TG Law Cet 2024 Counseling: విద్యార్ధులకు అలర్ట్.. లాసెట్, ఎడ్‌సెట్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూళ్లలో స్వల్పమార్పు

|

Aug 22, 2024 | 8:48 AM

తెలంగాణ లాసెట్‌ 2024, ఎడ్‌సెట్‌ 2024 కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌లో మార్పులు చోటు చేసుకున్నాయి. లాసెట్‌ 2024 రిజిస్ట్రేషన్‌ గడువు ఆగస్టు 20తో ముగియగా.. దానిని 24వ తేదీ వరకు పొడిగించారు. కాకతీయ, తెలంగాణ వర్సిటీల పరిధిలోని లా కళాశాలలకు బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (బీసీఐ) నుంచి అనుమతి రాకపోవడంతో ఈ మార్పు చేసినట్లు లాసెట్‌ కన్వినర్‌ తెలిపారు. ఆగస్టు 24వ తేదీ నాటికి బీసీఐ అనుమతి వచ్చిన లా కాలేజీలకు..

TG Law Cet 2024 Counseling: విద్యార్ధులకు అలర్ట్.. లాసెట్, ఎడ్‌సెట్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూళ్లలో స్వల్పమార్పు
TG Law Cet 2024 Counseling
Follow us on

హైదరాబాద్‌, ఆగస్టు 22: తెలంగాణ లాసెట్‌ 2024, ఎడ్‌సెట్‌ 2024 కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌లో మార్పులు చోటు చేసుకున్నాయి. లాసెట్‌ 2024 రిజిస్ట్రేషన్‌ గడువు ఆగస్టు 20తో ముగియగా.. దానిని 24వ తేదీ వరకు పొడిగించారు. కాకతీయ, తెలంగాణ వర్సిటీల పరిధిలోని లా కళాశాలలకు బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (బీసీఐ) నుంచి అనుమతి రాకపోవడంతో ఈ మార్పు చేసినట్లు లాసెట్‌ కన్వినర్‌ తెలిపారు. ఆగస్టు 24వ తేదీ నాటికి బీసీఐ అనుమతి వచ్చిన లా కాలేజీలకు కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నట్లు తెలిపారు. మరోవైపు ఎడ్‌సెట్‌ రిజిస్ట్రేషన్‌ గడువును కూడా ఆగస్టు 23 వరకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశారు. సవరించిన పూర్తి షెడ్యూళ్లను సంబంధిత అధికారిక వెబ్‌సైట్లలో ఉంచినట్లు ప్రవేశాల కమిటీ కన్వీనర్‌ పి. రమేష్‌బాబు తెలిపారు.

ఆగస్టు 24న తెలంగాణ వ్యవసాయ డిప్లొమా కోర్సుల్లో మిగిలిన సీట్లకు వాక్‌ ఇన్‌ కౌన్సెలింగ్‌

తెలంగాణ అగ్రికల్చర్‌ యూనివర్సిటీ పరిధిలోని పాలిటెక్నిక్‌ కాలేజీల్లో 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి మిగిలిన డిప్లొమా సీట్ల భర్తీకి ఆగస్టు 24న రెండో దఫా ‘వాక్‌ ఇన్‌ కౌన్సెలింగ్‌’ నిర్వహిస్తున్నట్లు వర్సిటీ రిజిస్ట్రార్‌ రఘురామిరెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌లోని వాటర్‌ టెక్నాలజీ ఎగ్జామినేషన్స్‌ సెంటర్‌లో ఈ కౌన్సెలింగ్‌ నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. పాలిసెట్‌-2024లో ర్యాంకులు సాధించిన వారికి తొలి ప్రాధాన్యం ఉంటుందని, ఎస్‌ఎస్‌సీ ఉత్తీర్ణులైన వారికి రెండో ప్రాధాన్యం ఇస్తామని ఆయన తెలిపారు.

తెలంగాణ డీఎస్సీ 2024 పరీక్షపై 28 వేలకుపైగా అభ్యంతరాలు.. నెలాఖరుకు తుది ఆన్సర్‌ కీ

తెలంగాణ డీఎస్సీ 2024 ఆన్‌లైన్‌ పరీక్షలకు సంబంధించి ఇటీవల విడుదలైన ప్రాథమిక ఆన్సర్‌ కీలపై 28 వేలకుపైగా అభ్యంతరాలు వచ్చాయి. ఆగస్టు 13వ తేదీ నుంచి 20వ తేదీ వరకు అభ్యంతరాలను పాఠశాల విద్యాశాఖ ఆన్‌లైన్‌ ద్వారా స్వీకరించింది. పలు సబ్జెక్టుల్లో ప్రశ్నలపై పలువురు అభ్యంతరం తెలపడంతో వాటి సంఖ్య వేలల్లో చేరిందని విద్యాశాఖ వర్గాలు తెలిపాయి. ఆగస్టు నెలాఖరులో తుది కీ రూపొందించి, ఫలితాలు వెల్లడించేందుకు విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.