10th Class Public Exams 2026: రేపట్నుంచే పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు.. 5 నిమిషాలు ఆలస్యమైనా పరీక్ష రాయొచ్చు!

రాష్ట్రంలో పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు 2026 రేపట్నుంచి (మార్చి 14) ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ఇప్పటికే ప్రభుత్వ పరీక్షల విభాగం (DGE) అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. విద్యార్థులు పరీక్షా విధానంపై అవగాహన పెంచుకోవడానికి వీలుగా తాజాగా నమూనా OMR షీట్లు, జవాబు పత్రాల ఫార్మాట్‌ను బోర్డు అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. విద్యార్ధులు పరీక్షకు హాజరయ్యే ముందు వీటిని పరిశీలించడం..

10th Class Public Exams 2026: రేపట్నుంచే పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు.. 5 నిమిషాలు ఆలస్యమైనా పరీక్ష రాయొచ్చు!
Telangana SSC 10th class public Exams

Updated on: Mar 13, 2026 | 8:11 AM

హైదరాబాద్‌, మార్చి 13: తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు 2026 రేపట్నుంచి (మార్చి 14) ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ఇప్పటికే ప్రభుత్వ పరీక్షల విభాగం (DGE) అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. విద్యార్థులు పరీక్షా విధానంపై అవగాహన పెంచుకోవడానికి వీలుగా తాజాగా నమూనా OMR షీట్లు, జవాబు పత్రాల ఫార్మాట్‌ను బోర్డు అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. విద్యార్ధులు పరీక్షకు హాజరయ్యే ముందు వీటిని పరిశీలించడం ద్వారా సులువుగా పరీక్ష రాసేందుకు అవకాశం ఉంటుంది. OMR విధానం గత ఏడాది ప్రవేశపెట్టిన విధంగానే అంటే పాత పద్ధతిలోనే ఉంటుంది. విద్యార్ధులు జవాబు పత్రానికి OMR షీట్‌ను జత చేయాల్సి ఉంటుంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు ఆయా తేదీల్లో ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జరగనున్నాయి.

తెలంగాణ పదో తరగతి 2026 హాల్‌ టికెట్ల డౌన్‌లోడ్ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 5,28,239 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. మొత్తం 2,676 కేంద్రాల్లో పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేశారు. పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ ఆదేశాల మేరకు ప్రతి పరీక్ష కేంద్రంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. పరీక్ష ప్రారంభమైన సమయం నుంచి ముగిసే వరకు రికార్డు చేసిన సీసీ పుటేజీని ఆ పరీక్ష కేంద్రం చీఫ్‌ సూపరింటెండెంట్‌ చివరి రోజు సీల్డ్‌ కవర్‌లో భద్రపర్చి ఆయా జిల్లాలోని డీఈవోలకు సమర్పించాలి. అలాగే పరీక్షల పర్యవేక్షణకు ఫ్లయింగ్‌ స్కాడ్‌ బృందాలను కూడా ఏర్పాటు చేశారు. వీరితోపాటు అన్ని పరీక్ష కేంద్రాల్లో సిట్టింగ్‌ స్కాడ్‌లు కూడా ఉంటారు.

ఇవి కూడా చదవండి

విద్యార్ధులు పరీక్షలు జరిగే ఆయా తేదీల్లో పరీక్షా సమయం కంటే ఒక గంట ముందుగానే కేంద్రాలకు చేరుకోవల్సి ఉంటుంది. అంటే ఉదమం 8.30 గంటలకు చేరుకోవాలి. ఇంటర్‌ పరీక్షల మాదిరి పదో తరగతి పరీక్షలకు 5 నిమిషాల గ్రేస్‌ టైం ఉంటుంది. ఉదయం 9.35 తర్వాత విద్యార్ధులకు పరీక్షా కేంద్రంలోకి అనుమతి ఉండదు. సెల్‌ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్‌ వస్తువులు పరీక్షా కేంద్రంలోకి అనుమతించరు. విద్యార్ధులతోపాటు పరీక్షా కేంద్రంలో ఉన్న సీఎస్‌, డీవో, ఇతర ఇబ్బంది ఎవరికీ సెల్‌ఫోన్‌న్లు పరీక్షా కేంద్రంలోకి తీసుకెళ్లే అనుమతి లేదు. విద్యార్థులు కేవలం పరీక్ష ప్యాడ్‌, హాల్‌టికెట్‌, పెన్ను, పెన్సిల్‌ మాత్రమే తీసుకెళ్లాలి. పరీక్షలను పటిష్టంగా నిర్వహించేందుకు ఫ్లయింగ్‌ స్కాడ్‌ బృందాలతోపాటు ఉన్నతాధికారులు ఆకస్మిక తనిఖీ చేస్తారు.

తెలంగాణ పదో తరగతి 2026 హాల్‌ టికెట్ల డౌన్‌లోడ్ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

పరీక్షల సిబ్బంది అందరూ తప్పనిసరిగా ఐడీ కార్డు ధరించాలి. అన్ని కేంద్రాల వద్ద 163 బీఎన్‌ఎస్‌ఎస్‌ సెక్షన్‌ అమల్లో ఉంటుంది. పరీక్షల నిర్వహణ, ఇతర అంశాలపై ఫిర్యాదు చేసేందుకు 24 గంటలు అందుబాటులో ఉండేలా డీఈవో కార్యాలయాల్లో హెల్ప్‌ డెస్క్‌ ఏర్పాటు చేశారు. విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా పరీక్షలు ప్రశాంతంగా పరీక్షలు రాయాలని అధికారులు సూచించారు. మరో వైపు విద్యార్థులు తమ హాల్‌టికెట్లను www.bse.telangana.gov.inలో డౌన్‌లోడ్‌ చేసుకుని ప్రిన్సిపల్ సంతకం లేనప్పటికీ పరీక్షలకు నేరుగా హాజరయ్యే అవకాశం కల్పించారు.

తెలంగాణ పదో తరగతి 2026 హాల్‌ టికెట్ల డౌన్‌లోడ్ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us