TS Inter Results: తెలంగాణ ఇంటర్ ఫలితాలపై వివాదం.. తక్కువ మందిని పాస్ చేశారని విద్యార్థుల ఆందోళన

|

Dec 17, 2021 | 12:12 PM

తెలంగాణలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాలు వివాదాస్పదంగా మారాయి. ఉత్తీర్ణత శాతం తగ్గడంపై విద్యార్ధులు, తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

TS Inter Results: తెలంగాణ ఇంటర్ ఫలితాలపై వివాదం.. తక్కువ మందిని పాస్ చేశారని విద్యార్థుల ఆందోళన
Ts Inter exams
Follow us on

TS Inter 1st Year Exam Results: తెలంగాణలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాలు వివాదాస్పదంగా మారాయి. ఉత్తీర్ణత శాతం తగ్గడంపై విద్యార్ధులు, తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది 60 శాతం ఉత్తీర్ణత నమోదు కాగా.. ఈ ఏడాది కేవలం 49 శాతం మంది మాత్రమే పాసవడంపై వివాదం నడుస్తోంది. మరీ ఇంత తక్కువ శాతమేంటంటూ తల్లిదండ్రులు, విద్యార్ధులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.కరోనా టైమ్‌లో విద్యార్ధులు ఎన్నో ఇబ్బందులు పడి పరీక్షలు రాస్తే.. మరీ ఇంత తక్కువ మందిని పాస్ చేస్తారా అంటూ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు అభ్యంతరం తెలుపుతున్నారు. పేపర్ వాల్యుయేషన్ కఠినంగా చేసారనీ.. టాప్ క్లాస్ స్టూడెంట్స్ కూడా ఫెయిల్ అయ్యారంటూ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. నెల రోజులే టైమ్ ఇచ్చి పరీక్షలు పెట్టారని ఎస్ఎఫ్ఐ మండిపడుతోంది. ఇంటర్ బోర్డు నిర్లక్ష్యం కారణంగానే ఇంత మంది ఫెయిల్ అయ్యారంటూ విద్యార్థి సంఘాలు నిరసన వ్యక్తం చేస్తున్నాయి.

గత మార్చిలో కరోనా ఉధృతి కారణంగా ప్రభుత్వం పరీక్షలు లేకుండానే ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్‌ను సెకండియర్లోకి ఇంటర్ బోర్డు ప్రమోట్ చేసింది. ప్రస్తుతం కరోనా ప్రభావం కాస్త తగ్గడంతో మళ్లీ విద్యార్థులకు పరీక్షలు నిర్వహించింది. ఆ టైంలో కూడా ఇంటర్ బోర్డ్ పై తల్లిదండ్రులు, విద్యార్థుల నుంచి ఆగ్రహం వ్యక్తమైంది.

కరోనా ప్రత్యేక పరిస్థితుల వల్ల విద్యార్థులు సరిగా చదవలేకపోయారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆన్లైన్ క్లాసులు సరిగా అర్థం కాలేదన్నారు. ఈ సిట్యువేషన్లో పరీక్షలు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై కొందరు కోర్టుకు కూడా వెళ్లారు. అయితే పరీక్షల నిర్వహణకే కోర్టు ఓకే చెప్పింది. దీంతో పరీక్షలను నిర్వహించారు అధికారులు.

ఇంటర్ కార్యాలయం ఎదుట ఆందోళన..

హైదరాబాద్‌లోని ఇంటర్ బోర్డు కార్యాలయం ఎదుట విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టారు. ఇంటర్ బోర్డు నిర్లక్ష్యం కారణంగా ఎక్కువ మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారని ఆరోపించారు. విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఆందోళన చేస్తున్న విద్యార్థి సంఘాల ప్రతినిధులను పోలీసులు అరెస్టు చేశారు.

Also Read..

Ramesh Kumar Comments: కర్నాటక మాజీ మంత్రి ‘అత్యాచార’ వ్యాఖ్యలు.. మండిపడ్డ నెటిజన్లు.. క్షమాపణ కోరిన నేత!

Pushpa Movie : ‘పుష్ప’ పార్ట్ 2కి ఇంట్రస్టింగ్ టైటిల్.. రివీల్ చేసిన దర్శకుడు సుకుమార్..