EAPCET 2026 టాప్‌ ర్యాంకర్లంతా ఇతర రాష్ట్రాల బాట.. కౌన్సెలింగ్‌కు కేవలం ఐదుగురే! వెలుగులోకి షాకింగ్ నిజాలు!

రాష్ట్రంలో ఇంజనీరింగ్‌ కోర్సుల్లో ప్రవేశాలకు ఈఏపీసెట్‌ కౌన్సెలింగ్‌ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. జూన్‌ 29వ తేదీ వరకు ప్రాసెసింగ్ ఫీజు చెల్లించి స్లాట్ బుక్‌ చేసుకోవచ్చు. అయితే యేటా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఈఏపీసెట్‌ ప్రవేశ పరీక్షలో టాపర్లుగా నిలుస్తున్న ప్రతిభావంతులైన విద్యార్ధులు తెలంగాణ రాష్ట్రంలో చదవడం లేదనే చేదు వార్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది..

EAPCET 2026 టాప్‌ ర్యాంకర్లంతా ఇతర రాష్ట్రాల బాట.. కౌన్సెలింగ్‌కు కేవలం ఐదుగురే! వెలుగులోకి షాకింగ్ నిజాలు!
Tg Eapcet Top Rankers SkipTG EAPCET Top Rankers Skip Counselling Counselling

Updated on: Jun 26, 2026 | 7:46 AM

హైదరాబాద్‌, జూన్‌ 26: రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన ఈఏపీసెట్ ఇంజినీరింగ్‌ విభాగంలోని టాపర్లు మన రాష్ట్రంలో అడ్మిషన్లు పొందడం లేదు. వీరంతా ఇతర రాష్ట్రాల్లో చదివేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ ఏడాది ఈఏపీసెట్‌ టాప్‌ 100 ర్యాంకర్లలో కేవలం ఐదుగురు మాత్రమే ఎప్‌సెట్‌ వెబ్‌ కౌన్సెలింగ్‌కు దరఖాస్తు చేసుకోవడం గమనార్హం. అంటే 95 మంది ఇంతవరకు ఈఏపీసెట్‌ కౌన్సెలింగ్‌ వైపే చూడలేదన్నమాట. ఇక 100 నుంచి 500లోపు ర్యాంకర్లలో కేవలం 42 మంది మాత్రమే కౌన్సెలింగ్‌కు దరఖాస్తు చేసుకోవడం విచిత్రంగా మారింది.

తాజాగా ఈఏపీసెట్‌ తొలి విడత కౌన్సెలంగ్‌కు రిజిస్ట్రేషన్‌ గడువు ముగియగా.. ప్రస్తుతం సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ ప్రక్రియ కొనసాగుతుంది. ఈ క్రమంలో తొలి విడతకు 84,002 మంది విద్యార్థులు ప్రాసెసింగ్‌ ఫీజు చెల్లించి ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ చేసుకోగా.. వీరిలో జూన్‌ 24 నాటికి 36,393 మంది వెరిఫికేషన్‌కు హాజరయ్యారు. రాష్ర్టానికి చెందిన టాప్‌ ర్యాంకర్లలో అత్యధికులు సీటు వస్తే ఐఐటీలు, ఎన్‌ఐటీల్లో చేరుతున్నారు. ఫీజులు కట్టే స్థోమత ఉన్నవారు మాత్రం ప్రైవేట్‌ వర్సిటీల బాటపడుతున్నారు. రాష్ట్రంలో టాప్‌ 20 కాలేజీలు మినహా మిగతా ఇంజనీరింగ్‌ కాలేజీల్లో నాసిరకం విద్యా ప్రమాణాలు ఉండటమే అందుకు కారణమని అంటున్నారు. కేవలం ఈఏపీసెట్‌లో 5 వేల తర్వాతి ర్యాంకర్లు మాత్రమే రాష్ట్రంలో అడ్మిషన్లు పొందుతున్నట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. పూర్తి సమాచారం కోసం ఈ కింది గణాంకాలు పరిశీలించండి..

ఇవి కూడా చదవండి

టీజీ ఈఏపీసెట్‌ 2026 కౌన్సెలింగ్‌కు రిజిస్ట్రేషన్‌ చేసుకున్న వారు వీరే

  • 1 నుంచి 100 ర్యాంకులు వచ్చిన వారిలో ఐదుగురు
  • 101 నుంచి 500 ర్యాంకులు వచ్చిన వారిలో 42 మంది
  • 501 నుంచి 1000 ర్యాంకులు వచ్చిన వారిలో 135 మంది
  • 10,001 నుంచి 5000 ర్యాంకులు వచ్చిన వారిలో 2,611 మంది
  • 5,0001 నుంచి 10 వేల ర్యాంకులు వచ్చిన వారిలో 3,898 మంది
  • 10,001 నుంచి 20 వేల ర్యాంకులు వచ్చిన వారిలో 7,943 మంది
  • 20,001 నుంచి 40 వేల ర్యాంకులు వచ్చిన వారిలో 14,831 మంది
  • 40,001 నుంచి80 వేల ర్యాంకులు వచ్చిన వారిలో 24,462 మంది
  • 80,001 నుంచి చివరి ర్యాంకు వరకు 30,075 మంది
Loading...
Unable to load recommendations.
Follow Us