TS SSC Results 2025: పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల ఫలితాలు విడుదల.. రిజల్ట్స్‌ ఇక్కడ చెక్ చేసుకోండి!

Telangana 10th Class Results 2025 Highlights: రాష్ట్ర వ్యాప్తంగా 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలు బుధవారం (ఏప్రిల్ 30) మధ్యాహ్నం 2.30 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విడుదల చేశారు. విద్యార్ధులు ఈ కింది డైరెక్ట్ లింక్ ద్వారా ఫలితాలు చెక్ చేసుకోండి..

TS SSC Results 2025: పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల ఫలితాలు విడుదల.. రిజల్ట్స్‌ ఇక్కడ చెక్ చేసుకోండి!
Telangana 10th Class Results

Edited By: TV9 Telugu

Updated on: Apr 30, 2025 | 6:50 PM

హైదరాబాద్, ఏప్రిల్ 30: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 5 లక్షల మంది విద్యార్ధులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల ఫలితాలు బుధవారం (ఏప్రిల్ 30)వ తేదీన విడుదయ్యాయి. ఈ రోజు మధ్యాహ్నం 2.30 గంటలకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి చేతుల మీదగా ఫలితాలను వెల్లడించారు. ఈ మేరకు ఫలితాలను విద్యార్ధులకు అందుబాటులోకి తీసుకువచ్చారు. కాగా రాష్ట్ర వ్యాప్తంగా మార్చి 21వ తేదీ నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షల ఫలితాల కోసం దాదాపు నెల రోజులుగా విద్యార్ధులు ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు ఈ రోజు ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఫలితాలను విద్యార్ధులు తమ హాల్‌ టికెట్‌ నంబర్, పుట్టిన తేదీ వివరాలను టీవీ9 తెలుగు వెబ్‌సైట్‌లో నమోదు చేసి ఫలితాలను చెక్‌ చేసుకోవచ్చు. అలాగే ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్‌ bse.telangana.gov.in లేదా results.bse.telangana.gov.in లలో కూడా ఫలితాలు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు

తెలంగాణ పదో తరగతి ఫలితాల ప్రత్యక్ష ప్రసారం ఇక్కడ వీక్షించండి.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 30 Apr 2025 03:46 PM (IST)

    పదో తరగతి విద్యార్ధులకు విజ్ఞప్తి.. ఫెయిలైతే ఎవరూ ప్రాణాలు తీసుకోవద్దు..! బతకడానికి చాలా దారులున్నాయ్..

    2024-25 విద్యా సంవత్సరానికి పదో తరగతి పరీక్షల ఫలితాలు ఈ రోజు వచ్చాయి. పరీక్షల్లో అందరికీ ఆశించిన మార్కులు రాకపోవచ్చు. కానీ ఎవరూ నిరాశపడొద్దు. తక్కువ మార్కులు వచ్చినా.. ఒకటి లేదా రెండు సబ్జెక్టుల్లో ఫెయిలైనా అస్సలు నిరాశ పడొద్దు. హాయిగా సప్లిమెంటరీ పరీక్షలు రాయండి. ఆ వివరాలు ఈ కింద ఇచ్చాం. పరీక్షల్లో ఫెయిలైయ్యామని, అందరూ ఎగతాళి చేస్తున్నారని ఎవరూ ప్రాణాలు తీసుకోవద్దు. పరీక్షలు కేవలం జీవితంలో ఒక భాగం మాత్రమే. అందులో ఫెయిలైనంత మాత్రాన ఎందుకూ పనికిరారని నిర్ణయించుకోవద్దు.

    మళ్లీ ప్రయత్నించి సప్లిమెంటరీ పరీక్షలు రాయండి. తప్పక పాస్ అవుతారు. అసలు చదువే ఇష్టం లేకపోతే నచ్చిన పనిచేసి జీవితంలో ఎదిగి చూపించండి. అంతేగానీ తొందరపడి నిండు ప్రాణాలు తీసుకుంటే.. మిమ్మల్ని కళ్లల్లో పెట్టి చూసుకుంటున్న మీ కన్నోళ్లు కన్నీరుమున్నీరవుతారు. దయచేసి ఎవరూ తొందరపడి దారుణ నిర్ణయాలు తీసుకుని ప్రాణాలు తీసుకోవద్దు.

  • 30 Apr 2025 02:49 PM (IST)

    పదో తరగతి ఫలితాల్లో టాప్‌లో 3లో నిలిచిన మూడు జిల్లాలు ఇవే..

    తెలంగాణ పదో తరగతి ఫలితాల్లో మొదటి స్థానం లో 99.29 % మహబూబాబాద్ జిల్లా, రెండో స్థానం సంగారెడ్డి జిల్లా 99.09, చివరి స్థానంలో వికారాబాద్ జిల్లా 73.97% నిలిచాయి.


  • 30 Apr 2025 02:47 PM (IST)

    మే 15 వరకు రీ వెరిఫికేషన్ కు అప్లై చేసుకునే ఛాన్స్

    పదో తరగతి రీకౌంటింగ్‌, రీవెరిఫికేషన్‌కు విద్యాశాఖ అవకాశం ఇచ్చింది. ఒక్కో సబ్జెక్టుకు రూ.500/- చొప్పున చెల్లించి నేటి నుంచి 15 రోజుల్లోపు అంటే మే 15వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు.

  • 30 Apr 2025 02:45 PM (IST)

    తెలంగాణ పదో తరగతి పరీక్షల ఫలితాలు ఇక్కడ చెక్ చేసుకోండి

    తెలంగాణ పదో తరగతి పరీక్షల ఫలితాలు

  • 30 Apr 2025 02:42 PM (IST)

    జూన్‌ 3 నుంచి పదో తరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు

    తెలంగాణ పదో తరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు జూన్‌ 3 నుంచి ప్రారంభంకానున్నాయి. జూన్‌ 3 నుంచి 13 వరకు ఉదయం 9-30 గంటల నుంచి మధ్యాహ్నం 12-30 గుంటల వరకు జరగనున్నాయి.

  • 30 Apr 2025 02:41 PM (IST)

    వికారాబాదు జిల్లాలో అత్యల్ఫ ఉత్తీర్ణత.. ఎంతంటే?

    వికారాబాదు జిల్లా అన్ని జిల్లాల కంటే అతి తక్కువ శాతం 73.97%తో ఉత్తీర్ణతలో చివరి స్థానంలో నిలిచింది.

  • 30 Apr 2025 02:40 PM (IST)

    టెన్త్ ఫలితాల్లో మహబూబాబాద్‌ జిల్లా టాప్

    మహబూబాబాద్‌ జిల్లా 99.29 % ఉత్తీర్ణతతో రాష్ట్రంలోనే తొలి స్థానంలో నిలిచింది.

  • 30 Apr 2025 02:39 PM (IST)

    4,629 పాఠశాలలు 100 శాతం ఉత్తీర్ణత.. 2 పాఠశాలల్లో సున్నా ఉత్తీర్ణత

    4,629 పాఠశాలలు 100 శాతం ఉత్తీర్ణత సాధించగా.. కేవలం 2 పాఠశాలల్లో సున్నా ఉత్తీర్ణత శాతం నమోదైంది.

  • 30 Apr 2025 02:37 PM (IST)

    టెన్త్ ఫలితాల్లో బాలికల 94.26 % ఉత్తీర్ణత

    ఫలితాల్లో బాలురు 91.32 %, బాలికల 94.26 % ఉత్తీర్ణత సాధించారు. 2.94 శాతం అత్యధికంగా బాలికలు ఉత్తీర్ణత నమోదు చేశారు.

  • 30 Apr 2025 02:36 PM (IST)

    టెన్త్ ఫలితాల్లో రెగ్యులర్ విద్యార్ధులు 92.78 శాతం ఉత్తీర్ణత

    మార్చి 2025 పరీక్షలకు మొత్తం 5,07,107 ముంది హాజరయ్యారు. వీరిలో 4,96,374 మంది రెగ్యులర్, 10,733 మంది ప్రైవేట్ విద్యార్ధులు హాజరయ్యారు. వీరిలో రెగ్యులర్ 92.78 %  పాసైనారు.

  • 30 Apr 2025 02:31 PM (IST)

    ప్రైవేట్ కంటే ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూల్స్ లో అత్యధిక ఉత్తీర్ణత

    ప్రైవేట్ కంటే ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూల్స్ లో అత్యధిక ఉత్తీర్ణత శాతం నమోదు అయింది. దీనిపట్లు సీఎం రేవంత్ హర్షం వ్యక్తం చేశారు.

  • 30 Apr 2025 02:30 PM (IST)

    రెసిడెన్షియల్ స్కూల్స్ లో ఏకంగా 98.7% ఉత్తీర్ణత

    తెలంగాణ రెసిడెన్షియల్ స్కూల్స్ లో ఏకంగా 98.7% ఉత్తీర్ణత నమోదైంది. గతంలో ఎన్నడూలేని విధంగా అత్యధిక ఉత్తీర్ణత శాతం నమోదైంది.

  • 30 Apr 2025 02:30 PM (IST)

    పదో తరగతి ఫలితాల్లో 98.2 శాతం ఉత్తీర్ణత

    పదో తరగతి ఫలితాల్లో 98.2 శాతం ఉత్తీర్ణత నమోదైంది.

  • 30 Apr 2025 02:29 PM (IST)

    పదో తరగతి ఫలితాల్లో బాలికల హవా..

    తెలంగాణ పదో తరగతి ఫలితాలు సీఎం రేవంత్ ఈ రోజు మధ్యాహ్నం విడుదల చేశారు. తాజా ఫలతాల్లో బాలిలకు అన్ని జిల్లాల్లో టాప్ ర్యాంకులు సాధించారు.

  • 30 Apr 2025 02:24 PM (IST)

    పదో తరగతి ఫలితాలు విడుదల.. రిజల్ట్స్ ఇక్కడ చెక్ చేసుకోండి

    పదో తరగతి ఫలితాలు ఎట్టకేలకు వచ్చేశాయ్. టీవీ9 తెలుగు వెబ్ సైట్ లో ఫలితాలు చెక్ చేసుకోండి.

  • 30 Apr 2025 02:19 PM (IST)

    రవీంద్ర భారతి చేరుకున్న సీఎం రేవంత్.. ప్రారంభమైన కార్యక్రమం

    సీఎం రేవంత్ రెడ్డి ఎట్టకేలకు రవీంద్ర భారతి వేదికకు చేరుకున్నారు. పదో తరగతి ఫలితాల వెల్లడి కార్యక్రమం ప్రారంభమైంది.

  • 30 Apr 2025 02:17 PM (IST)

    మరికాసేపట్లో తెలంగాణ పదో తరగతి ఫలితాలు విడుదల

    నేరుగా రవీంద్రభారతిలో ఫలితాలు విడుదలకు బయల్దేరిన సీఎం రేవంత్ రెడ్డి.. కాసేపట్లో ఫలితాలు వెల్లడికానున్నాయి.

  • 30 Apr 2025 02:16 PM (IST)

    అలర్ట్.. మధ్యాహ్నం 2.30 గంటలకు పదో తరగతి ఫలితాలు

    సీఎం రేవంత్‌ రెడ్డి విజయవాడ నుంచి హైదరాబాద్ కు బయల్దేరారు. ఈ రోజు మధ్యాహ్నం 2.30 గంటలకు ఆయన రవీంద్ర భారతి వేదికగా పదో తరగతి ఫలితాలు వెల్లడించనున్నారు.

  • 30 Apr 2025 02:09 PM (IST)

    మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కుమారుడి వివాహ వేడుకకు హాజరైన సీఎం రేవంత్‌..

    విజయవాడలో మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వరరావు కుమారుడి వివాహ వేడుకకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా హాజరయ్యారు. రేవంత్ రెడ్డి రాకను పురస్కరించుకుని మంత్రి లోకేష్, ఇతర టీడీపీ ప్రజాప్రతినిధులు పుష్పగుచ్ఛం అందించి ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి మంత్రి నారా లోకేష్ నూతన వధూవరులు నిహార్, శ్రీ సాయి నర్మదలను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు.

  • 30 Apr 2025 02:06 PM (IST)

    ఉత్కంఠగా ఎదురు చూస్తున్న.. విద్యార్ధులు, వారి తల్లిదండ్రులు!

    ఈ రోజు మధ్యాహ్నం 2.15 గంటలకు ఫలితాలను వెల్లడిస్తామని విద్యాశాఖ చెప్పడంతో విద్యార్ధులు, వారి తల్లిదండ్రులు ఫోన్లు, ల్యాప్ టాప్ ల ఎదుట ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. కానీ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ఇంకా అందుబాటులో లేరు.

  • 30 Apr 2025 02:04 PM (IST)

    పదో తరగతి ఫలితాలు మరింత ఆలస్యం..?

    తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ఉత్కంఠగా పదో తరగతి ఫలతాల కోసం ఎదురు చూస్తున్న విద్యార్ధులకు నిరీక్షణ తప్పేలా లేదు. ఇప్పటికే రెండు సార్లు రీషెడ్యూల్ అయిన ఫలితాల వెల్లడి సమయం.. మరోమారు రీషెడ్యూల్ అయింది. ఇంకా సీఎం రేవంత్ విజయవాడ నుంచి హైదరాబాద్ కు చేరుకోలేదు.

  • 30 Apr 2025 01:59 PM (IST)

    పదో తరగతి ఫలితాల ప్రత్యక్ష ప్రసారం ఇక్కడ వీక్షించండి..

  • 30 Apr 2025 01:51 PM (IST)

    పదో తరగతి ఫలితాల డైరెక్ట్ లింక్ ఇదే

    పదో తరగతి ఫలితాలను టీవీ9 తెలుగు వెబ్‌సైట్‌లో నేరుగా చెక్‌ చేసుకోవచ్చు. అలాగే ఈ కింది ప్రభుత్వ వెబ్ సైట్ లలోనూ చెక్ చేసుకోవచ్చు.

    www.results.bsetelangana.org

    లేదా

    results.bse.telangana.gov.in

  • 30 Apr 2025 01:48 PM (IST)

    పదో తరగతిలో ఎన్ని మార్కులొస్తే.. ఏయే గ్రేడ్లు ఇస్తారో తెలుసా..

    పదో తరగతిలో 35-40 మార్కులొస్తే డి గ్రేడ్

    41-50 మార్కులొస్తే సీ2 గ్రేడ్

    51-60 మార్కులొస్తే సీ1 గ్రేడ్

    61-70 మార్కులొస్తే బీ2 గ్రేడ్

    71-80 మార్కులొస్తే బీ1 గ్రేడ్

    81-90 మార్కులొస్తే ఏ2 గ్రేడ్

    91-100 మార్కులొస్తే ఏ1 గ్రేడ్

  • 30 Apr 2025 01:44 PM (IST)

    పదో తరగతిలో అన్ని సబ్జెక్టుల్లో 28 మార్కులొస్తే పాస్..

    రాత పరీక్షలను 80 మార్కులకు నిర్వహించినందుకు వల్ల హిందీ మినహా అన్ని సబ్జెక్టుల్లో 28 మార్కులొస్తే పాసైనట్లు పరిగణిస్తారు. ఇంటర్నల్‌ మార్కులతో కలిపితే ఒక్కో సబ్జెక్టులో పాస్‌ మార్కులు 35.

  • 30 Apr 2025 01:43 PM (IST)

    హిందీలో 16 మార్కులొస్తే చాలు.. పాసైనట్లే!

    రాత పరీక్షకు సంబంధించి హిందీలో 16 మార్కులొస్తే పాసైనట్లే. ఇంటర్నల్‌ మార్కులతో కలిపితే  హిందీలో 20 మార్కులు తప్పనిసరిగా రావాలి. అప్పుడే పాసైనట్లు పరిగణిస్తారు.

  • 30 Apr 2025 01:35 PM (IST)

    ఈ రోజు మధ్యాహ్నం 2.15 గంటలకు పదో తరగతి ఫలితాలు

    పదో తరగతి పలితాలను హైదరాబాద్ లోని రవీంద్ర భారతి ఆడిటోరియంలో బుధవారం (ఏప్రిల్ 30) మధ్యాహ్నం 2.15 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి విడుదుల చేస్తారు.

  • 30 Apr 2025 01:34 PM (IST)

    టెన్త్‌లో గ్రేడ్‌ సిస్టమ్‌ను ఎందుకు తొలగించారంటే..

    గతేడాది వరకు టెన్త్‌ మెమోలను గ్రేడ్ల విధానంలోనే జారీ చేశారు. అయితే పలు ఎంట్రన్స్‌ టెస్ట్‌ల వెయిటేజికి ఇబ్బంది కలుతున్నందున విద్యాశాఖ ఈ ఏడాది నుంచి మళ్లీ మార్కుల పద్ధతిని తీసుకువచ్చినట్లు విద్యాశాఖ వెల్లడించింది. నిజానికి పదో తరగతిలో మార్కుల వల్ల విద్యార్ధులు మనస్తాపానికి గురై ఆత్మహత్యతకు పాల్పడుతన్నారని అప్పటి ప్రభుత్వం గ్రేడ్‌ విధానాన్ని తీసుకువచ్చింది.

  • 30 Apr 2025 01:31 PM (IST)

    టెన్త్ ఫలితాల కోసం 5,09,403 మంది విద్యార్ధుల నిరీక్షణ

    2024-25 విద్యా సంవత్సరానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 5,09,403 మంది విద్యార్ధులు హాజరయ్యారు. మొత్తం 2,650 కేంద్రాల్లో ఈ పరీక్షలు నిర్వహించారు. వీళ్లంగా ఫలితాల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. పదో తరగతి ఈ రోజు మధ్యాహ్నం 2.30 గంటలకు విడుదలకానున్నాయి.

  • 30 Apr 2025 01:28 PM (IST)

    తెలంగాణ పదో తరగతి ఫలితాల డైరెక్ట్ లింక్ ఇదే

    తెలంగాణ పదో తరగతి ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • 30 Apr 2025 01:26 PM (IST)

    పదో తరగతి మోమోలపై కో కరిక్యులర్‌ యాక్టివిటీస్‌కు గ్రేడ్లు

    ఈ రోజు విడుదలయ్యే ఫలితాల్లో బోధనేతర కార్యక్రమాల అంటే కో కరిక్యులర్‌ యాక్టివిటీస్‌లోనూ విద్యార్థులకు గ్రేడ్లు ఇస్తారు. వాల్యూ ఎడ్యుకేషన్‌ అండ్‌ లైఫ్‌ ఎడ్యుకేషన్, ఆర్ట్‌ అండ్‌ కల్చరల్‌ ఎడ్యుకేషన్, వర్క్‌ అండ్‌ కంప్యూటర్‌ ఎడ్యుకేషన్, ఫిజికల్‌ అండ్‌ హెల్త్‌ ఎడ్యుకేషన్‌ అనే నాలుగు కో కరిక్యులర్‌ యాక్టివిటీస్‌కు సంబంధించి గ్రేడ్లను మార్కుల మెమోలపై ముద్రిస్తారు.

  • 30 Apr 2025 01:25 PM (IST)

    వచ్చే ఏడాది నుంచి పదో తరగతిలో.. నో ఇంటర్నల్ మార్కులు!

    తెలంగాణలో ఈ ఏడాదితో పదో తరగతిలో ఇంటర్నల్ మార్కుల విధానానికి స్వస్తిపలుకు తున్నట్లు విద్యాశాఖ వెల్లడించింది. దీంతో 2025-26 విద్యా సంవత్సరం నుంచి పదో తరగతి విద్యార్ధులకు 6 సబ్జెక్టులకు 100 మార్కుల చొప్పున రాత పరీక్షలు నిర్వహిస్తారు.

  • 30 Apr 2025 01:21 PM (IST)

    పదో తరగతి విద్యార్ధుల మెమోలు ఎలా ఉంటాయంటే..

    గత ఏడాది వరకు పదో తరగతిలో సబ్జెక్టుల వారీగా గ్రేడ్లతో పాటు సీజీపీఏ మాత్రమే ఇచ్చేవారు. కానీ ఈ ఏడాది నుంచి సబ్జెక్టుల వారీగా మార్కులు, గ్రేడ్‌లు ఇవ్వనున్నారు. మార్కుల మెమోలపైనా సబ్జెక్టుల వారీగా రాత పరీక్షలు, ఇంటర్నల్ మార్కులు, మొత్తం మార్కులు, గ్రేడ్‌ పొందుపరుస్తారు. చివరకు విద్యార్థి పాస్, ఫెయిల్‌ వివరాలు వెల్లడిస్తారు.

  • 30 Apr 2025 01:19 PM (IST)

    పదో తరగతి ఫలితాలు అందుకే ఆలస్యం.. నేటితో ఉత్కంఠకు తెర

    ఏప్రిల్ 15వ తేదీ నాటికే పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకనం పూర్తి అయినా.. మార్కుల మెమోలను ఎలా ఇవ్వాలన్న అంశంపై క్లారిటీ రాకపోవడంతో ఇన్నాళ్లు జాప్యం నెలకొంది. తాజాగా దీనినపై పూర్తిస్థాయిలో క్లారిటీ రావడంతో అధికారులు ఫలితాల విడుదలకు రంగం సిద్ధం చేశారు.

  • 30 Apr 2025 01:17 PM (IST)

    ఈసారి సబ్జెక్టుల వారీగా మార్కులతోనే టెన్త్ మెమోలు.. నో సీజీపీఏ..!

    మార్చి 21 నుంచి ఏప్రిల్‌ 4 వరకు జరిగిన పదో తరగతి వార్షిక పరీక్షలకు దాదాపు 5లక్షల మంది హాజరయ్యారు. ఈ సారి గ్రేడింగ్‌తోపాటు మార్కులు ఇవ్వనున్నారు. అలాగే పాస్, ఫెయిల్‌ కూడా మార్కుల మెమోలపై ముద్రిస్తారు.

  • 30 Apr 2025 01:13 PM (IST)

    మరికొన్ని నిమిషాల్లోనే టెన్త్ ఫలితలు

    తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు రాసిన దాదాపు 5 లక్షల మంది విద్యార్ధుల ఫలితాలు బుధవారం మధ్యాహ్నం 2.30 గంటలకు సీఎం రేవంత్ విడుదల చేయనున్నారు.