TG 10th Public Exam 2025 Fees: టెన్త్‌ పబ్లిక్‌ పరీక్షల ఫీజు చెల్లింపుల షెడ్యూల్‌ వచ్చేసింది.. చివరి తేదీ ఇదే

|

Nov 10, 2024 | 12:06 PM

తెలంగాణలో 202-25 విద్యా సంవత్సరానికి పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్ధులు పరీక్షల ఫీజు చెల్లింపులకు సంబంధించిన షెడ్యూల్ విడుదలైంది. ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా గడువు తేదీలోగా ఫీజు చెల్లించాలని పాఠశాల విద్యాశాఖ విద్యార్ధులకు సూచించింది..

TG 10th Public Exam 2025 Fees: టెన్త్‌ పబ్లిక్‌ పరీక్షల ఫీజు చెల్లింపుల షెడ్యూల్‌ వచ్చేసింది.. చివరి తేదీ ఇదే
10th Public Exam Fee
Follow us on

హైదరాబాద్‌, నవంబర్‌ 10: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న పదో తరగతి విద్యార్ధులకు వచ్చే మార్చిలో జరిగే పబ్లిక్‌ పరీక్షలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించేందుకు షెడ్యూల్‌ విడుదలైంది. నవంబర్‌ 18వ తేదీలోగా ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా పరీక్షల ఫీజు చెల్లించాలని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ ఎ కృష్ణారావు తెలిపారు. ఈ మేరకు ప్రభుత్వ పరీక్షల విభాగం పరీక్షల ఫీజుకు సంబంధించిన షెడ్యూల్‌ను జారీ చేసింది. రూ.50 నుంచి రూ.500 ఆలస్య రుసుంతో డిసెంబరు 21వ తేదీ వరకు ఫీజు చెల్లించడానికి గడువు ఇచ్చింది. పరీక్షల ఫీజును రూ.125గా నిర్ణయించామన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన విద్యార్థులు పట్టణాల్లో కుటుంబ వార్షిక ఆదాయం రూ.24 వేలు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.20 వేల లోపు ఉన్నట్లయితే వారంతా ఆదాయ ధ్రువపత్రం సమర్పిస్తే పరీక్ష ఫీజు నుంచి మినహాయింపు ఉంటుందని పరీక్షల విభాగం డైరెక్టర్ ఎ కృష్ణారావు తెలిపారు. కాగా ఈ ఏడాది పదో తరగతి పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా 5.25 లక్షల మందికిపైగా విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నట్లు సమాచారం.

టీసీఎస్, ఎన్‌ఎస్‌డీసీ ఆధ్వర్యంలో జాతీయ నైపుణ్య పరీక్షలు

దేశంలోని నిరుద్యోగులు, విద్యార్థులు, వృత్తి నిపుణులకు ఉపాధి అవకాశాలు మెరుగుపరచేందుకు టీసీఎస్, ఎన్‌ఎస్‌డీసీ ముందుకొచ్చాయి. నిరుద్యోగుల్లో నైపుణ్య స్థాయిని గుర్తించి, మెరుగులు దిద్దేందుకు జాతీయ నైపుణ్య పరీక్ష (ఎన్‌పీటీ)ను తీసుకొచ్చేందుకు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌)తో నేషనల్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఎన్‌ఎస్‌డీసీ) ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో ప్రతి నెలా ఎన్‌పీటీ నిర్వహించి, పరిశ్రమ స్థాయి గుర్తింపునిచ్చే ధ్రువీకరణ పత్రాలు అందజేసేందుకు టీసీఎస్‌ అయాన్‌తో ఒప్పందం చేసుకున్నట్లు ఎన్‌ఎస్‌డీసీ సీఈఓ వేద్‌ మణి తివారీ ఓ ప్రకటనలో వెల్లడించారు.

నవంబరు 11న తెలంగాణ టాస్‌ పది, ఇంటర్‌ ఫలితాలు విడుదల

తెలంగాణ సార్వత్రిక విద్యాపీఠం(టాస్‌) ఆధ్వర్యంలో అక్టోబరులో నిర్వహించిన పది, ఇంటర్‌ పరీక్షల ఫలితాలు ఈ నెల 11వ తేదీ ఉదయం 11 గంటలకు విడుదలవనున్నాయి. ఈ మేరకు పరీక్షల సంచాలకుడు పీవీ శ్రీహరి తెలిపారు. ఫలితాలను టాస్‌ వెబ్‌సైట్‌లో ఉంచుతామని ఆయన పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.