ICET Notification: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంబీఏ, ఎంసీఏ కోర్సులలో ప్రవేశానికి నిర్వహించే తెలంగాణ ఐసెట్‌నోటిఫికేషన్‌ను కంట్రోలర్ మహేందర్‌రెడ్డి విడుదల చేశారు. ఈ నెల 7 నుంచి జూన్ 15 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తారు. రూ. 250 అపరాధ రుసుముతో జూన్ 30 వరకు, రూ. 500 అపరాధ రుసుముతో జులై 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
అయితే పరీక్షను ఆగస్టు 19, 20 తేదీల్లో నిర్వహించనున్నారు. సెప్టెంబరు 17న ఫలితాలు విడుదల చేయనున్నట్లు మహేందర్‌రెడ్డి వెల్లడించారు. ఆగస్టు 13 నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకునే వెసులుబాటు కల్పించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 14 రీజినల్ సెంటర్లలో పరీక్ష నిర్వహించనున్నారు. ఐసెట్ నిర్వహణ కోసం ఇప్పటికే 60 కేంద్రాలను గుర్తించినట్లు మహేందర్‌రెడ్డి వెల్లడించారు.
కాగా, ఇటీవల ఐసెల్ 2021 షెడ్యూల్‌ను విడుదల చేసిన రాష్ట్ర ఉన్నత విద్యామండలి.. 2021-22 విద్యా సంవత్సరానికి గానూ ఎంసీఏ, ఎంబీఏ సీట్ల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్‌ను శనివారం విడుదల చేసింది.
Golden Residency: యూఏఈ ఆరు నెలల వీసాకు శ్రీకారం… ఈ వీసా పొందేందుకు ఎవరెవరు అర్హులంటే..!