TSPSC Group 1 Posts 2022: టీఎస్‌పీఎస్సీ ఓటీఆర్‌ సవరణలు 10% మాత్రమే.. గ్రూప్‌ 1 దరఖాస్తులూ అంతంతమాత్రమే!

తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే పోలీస్‌ శాఖలో పలు నోటిఫికేషన్లు, గ్రూప్‌ 1 నోటిఫికేషన్‌ విడుదలైనప్పటికీ టీఎస్‌పీఎస్సీలో వన్‌టైమ్‌ రిజిస్ట్రేషన్‌ (TSPSC OTR Edit Process) సవరణ ప్రక్రియ నత్తనడకన..

TSPSC Group 1 Posts 2022: టీఎస్‌పీఎస్సీ ఓటీఆర్‌ సవరణలు 10% మాత్రమే.. గ్రూప్‌ 1 దరఖాస్తులూ అంతంతమాత్రమే!
Tspsc
Follow us

|

Updated on: May 08, 2022 | 3:28 PM

TSPSC Group-1 application last date: తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే పోలీస్‌ శాఖలో పలు నోటిఫికేషన్లు, గ్రూప్‌ 1 నోటిఫికేషన్‌ విడుదలైనప్పటికీ టీఎస్‌పీఎస్సీలో వన్‌టైమ్‌ రిజిస్ట్రేషన్‌ (TSPSC OTR Edit Process) సవరణ ప్రక్రియ నత్తనడకన కొనసాగుతోంది. ఇప్పటికే దాదాపు 25 లక్షల మంది ఉద్యోగార్థులు ఓటీఆర్‌ రిజిస్ట్రేషన్‌ చేసుకున్నప్పటికీ.. వీటిలో ఇప్పటి వరకు కేవలం 1,83,482 మంది మాత్రమే సవరణ చేసుకున్నారు. రాష్ట్రపతి నూతన ఉత్తర్వులకు అనుగుణంగా ఓటీఆర్‌ సవరణకు నెలన్నర ముందే అవకాశం కల్పించినా 10 శాతం మంది కూడా వినియోగించుకోలేదు. గ్రూప్‌-1 ఉద్యోగ ప్రకటన నేపథ్యంలో ఇటీవల క్రమంగా పెరుగుతున్నా.. కమిషన్‌ ఆశించిన స్థాయిలో స్పందన లేదు. టీఎస్‌పీఎస్సీ తొలుత పదో తరగతి విద్యార్హత కలిగిన వీఆర్‌ఏ నుంచి గ్రూప్‌-2 వరకు ఉద్యోగాలకు ప్రకటనలు ఇచ్చింది. దీంతో దాదాపు 25 లక్షల మంది రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు. ఆ తర్వాత కమిషన్‌ స్పష్టమైన రోడ్‌మ్యాప్‌ సూచించడంతో వివిధ పోస్టుల భర్తీకి ప్రత్యేక రాక్రూట్‌మెంట్‌ బోర్డులను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో ఓటీఆర్‌ల సంఖ్య తగ్గనున్నట్లు సమాచారం.

అందుకే గ్రూప్‌-1 ఉద్యోగాలకు వెంటనే దరఖాస్తు చేసుకోండి.. గ్రూప్‌-1 ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ నెమ్మదిగానే కొనసాగుతోంది. మే 2న స్వీకరణ ప్రారంభమైనప్పటి నుంచి 41,880 మంది దరఖాస్తు చేసుకున్నారు. టెట్‌కు భారీగా దరఖాస్తులు రావడంతో హైదరాబాద్‌ చుట్టూ ఉన్న జిల్లాల పరీక్ష కేంద్రాలు వెంటనే నిండిపోయాయి. ఈ నేపథ్యంలో గ్రూప్‌-1 ప్రిలిమినరీ కోసం 33 జిల్లా కేంద్రాల్లో కమిషన్‌ ఏర్పాట్లు చేస్తోంది. టెట్‌ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని నిరుద్యోగ అభ్యర్థులు వీలైనంత త్వరగా దరఖాస్తు చేసుకుంటే పరీక్ష కేంద్రాల కేటాయింపులో ఇబ్బందులు ఉండవని నిపుణులు చెబుతున్నారు.

Also Read:

CCI Recruitment 2022: సిమెంట్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌లో మేనేజర్‌ ఉద్యోగాలు..బీఈ/బీటెక్‌ చేసినవారు అర్హులు..

Latest Articles