకు జేఎన్‌టీయూ హైదరాబాద్ (JNTUH) లోని గోల్డెన్ జూబ్లీ హాల్‌లో ఈ ఫలితాలను అధికారికంగా విడుదల చేయనున్నారు. ఈ మేరకు తెలంగాణ ఈఏపీసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ కె. విజయ్ కుమార్ రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలియజేశారు. తెలంగాణ ప్రభుత్వ సలహాదారు కే కేశవరావు ముఖ్య అతిథిగా విచ్చేసి ఫలితాలను విడుదల చేయనున్నారు. ఈ కార్యక్రమంలో వారితో డాక్టర్ యోగితా రాణా,సెక్రటరీ, విద్యాశాఖ, శ్రీదేవసేన, కమిషనర్, సాంకేతిక అండ్ కళాశాల విద్య ,ప్రొఫెసర్ వి. బాలకిస్తా రెడ్డి సహా ప్రముఖులు పాల్గొననున్నారు.

ఉదయం 11:00 గంటలకు ఫలితాల అనాలిసిస్‌తో కూడిన సీడీని విడుదల చేస్తారు. దీనికి సంబంధించిన పాస్‌వర్డ్‌ను ఉదయం 11:15 గంటలకు ప్రకటిస్తారు. ఫలితాల్లో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ స్ట్రీమ్స్ విద్యార్థుల మార్కులు, ర్యాంకులు. రెండు విభాగాలకు సంబంధించి టాప్-10 విద్యార్థుల వివరాలు ఉంటాయి. ఈ సంవత్సరం మే 4 నుంచి 11 వరకు జరిగిన ఈఏపీసెట్ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా భారీ సంఖ్యలో విద్యార్థులు హాజరయ్యారు. రెండు స్ట్రీమ్‌లకు కలిపి మొత్తం 2,82,195 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు.

ఇంజినీరింగ్ స్ట్రీమ్: మే 9, 10, 11 తేదీల్లో జరిగిన ఈ పరీక్షలకు మొత్తం 2,10,766 మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకోగా.. 1,97,241 మంది (93.58%) పరీక్షకు హాజరయ్యారు.

అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ స్ట్రీమ్: మే 4, 5 తేదీల్లో జరిగిన ఈ పరీక్షల కోసం 90,977 మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకోగా.. 84,954 మంది (93.38%) అభ్యర్థులు పరీక్ష రాశారు.

ఫలితాలను ఇక్క చేసుకోవడం ఎలా?

ఫలితాలు విడుదలైన వెంటనే విద్యార్థులు తమ హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేసి ర్యాంక్ కార్డ్‌లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
అధికారిక వెబ్‌సైట్: [https://eapcet.tgche.ac.in/](https://eapcet.tgche.ac.in/)

మరిన్ని కెరీర్ అండ్ ఉద్యోగ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us