Govt Jobs 2026: నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. త్వరలో భారీగా పోలీస్ ఉద్యోగ నియామకాలకు నోటిఫికేషన్

రాష్ట్ర నిరుద్యోగ యువతకు మరో శుభవార్త. రాష్ట్రంలో దాదాపు 5 వేల పోలీస్ ఉద్యోగాల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. గత 15 నెలల్లో 67,760 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసినట్లు వెల్లడించిన ఆయన, ఇకపై టీజీపీఎస్సీ నియామకాల్లో యూపీఎస్సీ తరహా పారదర్శక విధానాలను అమలు చేయనున్నట్లు తెలిపారు. అలాగే యువత నైపుణ్యాభివృద్ధి, రైతు రుణమాఫీ వంటి అంశాలపై కూడా కీలక వ్యాఖ్యలు చేశారు..

Govt Jobs 2026: నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. త్వరలో భారీగా పోలీస్ ఉద్యోగ నియామకాలకు నోటిఫికేషన్
Telangana Police Jobs

Updated on: Jun 07, 2026 | 3:13 PM

హైదరాబాద్‌, జూన్‌ 7: తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులకు రేవంత్‌ సర్కార్‌ వరుస గుడ్‌ న్యూస్‌లు చెబుతుంది. ఈ క్రమంలో త్వరలోనే మరో ఉద్యోగ ప్రకటనకు సమాయత్త మవుతోంది. దాదాపు 5 వేల పోలీస్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియా సదస్సులో వెల్లడించారు. ది హిందూ దినపత్రిక బెంగుళూరులో నిర్వహించిన The Hindu Huddle 2026 చర్చా గోష్ఠిలో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్‌ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. తెలంగాణ అభివృద్ధి ప్రణాళికలు, రాజకీయ, సామాజిక, పరిపాలనా, వ్యక్తిగత అంశాలకు సంబంధించిన పలు ప్రశ్నలకు సమాధానాలు తెలిపారు.

Also read: మొసళ్లు, సింహం, పాము.. ఆ వ్యక్తి ప్రాణాలు ఎలా కాపాడుకోవాలి? మీ తెలివికి సవాల్ విసిరే చిక్కుప్రశ్న

ఈ సందర్భంగా రాష్ట్రంలో చేపట్టిన ఉద్యోగ నియామకాలపై స్పందించారు. గత 15 నెలల్లో మొత్తం 67,760 ఉద్యోగాలను తెలంగాణ రాష్ట్రంలో తమ ప్రభుత్వం భర్తీ చేసిందని వెల్లడించారు. దేశంలోనే అత్యధికంగా ఉద్యోగ అవకాశాలు కల్పించిన రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని ముఖ్యమంత్రి రేవంత్‌ తెలిపారు. ఉద్యోగ నియామకాల్లో అవకతవకలను నివారించడానికి, పరీక్షలను మరింత పారదర్శకంగా నిర్వహించేందుకు ఇకపై రాష్ట్రంలో టీజీపీఎస్సీ (TGPSC) ద్వారా చేపట్టే నియామక ప్రక్రియలకు యూపీఎస్సీ తరహా విధానాలను అమలు చేయనున్నట్లు సీఎం రేవంత్‌ స్పష్టం చేశారు.

ఇవి కూడా చదవండి

Also read: 100లో నుంచి 10ని ఎన్ని సార్లు తీసేయగలం? 90 శాతం మంది తప్పులో కాలేసే చిక్కుప్రశ్న..

అలాగే ఏఐ వల్ల ఉద్యోగాలు పోతున్నాయని యువత ఆందోళన చెందుతున్న పరిస్థితుల్లో ప్రత్యామ్నాయంగా నైపుణ్యాలు పెంచడానికి తెలంగాణ పలు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, పాత పాత సిలబస్‌తో మూస పద్ధతిలో కొనసాగుతున్న ఐటీఐలను అత్యాధునిక టెక్నాలజీ సెంటర్లు (ATC)లుగా అప్ గ్రేడ్ చేసినట్లు తెలిపారు. రైతుల ఆత్మహత్యల గురించి మాట్లాడుతూ.. ఇందుకు ప్రధాన కారణం అప్పులని అన్నారు. గతంలో రైతు ఆత్మహత్యల్లో మహారాష్ట్ర తొలి స్థానంలో, తర్వాత స్థానంలో తెలంగాణ ఉండేదని అన్నారు. కానీ తాము అధికారంలోకి వ‌చ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఏకంగా 25,035 రైతు కుటుంబాల‌కు చెందిన రూ.20,616 కోట్ల రుణాల‌ను మాఫీ చేసినట్లు తెలిపారు. ఇది దేశంలోనే అత్యధిక రుణ‌మాఫీ అని గుర్తు చేశారు.

Also read: విద్యార్ధులకు ఎగిరిగంతేసే న్యూస్.. జూన్ 30 వరకు వేసవి సెలవులు పొడిగించిన ఆ రాష్ట్ర ప్రభుత్వం

Loading...
Unable to load recommendations.
Follow Us