
హైదరాబాద్, మే 2: తెలంగాణ రాష్ట్ర పదో తరగతి ఫలితాలు ఏప్రిల్ 30వ తేదీన విడుదలైన సంగతి తెలిసిందే. ఇందులో ఫెయిలైన విద్యార్ధులతోపాటు మార్కులు తక్కువ వచ్చిన వారికి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించేందుకు షెడ్యూల్‌ను ప్రభుత్వ పరీక్షల విభాగం తాజాగా విడుదల చేసింది. తాజా షెడ్యూల్ ప్రకారం జూన్ 3వ తేదీ నుంచి సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభమవుతాయి. ఈ పరీక్షలు జూన్ 3వ తేదీ నుంచి జూన్ 13వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ఆయా తేదీల్లో ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు.
ఇక సప్లిమెంటరీ పరీక్షలు రాసే విద్యార్ధులకు దరఖాస్తు ప్రక్రియ కూడా ఇప్పటికే ప్రారంభమైంది. విద్యార్ధులు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా మే 16వ తేదీ వరకు ఫీజు చెల్లించవచ్చు. పదో తరగతి పరీక్షలు ఫెయిలైన విద్యార్ధులంతా ఈ పరీక్షలు రాయవచ్చు. అలాగే ఒక్కో సబ్జెక్టుకు రీకౌంటింగ్‌కు రూ.500, రీ వెరిఫికేషన్‌కు రూ.1000 చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందుకు మే 15వ వరకు అవకాశం ఉంటుంది. రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్ ఫలితాల కోసం ఎదురుచూడకుండా విద్యార్ధులు సప్లిమెంటరీ పరీక్షలు రాయాలని బోర్డు సూచించింది. ఈ ఏడాది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 5,07,107 మంది విద్యార్ధులు పదో తరగతి పరీక్షలు రాయగా.. అందులో 4,60,519 మంది (92.78 శాతం) పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.