TG Inter Admissions 2026: ఇంటర్‌ ప్రవేశాలకు దరఖాస్తు గడువు పొడిగింపు.. టెన్త్‌ మార్కుల ఆధారంగానే నేరుగా ఎంపిక

మహాత్మా జ్యోతిబా పూలే బీసీ గురుకుల సొసైటీ పరిధిలో ఉన్న జూనియర్ రెసిడెన్షియల్‌ కాలేజీల్లో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించింది ఇంటర్మీడియట్ ఫస్ట్‌ ఇయర్‌లో ప్రవేశాలకు దరఖాస్తు గడువును పొడిగించారు. తాజా ప్రకటన మేరకు ఈ గడువును మే 20వ తేదీ వరకు పొడిగించారు. ఈ మేరకు సొసైటీ కార్యదర్శి బడుగు సైదులు ఓ ప్రకటనలో..

TG Inter Admissions 2026: ఇంటర్‌ ప్రవేశాలకు దరఖాస్తు గడువు పొడిగింపు.. టెన్త్‌ మార్కుల ఆధారంగానే నేరుగా ఎంపిక
TG MJPTBC Inter First Year Admissions

Updated on: May 16, 2026 | 3:35 PM

హైదరాబాద్‌, మే 16: తెలంగాణలోని మహాత్మా జ్యోతిబా పూలే బీసీ గురుకుల సొసైటీ పరిధిలో ఉన్న జూనియర్ రెసిడెన్షియల్‌ కాలేజీల్లో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించింది ఇంటర్మీడియట్ ఫస్ట్‌ ఇయర్‌లో ప్రవేశాలకు దరఖాస్తు గడువును పొడిగించారు. తాజా ప్రకటన మేరకు ఈ గడువును మే 20వ తేదీ వరకు పొడిగించారు. ఈ మేరకు సొసైటీ కార్యదర్శి బడుగు సైదులు ఓ ప్రకటనలో వెల్లడించారు. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని సూచించారు. పదో తరగతి పూర్తి చేసిన విద్యార్థులు ఎవరైనా ఎంపీసీ , బైపీసీ, ఎంఈసీ, సీఈసీ తదితర గ్రూపుల్లో ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఎలాంటి ప్రవేశ పరీక్ష నిర్వహించకుండానే కేవలం పదో తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగా విద్యార్థుల ఎంపిక ప్రక్రియ ఉంటుంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు MJPTBCWREIS అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్ విధానంలో ముగింపు గడువులోగా ఇంటర్ అడ్మిషన్లకు దరఖాస్తు చేసుకోవచ్చు. సీట్లు పొందిన విద్యార్ధులకు ఉచిత విద్యతోపాటు అవాస, నివాస, భోజన సదుపాయాలు కల్పిస్తారు.

రాష్ట్ర వ్యాప్తంగా 146 కాలేజీలలో బాలురకు 12,640 సీట్లు, 144 కాలేజీలలో బాలికలకు 12,080 సీట్లు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. బీసీ గురుకులాల్లో 10వ తరగతి పూర్తి చేసిన విద్యార్థినీ, విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేకుండానే.. నేరుగా తమ స్కూల్ ప్రిన్సిపాల్‌కు దరఖాస్తు ఇస్తే సరిపోతుంది. మరిన్ని వివరాలకు 040-23328266 ఫోన్‌ నంబర్‌ ద్వారా సంప్రదించవచ్చని అధికారులు సూచించారు.

తెలంగాణ మహాత్మా జ్యోతిబా పూలే బీసీ గురుకులాల్లో ఇంటర్ ఫస్ట్‌ ఇయర్‌ 2026 ప్రవేశాలకు ఇక్కద దరఖాస్తు చేసుకోండి.

ఇవి కూడా చదవండి

ఏపీ ఐసెట్‌ 2026 ఫలితాలు విడుదల.. ర్యాంక్‌ కార్డు డౌన్‌లోడ్ లింక్‌ ఇదే

ఏపీ ఐసెట్‌ 2026 ఫలితాలు శనివారం (మే 16) విడుదలయ్యాయి. తాజా ఫలితాల్లో మొత్తం 91.41 మేర ఉత్తీర్ణత శాతం నమోదైంది. మొత్తం 23,198 విద్యార్థులు పరీక్షకు హాజరవగా.. ఇందులో 21,205 మంది అర్హత సాధించారు. కాకినాడ జిల్లాకు చెందిన వైష్ణవి 166.094 మార్కులతో స్టేట్‌ టాప్‌ ర్యాంక్‌ సాధించింది. విద్యార్ధులు తమ రిజిస్ట్రేషన్ నెంబర్ లేదా హాల్ టికెట్ నెంబర్‌ను ఎంటర్ చేసి ర్యాంకు కార్డులను ఈ కింది డైరెక్ట్‌ లింక్ ద్వారా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

ఏపీ ఐసెట్‌ 2026 ర్యాంకు కార్డు డౌన్‌లోడ్‌ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.

Follow Us