TG SSC 10th Results 2026: పదో తరగతి ఫలితాల్లో గరిష్ఠ ఉత్తీర్ణత.. టాప్‌ లేపిన ములుగు జిల్లా

పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల ఫలితాలు బుధవారం (ఏప్రిల్ 29) మధ్యాహ్నం 2 గంటలకు ప్రభుత్వ సలహాదారు కె. కేశవరావు హైదరాబాద్‌ ఎల్బీ స్టేడియం ఎందురుగా ఉన్న రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎస్‌సీఈఆర్‌టీ) ప్రాంగణంలోని గోదావరి ఆడిటోరియంలో విడుదల చేశారు. విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణా, పాఠశాల విద్యాశాఖ..

TG SSC 10th Results 2026: పదో తరగతి ఫలితాల్లో గరిష్ఠ ఉత్తీర్ణత.. టాప్‌ లేపిన ములుగు జిల్లా
TS SSC 10th Class Results

Updated on: Apr 29, 2026 | 3:07 PM

హైదరాబాద్‌, ఏప్రిల్ 29: తెలంగాణ పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల ఫలితాలు బుధవారం (ఏప్రిల్ 29) మధ్యాహ్నం 2 గంటలకు ప్రభుత్వ సలహాదారు కె. కేశవరావు హైదరాబాద్‌ ఎల్బీ స్టేడియం ఎందురుగా ఉన్న రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎస్‌సీఈఆర్‌టీ) ప్రాంగణంలోని గోదావరి ఆడిటోరియంలో విడుదల చేశారు. విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణా, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్‌లు కలిసి ఈ ఫలితాలను వెల్లడిస్తారు. ఈ రోజు విడుదల చేసిన ఫలితాల్లో మొత్తం 95.15 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 5,26,166 మంది విద్యార్థులు హాజరుకాగా.. ఇందులో మొత్తం 4,91,774 మంది రెగ్యులర్‌ విద్యార్ధులు, 5,538 ఫెయిలైన విద్యార్ధులు ఉత్తీర్ణత సాధించారు. అందులో బాలికలు 96.26 శాతం, బాలురు 94,07 శాతం ఉత్తీర్ణత సాధించారు. 5,538 మంది విద్యార్ధులు ఫెయిల్‌ అయ్యారు.

తెలంగాణ టెన్త్‌ 2026 ఫలితాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 5,731 పాఠశాలల్లో 100 శాతం ఉత్తీర్ణత సాధించారు. మొత్తం 6 స్కూళ్లలో సున్నా శాతం ఉత్తీర్ణత నమోదైంది. ములుగు జిల్లాలో అత్యధికంగా 99.30% ఉత్తీర్ణత, హైదరాబాద్ జిల్లాలో అత్యల్పంగా 89.23% ఉత్తీర్ణత నమోదైంది. కాగా ఈ ఏడాది మార్చి 14 నుంచి ఏప్రిల్ 13 వరకు పదో తరగతి పరీక్షలు జరిగాయి.

ఇవి కూడా చదవండి

గతేడాది పదో తరగతి ఫలితాల్లో మొత్తం 92.78 శాతం మేర ఉత్తీర్ణత నమోదైంది. ఇందులో అబ్బాయిలు 91.32 శాతం ఉండగా.. అమ్మాయిలు 94.78 శాతం మంది ఉన్నారు. ఈ ఏడాది గరిష్ఠంగా 95.15 శాతం మంది విద్యార్ధులు పాస్‌ అయ్యారు.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us