MHSRB Results: ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్‌ 2 ఫైనల్‌ ఎంపిక జాబితా ఇదే.. ఒక్క క్లిక్‌తో ఇక్కడ చెక్‌ చేసుకోండి

రాష్ట్ర ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో 1,284 ల్యాబ్​ టెక్నీషియన్​ గ్రేడ్​ 2 పోస్టుల భర్తీకి గతేడాది రాత పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షా ఫలితాలు తాజాగా విడుదలయ్యాయి. పోస్టులకు ఎంపికైన మొత్తం అభ్యర్థుల జాబితాను రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్‌ రాజనర్సింహా సచివాలయంలో..

MHSRB Results: ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్‌ 2 ఫైనల్‌ ఎంపిక జాబితా ఇదే.. ఒక్క క్లిక్‌తో ఇక్కడ చెక్‌ చేసుకోండి
MHSRB Lab Technician Results

Updated on: Nov 18, 2025 | 6:54 AM

హైదరాబాద్‌, నవంబర్‌ 18: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో 1,284 ల్యాబ్​ టెక్నీషియన్​ గ్రేడ్​ 2 పోస్టుల భర్తీకి గతేడాది రాత పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షా ఫలితాలు తాజాగా విడుదలయ్యాయి. పోస్టులకు ఎంపికైన మొత్తం అభ్యర్థుల జాబితాను రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్‌ రాజనర్సింహా సచివాలయంలో సోమవారం మధ్యాహ్నం విడుదల చేశారు. ఎంపికైన అభ్యర్థుల జాబితా, అలాగే ఫైనల్‌ మెరిట్‌ లిస్ట్‌లను మెడికల్‌ అండ్‌ హెల్త్‌ సర్వీసెస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు (TG MHSRB) తన అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది.

ఈ పోస్టులకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 24,045 మంది అభ్యర్ధులు దరఖాస్తు చేసుకోగా.. అందులో గతేడాది నవంబర్‌ 10న జరిగిన ఆన్‌లైన్‌ రాత పరీక్షకు 23,323 మంది హాజరయ్యారు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ అనంతరం మొత్తం 1260 మంది అభ్యర్ధులను అంతిమంగా బోర్డు ఎంపిక చేసింది. ఈ మేరకు తుది ఎంపిక జాబితాను వెబ్‌సైట్‌లో విడుదల చేసింది. దివ్యాంగుల కేటగిరీకి సంబంధించిన హైకోర్టులో కేసు కొనసాగుతుంది. దీంతో ఈ కేటగిరీలో ఉన్న నాలుగు పోస్టులను ఖాళీగా ఉంచింది. మరోవైపు స్పోర్ట్స్‌ కేటగిరీలో ఉన్న 18 పోస్టులను కూడా బోర్డు విడిగా చేయనుంది. ఎంపికైన అభ్యర్ధులను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బోధనాస్పత్రులు, జిల్లా, ఏరియా ఆస్పత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఎంఎన్‌జే క్యాన్సర్‌ ఆస్పత్రుల్లో భర్తీ చేయనున్నారు.

సీఐఎస్‌సీఈ 2026 పరీక్షల షెడ్యూల్‌ ఇదే

కౌన్సిల్‌ ఫర్‌ ఇండియన్‌ స్కూల్‌ సర్టిఫికెట్‌ ఎగ్జామినేషన్‌ (సీఐఎస్‌సీఈ) బోర్డు పరీక్షల టైం టేబుల్‌ వచ్చేసింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 12వ తేదీ నుంచి ఈ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 12 నుంచి ఏప్రిల్‌ 6 వరకూ 12వ తరగతి పరీక్షలు, ఫిబ్రవరి 17 నుంచి మార్చి 30 వరకూ 10వ తరగతి పరీక్షలు జరగనున్నాయి. ఈ ఏడాది దేశ వ్యాప్తంగా 2.6 లక్షల మంది విద్యార్థులు ఐసీఎస్‌ఈ 10వ తరగతి, 1.5 లక్షల మంది విద్యార్థులు ఐఎస్‌సీ 12వ తరగతి పరీక్షలకు హాజరవుతారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.