TG TET 2026 Application: రేపట్నుంచే టెట్ దరఖాస్తులు ప్రారంభం.. ప్రభుత్వ GOలో ఈ కీలక మార్పులు గమనించారా?

Telangana TET 2026 January Notification: తెలంగాణ టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (టెట్ జనవరి 2025) నోటిఫికేషన్‌ గురువారం (నవంబర్‌ 13) విడుదలైన సంగతి తెలిసిందే. 2025 సంవత్సరానికి సంబంధించి రెండో విడత నోటిఫికేషన్‌ను ఈ మేరకు విద్యాశాఖ విడుదల చేసింది. ఏటా రెండుసార్లు టెట్‌ నిర్వహిస్తామని ఇచ్చిన హామీ రేవంత్‌ సర్కార్‌..

TG TET 2026 Application: రేపట్నుంచే టెట్ దరఖాస్తులు ప్రారంభం.. ప్రభుత్వ GOలో ఈ కీలక మార్పులు గమనించారా?
Telangana Teacher Eligibility Test 2026 Exam Dates

Updated on: Nov 14, 2025 | 3:00 PM

హైదరాబాద్‌, నవంబర్‌ 13: తెలంగాణ టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (టెట్ జనవరి 2025) నోటిఫికేషన్‌ గురువారం (నవంబర్‌ 13) విడుదలైన సంగతి తెలిసిందే. 2025 సంవత్సరానికి సంబంధించి రెండో విడత నోటిఫికేషన్‌ను ఈ మేరకు విద్యాశాఖ విడుదల చేసింది. ఏటా రెండుసార్లు టెట్‌ నిర్వహిస్తామని ఇచ్చిన హామీ రేవంత్‌ సర్కార్‌ ఈ మేరకు 2025 సంవత్సరానికి టెట్‌ తుది విడత నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఇక ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్లు రేపట్నుంచి అంటే నవంబరు 15 నుంచి మొదలు కానున్నాయి. నవంబర్‌ 29వ తేదీ వరకు ఆన్‌లైన్‌ దరఖాస్తు చేసుకోవచ్చు. టెట్‌ ఆన్‌లైన్‌ రాత పరీక్షలు జనవరి 3 నుంచి 31వ తేదీ మధ్య రాష్ట్ర వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో నిర్వహించనున్నారు.

టెట్ రాత పరీక్ష మొత్తం 150 మార్కులకు ఉంటుంది. ఎలాంటి నెగెటివ్‌ మార్కులు ఉండవు. ఇందులో అర్హత సాధించిన వారికి జీవిత కాలం వ్యాలిడిటీ ఉంటుంది. టెట్‌ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి సమాచారం నవంబరు 15వ తేదీన అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతామని పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు, టెట్‌ ఛైర్మన్‌ నవీన్‌ నికోలస్‌ తెలిపారు. కాగా యేటా రెండుసార్లు టెట్ నిర్వహిస్తామని ప్రకటిచిన రేవంత్‌ ప్రభుత్వం 2025 జూన్‌లో మొదటి విడత పరీక్షను నిర్వహించింది. తుది విడతకు తాజాగా ప్రకటన జారీ చేసింది.

తెలంగాణ టెట్ 2026 ఆన్ లైన్ దరఖాస్తుల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి

ఇక సుప్రీంకోర్టు తీర్పు మేరకు ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో టచర్లుగా పనిచేస్తున్న వారు ఈ సారి టెట్‌ పరీక్ష రాయనున్నారు. ఈ మేరకు జీవోలో మార్పు చేస్తూ ప్రభుత్వం ప్రకటించింది. సుప్రీంకోర్టు తీర్పు మేరకు తీర్పుజారీ చేసిన తేదీ నుంచి అంటే సెప్టెంబరు 1వ తేదీ నుంచి సరిగ్గా రెండేళ్లలోపు టీచర్లుగా పనిచేస్తున్న వారు ఉద్యోగాల్లో కొనసాగాలంటే టెట్‌ తప్పనిసరిగా ఉత్తీర్ణత కావాల్సి ఉంటుంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోనూ టెట్ నోటిఫికేషన్‌ వెలువడింది. అక్కడి ప్రభుత్వం కూడా ప్రభుత్వ పాఠశాలల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులు టెట్ పరీక్ష రాసేందుకు వెసులుబాటు కల్పిస్తూ జీవోలో మార్పు చేసింది.

అయితే గతంలో బీఈడీ విద్యార్హతతో ఎస్‌జీటీలుగా ఎంపికైన టీచర్లు ఉన్నారు. ప్రస్తుతం ఎస్‌జీటీలకు డీఈడీ విద్యార్హత. ఈ క్రమంలో బీఈడీతో ఎస్‌జీటీలుగా ఎంపికైన ఇన్‌ సర్వీస్‌ టీచర్లతోపాటు ప్రైవేట్‌ పాఠశాలల్లోని ఉపాధ్యాయులు పేపర్‌ 1 పరీక్ష రాయవచ్చని స్పష్టత ఇచ్చింది. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి శ్రీదేవసేన సవరించి జీఓ జారీ చేశారు.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.