AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TG 10th Class Results 2026: తెలంగాణ పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల 2026 మూల్యాంకనం పూర్తి.. ఫలితాలు ఎప్పుడంటే?

TS 10th class 2026 Result time and date: రాష్ట్రంలో పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు ఏప్రిల్ 16తో ముగిసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే సమాధాన పత్రాల మూల్యాంకనం కూడా ముగిసింది. పేపర్ల స్కానింగ్ కూడా ముగిసిన వెంటనే మార్కుల క్రోడీకరణ (ట్యాబ్యులేషన్) చేపడతారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే పదో తరగతి ఫలితాలు మే మొదటి వారంలో వెల్లడించేందుకు విద్యాశాఖ ముమ్మరంగా ఏర్పాట్లు..

TG 10th Class Results 2026: తెలంగాణ పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల 2026 మూల్యాంకనం పూర్తి.. ఫలితాలు ఎప్పుడంటే?
TG 10th class Result date and Time
Srilakshmi C
|

Updated on: Apr 27, 2026 | 6:30 AM

Share

హైదరాబాద్‌, ఏప్రిల్ 27: తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు ఏప్రిల్ 16తో ముగిసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే సమాధాన పత్రాల మూల్యాంకనం కూడా ముగిసింది. పేపర్ల స్కానింగ్ కూడా ముగిసిన వెంటనే మార్కుల క్రోడీకరణ (ట్యాబ్యులేషన్) చేపడతారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే పదో తరగతి ఫలితాలు మే మొదటి వారంలో వెల్లడించేందుకు విద్యాశాఖ ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు విద్యాశాఖ అధికారులు మే మొదటి వారంలో ఫలితాలను ప్రకటించేందుకు వేగంగా కసరత్తు చేస్తున్నారు. ఎటువంటి అడ్డంకులు లేకుంటే మే 4 లేదా 5వ తేదీల్లో అధికారికంగా ఫలితాలు విడుదల చేయాలని విద్యాశాఖ భావిస్తుంది.

రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 5,28,239 మంది విద్యార్థులు ఈ పరీక్షలు రాశారు. ఏప్రిల్ 1వ తేదీ నుంచే జవాబు పత్రాల మూల్యాంకనం కూడా ప్రారంభమైంది. ఏప్రిల్‌ 25వ తేదీతో మూల్యాంకనం ప్రక్రియ ముగిసింది. మార్కుల క్రోడీకరణకు పది రోజుల సమయం పడుతుంది. ఈ ప్రక్రియను కూడా కాస్త వేగంగానే పూర్తి చేసి అనుకున్న దానికంటే ముందుగానే ప్రకటించాలని విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తుంది. ఫలితాలు విడుదలైన తర్వాత అధికారిక వెబ్ సైట్ తో పాటు టీవీ9 తెలుగు వెబ్ సైట్ లోనూ టెన్త్ రిజల్ట్స్ చెక్ చేసుకోవచ్చు.

ఫలితాలను ఎస్సెస్సీ బోర్డు ఈ విద్యాసంవత్సరం నుంచి అధికారిక వెబ్‌సైట్‌తోపాటు వాట్సాప్‌లోనూ తెలుసుకునే వెసులుబాటు కల్పిస్తుంది. ఇప్పటికే హాల్‌టికెట్లను సైతం వాట్సాప్‌ ద్వారా డౌన్‌లోడ్‌ చేసుకొనే వెసులుబాటు కల్పించిన బోర్డు ఫలితాలను సైతం వాట్సాప్‌ ద్వారా తెలుసుకొనే సదుపాయం కల్పించింది. వాట్సాప్‌ ద్వారా హాల్‌టికెట్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవాలంటే 80969 58096 నంబర్‌కు ‘Hi’ అని మెసేజ్‌ పంపించాలి. ఆ తర్వాత ఎస్సెస్సీ రిజల్ట్స్‌ అని టైప్‌చేసి హాల్‌టికెట్‌ నంబర్‌, ఇతర వివరాలు నమోదు చేయాలి. ఆ వెంటనే ఫలితాలు స్క్రీన్‌పై ప్రత్యక్షమవుతాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

Follow Us
సీలింగ్ ఫ్యాన్ గంటకు ఎంత కరెంట్ వాడుతుందో తెలుసా?
సీలింగ్ ఫ్యాన్ గంటకు ఎంత కరెంట్ వాడుతుందో తెలుసా?
బాడీ స్ప్రేతో సువాసనే కాదు.. మరొకటి కూడా మీ సొంతం
బాడీ స్ప్రేతో సువాసనే కాదు.. మరొకటి కూడా మీ సొంతం
అసాధ్యమైన లక్ష్యాన్ని సుసాధ్యం చేసిన షమీ.. కానీ ఫలితం మాత్రం?
అసాధ్యమైన లక్ష్యాన్ని సుసాధ్యం చేసిన షమీ.. కానీ ఫలితం మాత్రం?
కియారా స్టైలిష్ లుక్ వెనుక ఉన్న రహస్యం ఇదే..
కియారా స్టైలిష్ లుక్ వెనుక ఉన్న రహస్యం ఇదే..
మండే ఎండల్లో అకాల వర్షాలు.. ఏ జిల్లాలో వాతావరణం ఎలా ఉండబోతుందంటే?
మండే ఎండల్లో అకాల వర్షాలు.. ఏ జిల్లాలో వాతావరణం ఎలా ఉండబోతుందంటే?
మారనున్న ముంబై ఇండియన్స్ కెప్టెన్.. జాంనగర్ పర్యటనతో మారిన సీన్?
మారనున్న ముంబై ఇండియన్స్ కెప్టెన్.. జాంనగర్ పర్యటనతో మారిన సీన్?
ఈడొచ్చిన అమ్మాయిలు తినాల్సిన పచ్చి కొబ్బరి తురుము పచ్చడి
ఈడొచ్చిన అమ్మాయిలు తినాల్సిన పచ్చి కొబ్బరి తురుము పచ్చడి
తెలంగాణ పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల 2026 ఫలితాలు ఎప్పుడంటే?
తెలంగాణ పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల 2026 ఫలితాలు ఎప్పుడంటే?
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. బ్యాంకు ఉద్యోగాలకు ఉచిత కోచింగ్‌!
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. బ్యాంకు ఉద్యోగాలకు ఉచిత కోచింగ్‌!
అబ్బబ్బ.! ఏం కిక్కు ఉంది.. వీరు పట్టుకుందల్లా బంగారమే..
అబ్బబ్బ.! ఏం కిక్కు ఉంది.. వీరు పట్టుకుందల్లా బంగారమే..