AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TS govt Jobs 2022: తెలంగాణ 80,039 కొలువుల భర్తీకి నిర్వహించే పరీక్షలు ఆన్‌లైన్‌లోనా? ఆఫ్‌లైన్‌లోనా?

పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల సంఖ్య నలభైవేలలోపు ఉంటే పరీక్ష ఆన్‌లైన్‌లో.. అంతకంటే ఎక్కువ ఉంటే ఆఫ్‌లైన్‌లో..

TS govt Jobs 2022: తెలంగాణ 80,039 కొలువుల భర్తీకి నిర్వహించే పరీక్షలు ఆన్‌లైన్‌లోనా? ఆఫ్‌లైన్‌లోనా?
Ts New Govt Jobs
Srilakshmi C
|

Updated on: Mar 26, 2022 | 3:18 PM

Share

TS Govt Jobs Notification 2022: తెలంగాణ రాష్ట్రంలోని వివిధ శాఖల్లో ఖాళీగావున్న 80,039 కొలువుల భర్తీకి కార్యచరణ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. ఐతే నియామకాల భర్తీకి నిర్వహించే అర్హత పరీక్షల సిలబస్‌, పరీక్ష విధానం వంటి తదితర అంశాలపై పోటీపడే అభ్యర్ధులకు సందేహాలు లేకపోలేదు. వీటికి సంబంధించి పూర్తి క్లారిటీ త్వరాలో ఇవ్వనున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. తాజాగా పరీక్షలు ఆన్‌లైన్‌ (online exams)లో జరుగుతాయా? లేదా ఆఫ్‌లైన్‌లో జరుగుతాయా అనే విషయానికి సంబంధించి ఓ ప్రకటన వెలువడింది. అందేంటంటే.. కొత్త నియామకాలకు సంబంధించి ఏ నోటిఫికేషన్‌కైనా దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల సంఖ్య 40,000ల కంటే తక్కువ ఉంటే ఆ పరీక్షను ఆన్‌లైన్‌లో నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. అంతకన్నా ఎక్కువ సంఖ్యలో దరఖాస్తు చేసుకుంటే ఆఫ్‌లైన్‌ (రాత పరీక్ష)లో పరీక్షలు నిర్వహించనుంది. సాధారణంగా తెలంగాణ రాష్ట్రంలో పోటీ పరీక్షలు లిఖితపూర్వకంగా జరుగుతుంటాయి. ఈసారి నియామక ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసేందుకు ఆన్‌లైన్‌ విధానాన్ని సైతం పరిగణనలోకి తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

మరోవైపు రాష్ట్రంలో ఆన్‌లైన్‌ పరీక్షల నిర్వహణకు గల సాధ్యాసాధ్యాలపై ప్రభుత్వ ఆరా తీస్తోంది. ఎందుకంటే ఆన్‌లైన్‌ పరీక్షలకు కంప్యూటర్లు, నెట్‌వర్క్‌, ఫర్నిచర్‌, ఇతర మౌలిక వసతులు అవసరం అవుతాయి. రాష్ట్రవ్యాప్తంగానున్న ప్రభుత్వ, ప్రైవేటు ఇంజినీరింగు కళాశాలలు, ఇతర సంస్థల్లో దాదాపు 50,000ల కంప్యూటర్లు అందుబాటులో ఉన్నట్లు తేలింది. ఈ కాలేజీల్లో 40,000ల మంది వరకు పరీక్షలు రాసే అవకాశం ఉన్నట్లు గుర్తించారు. గ్రూప్‌1, పోలీసు, విద్యాశాఖ వంటి వాటికి లక్షల సంఖ్యలో అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే వీలున్నందున వాటిని ఆన్‌లైన్‌లో నిర్వహించడం కుదరదు. ఇంజనీర్లు, వైద్యులు, ఇతర కేటగిరిలకు జరిగే పరీక్షల్లో 40,000ల మంది లోపే దరఖాస్తు చేసుకునే వీలుంటుంది. కాబట్టి ఇలాంటి పరీక్షలు ఆన్‌లైన్‌లో నిర్వహించే అవకాశం ఉంది. ఆన్‌లైన్‌ పరీక్షల సన్నద్ధతపై త్వరలోనే రాష్ట్ర నియామకాల కమిటీతో ప్రభుత్వం ప్రత్యేక సమావేశం నిర్వహించనుంది. సమావేశం అనంతరం ఏయే కేటగిరీలకు ఆన్‌లైన్‌ పరీక్షలు నిర్వహించాలి, ఏఏ పోస్టులకు ఆఫ్‌లైన్‌ పరీక్షలు నిర్వహించాలనే అంశంపై కూలంకషంగా తెలపనున్నట్లు సమాచారం.

Also Read:

JIPMER Recruitment 2022: నెలకు రూ.90,000ల జీతంతో.. జిప్‌మర్‌లో 51 సీనియర్‌ రెసిడెంట్ ఉద్యోగాలు!

పంటి ఎనామిల్‌ను నాశనం చేస్తున్న అలవాటు.. మానకుంటే కష్టమే!
పంటి ఎనామిల్‌ను నాశనం చేస్తున్న అలవాటు.. మానకుంటే కష్టమే!
వైభవ్‎ సూర్యవంశీకి పట్టపగలు చుక్కలు చూపెట్టిన హైదరాబాద్ ప్లేయర్
వైభవ్‎ సూర్యవంశీకి పట్టపగలు చుక్కలు చూపెట్టిన హైదరాబాద్ ప్లేయర్
ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే
ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా