Teacher Job vacancies in TS KGBVs: తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 475 కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో (KGBV) 1000 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వచ్చే విద్యా సంవత్సరం(2022-23) కోసం ఈ పోస్టులను ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేయడానికి అధికారులు కసరత్తు చేస్తున్నారు. ప్రవేశ పరీక్ష ద్వారానా? లేక ఎక్కడికక్కడ జిల్లాల వారీగా ఇంటర్వ్యూలు జరిపి ఎంపిక చేయాలా? అనే దానిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉందని విద్యాశాఖ వర్గాలు తెలిపాయి.
కాగా రాష్ట్రానికి కొత్తగా 26 కేజీబీవీలను మంజూరు చేయాలని గత ఏడాది రాష్ట్ర విద్యాశాఖ కేంద్రానికి ప్రతిపాదించింది. బాలికా అక్షరాస్యత పరంగా వెనకబడిన అన్ని మండలాల్లో కేజీబీవీలు ఉన్నందున.. మంజూరు కష్టమని కేంద్రం చెబుతోంది. ఏప్రిల్ 20న జరగనున్న సమగ్ర శిక్షా అభియాన్ ప్రాజెక్టు ఆమోదిత మండలి (పీఏబీ) సమావేశంలో కేజీబీవీల మంజూరుపై మరోసారి కేంద్రానికి విన్నవించనున్నారు.
Also Read: