TS Inter Toppers 2025: ఇంటర్‌ ఫలితాల్లో అమ్మాయిల సత్తా.. టాప్ ర్యాంకులన్నీ వారివే!

ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఫలితాలు మంగళవారం (ఏప్రిల్ 22) విడుదలైనాయి. తాజా ఫలితాల్లో అమ్మాయిలు ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లో అమ్మాయిలు సత్తా చాటారు. మొత్తం ఫ‌స్టియ‌ర్ ఫ‌లితాల్లో 65.96 శాతం ఉత్తీర్ణత న‌మోదైంది. ఇందులో బాలిక‌లు 73.83 శాతం, బాలురు 57.83 శాతం ఉత్తీర్ణత సాధించారు..

TS Inter Toppers 2025: ఇంటర్‌ ఫలితాల్లో అమ్మాయిల సత్తా.. టాప్ ర్యాంకులన్నీ వారివే!
TG inter toppers

Updated on: Apr 23, 2025 | 5:52 AM

హైదరాబాద్‌, ఏప్రిల్ 22: తెలంగాణ ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఫలితాలు మంగళవారం (ఏప్రిల్ 22) విడుదలైనాయి. తాజా ఫలితాల్లో అమ్మాయిలు ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లో అమ్మాయిలు సత్తా చాటారు. మొత్తం ఫ‌స్టియ‌ర్ ఫ‌లితాల్లో 65.96 శాతం ఉత్తీర్ణత న‌మోదైంది. ఇందులో బాలిక‌లు 73.83 శాతం, బాలురు 57.83 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఫ‌స్టియ‌ర్ ప‌రీక్షల‌కు 4,88,430 మంది హాజ‌రు కాగా.. వారిలో 3,22,191 మంది ఉత్తీర్ణత సాధించారు. ఇక సెకండియ‌ర్‌ ఫలితాల్లో 65.65 శాతం ఉత్తీర్ణత న‌మోదైంది. ఇందులో బాలిక‌లు 74.21 శాతం, బాలురు 57.31 శాతం ఉత్తీర్ణత సాధించారు. సెకండియ‌ర్ ప‌రీక్షల‌కు 5,08,582 మంది హాజ‌రు కాగా.. వీరిలో 3,33,908 మంది ఉత్తీర్ణత సాధించారు.

తెలంగాణ ఇంటర్ 2025 ఫలితాలు

ఇక పరీక్షల సమయంలో మాల్‌ ప్రాక్టీస్ చేస్తూ పలువురు విద్యార్ధులు అధికారులకు పట్టుబడిన సంగతి తెలిసిందే. అందులో ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌లో 31 మంది పట్టుబడగా.. సెకండ్‌ ఇయర్‌లో 85 మంది విద్యార్ధులు కాపీ కొడుతూ దొరికిపోయారు. వీరందరినీ అధికారులు డీబార్‌ చేశారు.

ఇవి కూడా చదవండి

కాగా 2024-25 విద్యా సంవత్సరానికి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 9.97,012 లక్షల మంది విద్యార్థులు ఇంటర్‌ ఫస్ట్‌, సెకండ్‌ ఇయర్‌ పబ్లిక్‌ పరీక్షలు రాశారు. ఈ పరీక్షలు మార్చి 5 నుంచి 25వ తేదీ వరకు జరిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా 1532 పరీక్ష కేంద్రాల్లో ఈ పరీక్షలు జరిగాయి. వారిలో 4.88 లక్షల మంది ఫస్టియర్ విద్యార్థులు.. 5 లక్షలకుపైగా సెకండియర్ విద్యార్థులు ఉన్నారు. ఈసారి గ్రేడ్లకు బదులు మార్కులను ఇస్తున్నట్లు ఇప్పటికే ఇంటర్ బోర్డు వెల్లడించింది. గతేడాది కంటే ఫస్ట్ ఇయర్ 5.8% ఉత్తీర్ణత పెరిగింది. అలాగే గతేడాది కంటే సెకెండ్ ఇయర్‌లోనూ 2% ఉత్తీర్ణత పెరిగినట్లు అధికారులు తెలిపారు.

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.