TS Govt Jobs 2022: గుడ్‌న్యూస్! మరో 3,334 ఉద్యోగాలకు తెలంగాణ సర్కార్ గ్నీన్ సిగ్నల్.. ఖాళీల వివరాలివే..
తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త .. తొలి విడతగా 30,453 ఉద్యోగ ఖాళీల భర్తీకి ఇప్పటికే అనుమతులు ఇచ్చిన ఆర్థిక శాఖ ఈ రోజు (ఏప్రిల్ 13) మరో 3,334 ఉద్యోగ నియమాకాలకు అనుమతినిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది..
TS govt gives green signal for 3,334 posts: తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త .. తొలి విడతగా 30,453 ఉద్యోగ ఖాళీల భర్తీకి ఇప్పటికే అనుమతులు ఇచ్చిన ఆర్థిక శాఖ ఈ రోజు (ఏప్రిల్ 13) మరో 3,334 ఉద్యోగ నియమాకాలకు అనుమతినిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. శాసన సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 80,039 ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తామని ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. సీఎం కేసీఆర్ ఆదేశాల మేర తొలి విడతగా 30, 453 ఖాళీల భర్తీకి అనుమతిస్తూ ఆర్థిక శాఖ జీవోలు జారీ చేసింది. ఈ నియామక ప్రక్రియకువేగంగా సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఫైర్ సర్వీసు, ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్, అటవీ శాఖల్లోని 3,334 ఖాళీల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతులు తెలిపింది. మిగతా శాఖల్లోని ఉద్యోగ ఖాళీల భర్తీ ప్రక్రియకు ఆర్థిక శాఖ వేగంగా సన్నాహాలు చేస్తోంది.