TS TET 2025 Hall Tickets: టెట్‌ జూన్‌ సెషన్‌ హాల్‌టికెట్లు విడుదల రేపే.. డైరెక్ట్‌ లింక్‌ ఇదిగో!

టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్‌ 2025 జూన్‌) ఆన్‌లైన్‌ పరీక్షల షెడ్యూల్‌ను ఇటీవల విద్యాశాఖ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షలకు సంబంధించిన హాల్‌టికెట్లు బుధవారం (జూన్‌ 11) విడుదల కానున్నాయి. టెట్‌ వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లు విడుదలైన తర్వాత అభ్యర్ధులు తమ వివరాలు నమోదు..

TS TET 2025 Hall Tickets: టెట్‌ జూన్‌ సెషన్‌ హాల్‌టికెట్లు విడుదల రేపే.. డైరెక్ట్‌ లింక్‌ ఇదిగో!
TET Hall Tickets

Updated on: Jun 10, 2025 | 10:22 AM

హైదరాబాద్‌, జూన్‌ 10: తెలంగాణ టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్‌ 2025 జూన్‌) ఆన్‌లైన్‌ పరీక్షల షెడ్యూల్‌ను ఇటీవల విద్యాశాఖ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షలకు సంబంధించిన హాల్‌టికెట్లు బుధవారం (జూన్‌ 11) విడుదల కానున్నాయి. టెట్‌ వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లు విడుదలైన తర్వాత అభ్యర్ధులు తమ వివరాలు నమోదు చేసి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. కాగా ఈసారి టెట్‌కు రాష్ట్ర వ్యాప్తంగా 1.66 లక్షల మంది నుంచి 1,83,653 దరఖాస్తులు వచ్చాయి. వీరిలో పేపర్‌-1కు 46 వేలు, పేపర్‌ 2కు 1.03 లక్షలు, రెండు పేపర్లకు కలిపి 16 వేలకు పైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నట్లు విద్యాశాఖ తెలిపింది. వీరికి ఆన్‌లైన్‌ రాత పరీక్షలను జూన్‌ 18 నుంచి 30 వరకు కంప్యూటర్‌ బేస్డ్‌ పద్ధతిలో నిర్వహించనున్నారు.

తెలంగాణ టెట్‌ 2025 జూన్‌ హాల్‌ టికెట్ల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఆయా తేదీల్లో రోజుకు రెండు సెషన్లలో ఉదయం 9 గంటల నుంచి 11:30 వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి 4:30 వరకు పరీక్షలను నిర్వహించనున్నారు. జూన్‌ 18, 19, 20, 23, 24, 27, 28, 29, 30 తేదీల్లో రెండు సెషన్లలో ఈ పరీక్షలు నిర్వహిస్తారు. జూన్‌ 23న మధ్యాహ్నం, 28న ఉదయం విడతల్లో మాత్రమే పరీక్షలు ఉంటాయి. మొత్తం తొమ్మిది రోజుల పాటు 16 విడతల్లో ఈ పరీక్షలు జరగనున్నాయి.

ఇవి కూడా చదవండి

అధ్యాపకుల పరిశోధనకు రూ.60 కోట్లు నిధులు కేటాయించిన ఏఐసీటీఈ

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యాసంస్థల్లో పరిశోధనలను ప్రజలకు ఉపయోగపడే విధంగా మార్చే లక్ష్యంతో అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) కీలక నిర్ణయం తీసుకుంది. ల్యాబ్‌ టూ మార్కెట్‌ పేరిట పరిశోధనా ప్రోత్సాహక పథకాన్ని తాజాగా ప్రారంభించింది. ఈ పథకానికి మొత్తం రూ.60 కోట్లు ఖర్చు చేయనున్నట్లు ప్రకటించింది. అందులో రూ.10 కోట్లు పాలిటెక్నిక్‌ కాలేజీల్లోని అధ్యాపకులకు కేటాయించనున్నారు. ఏఐసీటీఈ గుర్తింపు పొందిన కాలేజీల్లో కృత్రిమ మేధ, క్వాంటం కంప్యూటింగ్, అంతరిక్ష టెక్నాలజీ తదితర అత్యాధునిక రంగాల్లోని ప్రాజెక్టులకు నిధులు కేటాయిస్తారు. ఒక్కో ప్రాజెక్టుకు గరిష్ఠంగా రూ.50 లక్షల వరకు ఉండే అవకాశం ఉంది. ప్రతిపాదనలను ఆన్‌లైన్‌ పోర్టల్‌ ద్వారా జులై 31, 2025వ తేదీ వరకు పంపవచ్చు.

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.