TG PECET 2025 Exam Dates: టీజీ పీఈసెట్‌ 2025 పరీక్ష తేదీలివే.. అడ్మిట్ కార్డుల డౌన్‌లోడ్ లింక్‌ వచ్చేసింది

రాష్ట్ర ఫిజికల్ ఎడ్యుకేషన్‌ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ 2025 (టీజీ పీఈసెట్‌-2025) పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్స్‌ తాజాగా విడుదలయ్యాయి. ఈ మేరకు తెలంగాణ ఉన్నత విద్యా మండలి అధికారిక వెబ్‌సైట్లో అడ్మిట్ కార్డులను పొందుపరిచింది. ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్‌ నంబర్‌, పుట్టిన తేదీ వివరాలు..

TG PECET 2025 Exam Dates: టీజీ పీఈసెట్‌ 2025 పరీక్ష తేదీలివే.. అడ్మిట్ కార్డుల డౌన్‌లోడ్ లింక్‌ వచ్చేసింది
Telangana PECET 2025 Exam

Updated on: Jun 08, 2025 | 11:19 AM

హైదరాబాద్, జూన్‌ 8: తెలంగాణ ఫిజికల్ ఎడ్యుకేషన్‌ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ 2025 (టీజీ పీఈసెట్‌-2025) పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్స్‌ తాజాగా విడుదలయ్యాయి. ఈ మేరకు తెలంగాణ ఉన్నత విద్యా మండలి అధికారిక వెబ్‌సైట్లో అడ్మిట్ కార్డులను పొందుపరిచింది. ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్‌ నంబర్‌, పుట్టిన తేదీ వివరాలు ఎంటర్ చేసి అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా హాల్‌టికెట్స్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఇక పీఈసెట్‌ పరీక్షలు జూన్‌ 11 నుంచి 14 వరకు మహబూబ్‌నగర్‌ పాలమూరు యూనివర్సిటీలో అభ్యర్థులకు ఫిజికల్ ఎఫిషియెన్సి టెస్ట్‌, స్కిల్‌ టెస్ట్‌ నిర్వహించనున్నారు. ఇందులో వచ్చిన ర్యాంకు ద్వారా 2025-2026 విద్యా సంవత్సరానికి రెండేళ్ల బీపీఈడీ, డీపీఈడీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.

తెలంగాణ పీఈసెట్‌-2025 అడ్మిట్ కార్డుల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

తెలంగాణ ఎడ్‌సెట్ ఆన్సర్‌ కీ విడుదల.. రేపటి వరకు అభ్యంతరాలు స్వీకరణ

తెలంగాణ ఎడ్యుకేషన్‌ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్ 2025 (తెలంగాణ ఎడ్‌సెట్) ప్రాథమిక ఆన్సర్‌ కీని తెలంగాణ ఉన్నత విద్యా మండలి తాజాగా విడుదల చేసింది. ఎడ్‌సెట్ పరీక్షకు హాజరైన అభ్యర్థులు పరీక్షకు సంబంధించిన ప్రశ్న పత్రాలు, ఆన్సర్‌ కీతోపాటు రెస్పాన్స్‌షీట్లను అధికారిక వెబ్‌సైట్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఆన్సర్‌ కీపై అభ్యర్థులు జూన్‌ 9వ తేదీ వరకు అభ్యంతరాలు తెలపవచ్చు. కాగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీఈడీ కోర్సులో ప్రవేశాలకు జూన్‌ 1వ తేదీన ఆన్‌లైన్‌ విధానంలో ప్రవేశ పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి

తెలంగాణ ఎడ్‌సెట్ 2025 ఆన్సర్‌ కీ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.