తెలంగాణ పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల-2023 మంగళవారం విడుదలైంది. తాజా షెడ్యూల్ ప్రకారం.. సప్లిమెంటరీ పరీక్షలు జూన్ 14 నుంచి 22 వరకు జరగనున్నాయి. ఆయా పరీక్ష తేదీలో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. అంటే ప్రతి రోజూ 3 గంటల 30 నిముషాల వ్యవధిలో పరీక్షలు రాయవల్సి ఉంటుంది. టెన్త్ అకడమిక్ ప్రోగ్రాం (SSC), ఓరియంటల్ సెకండరీ స్కూల్ సర్టిఫికేట్ (OSSC) కోర్సులోని అన్ని సబ్జెక్టులకు ఆబ్జెక్టివ్ పేపర్ (పార్ట్ B) చివరి అరగంటలో మాత్రమే సమాధానం రాయవల్సి ఉంటుంది. ఇది రెండు విద్యా కోర్సులకు వర్తిస్తుందని తన ప్రకటనలో తెల్పింది. పదో తరగతి అడ్వాన్స్ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్- జూన్ 2023 ప్రభుత్వ సెలవులు లేదా సాధారణ సెలవులు ప్రకటించినప్పటికీ టైమ్ టేబుల్ ప్రకారం ఆయా తేదీల్లో ఖచ్చితంగా నిర్వహించాలని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెట్ పాఠశాలలకు స్పష్టం చేసింది. పదో తరగతి పరీక్షల్లో తప్పినవారు ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని తెలంగాణ సెకండరీ ఎగ్జామినేషన్ బోర్డు తెల్పింది. పరీక్షకు హాజరవగోరే విద్యార్ధులు ఆయా సబ్జెక్టులకు ఫీజు చెల్లించాలని సూచించింది.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.